వైఎస్ వివేకా మరణంపై పోలీసులకు ఫిర్యాదు

March 15, 2019 | News Of 9

ys vivekananda reddy | Telugu.news of 9

  • తలపై గాయాలున్నట్లు గుర్తించిన పీఏ
  • అనుమానాస్పద కేసుగా నమోదు

కడప: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడుజగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి (68) కన్నుమూశారు. వివేకానంద రెడ్డి గురువారం (మార్చి 15) అర్థరాత్రి ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. వివేకానంద రెడ్డి మృతి వైసీపీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా కనిపించిన ఆయన.. సడెన్ గా మృతి చెందడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర రాజకీయ అంశాల్లో చురుగ్గా కనిపించిన వ్యక్తి హఠాత్తుగా చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. వైఎస్ సోదరుడిగాజగన్ బాబాయ్ గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడి భుజంగా మెలిగారు. అన్ని విషయాల్లో అన్నకు చేదోడు వాదోడుగా నిలిచారు. వైఎస్.వివేకానందరెడ్డి హఠాన్మరణానికి అనేక మంది రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించిన వివేకానంద రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి చిన్న తమ్ముడు. గతంలో మంత్రిగా  ఎంపీగా ఎమ్మెల్సీ గా పని చేశారు. 19891994 లో రెండుసార్లు పులివెందుల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 వైఎస్ వివేకా మరణం పై పోలీసులకు ఫిర్యాదు

వైఎస్ వివేకా మరణం పై వివేకా పీఏ కృష్ణా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణం సమయంలో వివేకా.. ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు సమాచారం. తలపై గాయాలు ఉండటంతో పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉందని సమాచారం.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *