సైరా-సాహో ఢీ అంటే ఢీ అంటాయా?

November 29, 2018 | News Of 9

Sye Raa Narasimha Reddy Vs Sahoo Movie

టాలీవుడ్‌లో అప్‌క‌మింగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టుల్లో ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’ ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మరోపక్క యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ ‘సాహో’. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నట్లు టాలీవుడ్‌లో టాక్ మొద‌లైంది. ‘సైరా’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఖారారైపోయింది అనుకుంటున్న తరుణంలో సినిమా 2019 ఆగస్ట్‌ 15కు వాయిదా వేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

‘సైరా’ సినిమా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతోంది కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజునే విడుదల చేస్తే బాగుంటుందని చిత్రయూనిట్ అనుకుంటోంద‌ట‌. మరోవైపు ‘సాహో’ సినిమాను కూడా ఆగస్ట్‌ 15న విడుదల చేయాలని సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి ఈ రెండు సినిమాల మేక‌ర్ల‌ నుంచి అఫీస‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

మొత్తానికి రెండు టాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులు ఒకే రోజు విడుద‌లైతే గ‌న‌క‌ పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంద‌న‌డంలో డౌట్ లేదు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *