2019లో ఆశ్చర్యపోయే ఫలితాలు… సిద్ధంగా ఉండండి… !!

January 20, 2019 | News Of 9

  •  కోస్తా జిల్లాల్లో ఇప్పటికే మార్పు కనిపిస్తోంది
  • జనసేన ముగ్గులు వేసుకుంటూ మురిసిపోతున్న మహిళలు
  • యువత, మహిళలు.. పవన్ కళ్యాణ్ వైపునే
  •  ఫలిస్తున్న ‘‘కులాల కలయిక’’ పిలుపు
  •  ‘‘న్యూస్ ఆఫ్ 9’’ క్షేత్ర స్థాయి పరిశీలన

అమరావతి: రానున్న 2019 ఎన్నికలు ముఖ్యంగా మూడు పార్టీలూ, ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరగనున్నాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలూ, వాటి అధినేతలు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ల మధ్యే రసవత్తరమైన ఈ పోటీ. స్వచ్ఛమైన రాజకీయాలను అందించే హామీతో జనసేన 175 సీట్లలో బరిలోకి దిగుతుండగా, జనసేన పార్టీ అవకాశాలను దెబ్బ తీసేందుకు మిగిలిన రెండు పార్టీలూ అబద్ధాలను, అపోహల్నీ ప్రచారంలో పెడుతున్నాయి. జగన్ కంటే ఈ విషయంలో చంద్రబాబు రెండు అడుగులు ముందే ఉన్నారు. అబద్ధాలను అలవోకగా చెప్పి ఇతర పార్టీల అవకాశాలను దెబ్బతీసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఉదాహరణకు జనసేన విషయంలో చంద్రబాబు జిల్లా పార్టీల అధ్యక్షుల స్థాయిలో పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నారు. కోస్తా జిల్లాల్లోని ఒక జిల్లా పార్టీ టీడీపీ అధ్యక్షుడు స్థానికంగా ఉన్న కాపు సామాజిక వర్గం వారి వద్ద టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారంలో పెడుతున్నారు. జనసేన 40 సీట్లు అడిగిందని, 20 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆయన తన ముందున్న 30 మందికి చెప్పారు. రహస్యమంటూనే.. 30 మందికి ఈ విషయాన్ని చెప్పడాన్ని బట్టి జనసేన అవకాశాలను దెబ్బతియ్యాలన్న ఆయన కోరిక అన్నది సుస్పష్టం. ఇదే విధంగా తెలుగుదేశంలోని సీనియర్ నేతలు కూడా రాజకీయ పార్టీల వార్తలను రాసే… సీనియర్ జర్నలిస్టులకు కూడా చెబుతూవస్తున్నారు. 175 సీట్లలో తాము పోటీ చేస్తామని పవన్ చెప్పినా… తెలుగుదేశం నేతలు దీని గురించే ప్రచారం చేస్తున్నారు. అయితే… దేశం నేతలు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని జన సైనికులు, ప్రజలు నమ్ముతున్నారు. ప్రజారాజ్యం సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మనుషులే దెబ్బకొట్టిన అనుభవాన్ని గుర్తు చేసుకుని, జనసేన గురించి యల్లో మీడియాగానీ, ఆయా నేతలు చెబుతున్న విషయాలను నమ్మడం లేదు.

ప్రత్యమ్నాయ రాజకీయాలు రావాలనీ, జనసేన ఒక్కటే ఆ మార్పును తేగలదని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎన్నికలు వచ్చిన తర్వాత జనసేనకు ఓటు వేస్తామని, ఈ లోగా హడావుడి చేయాల్సిన పని లేదని ఎక్కువమంది చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ… ప్రజల్ని వేటాడుతోందని, ఎవరు ఏ పార్టీకి ఓటు వేస్ అవకాశం ఉందన్నది ఆ పార్టీ అంచనా వేసుకుంటున్నదని, ఇతర పార్టీల వారిని తొక్కేందుకు ప్రయత్నిస్తోందనీ జనసేన శ్రేణులు గుర్తించాయి.

రాష్ట్రంలో చంద్రబాబు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పదేళ్ల కిందట గ్రామాలు ఎలా ఉన్నాయో నేటికీ అలాగే ఉన్నాయి. కోస్తాంధ్రలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల నిర్మాణం చురుగ్గా సాగుతున్నా… రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజక్టులేమీ కనిపించడం లేదు. దీంతో రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు హడావుడి చేయడం తప్ప అభివృద్ది చేసిందేమీ లేదన్నది పలువురి అభిప్రాయంగా ఉంది. ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు పించనును రూ.2 వేలకు పెంచినట్లు ప్రజలు భావిస్తున్నారు. జనసేన అభిమానులు నిర్వహిస్తున్న సోషల్ మీడియా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్నది. చంద్రబాబు పరిస్థితి ఇలాగ ఉండగా, చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత మొత్తం తమకే ఓట్ల రూపంలో వస్తుందని వైసీపీ భావిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో తప్ప… వైసీపీకి కోస్తా జిల్లాల్లో పెద్ద ప్రభావం కనిపించడం లేదు. రాష్ట్రాన్ని విడదీసిన కేసీఆర్ తో స్నేహం ఉన్నందున, ఆ కోపం జగన్ పై పడుతున్నది. స్థానిక నేతలు వైసీపీ పార్టీలో కొనసాగడంపైనా ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. అలాగే జగన్ పై ఉన్న కేసులు, వైసీపీ అసెంబ్లీకి హాజరుకాకపోవడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. అవినీతికి పాల్పడకుండా, కేవలం ప్రజాసేవకే పరిమితం కావాలనుకున్న నేతలకు జనసేన ఒకవైపు ఆహ్వానం పలుకుతున్నది. టీడీపీ, వైసీపీలు మాత్రం ఎవరు వచ్చినా ఫర్వాలేదన్న భావనలో అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి. ఈ సారి యువత ఎక్కువగా ఎన్నికల్లో పాల్గొంటున్నందున అది జనసేనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఆశ్చర్యం కలిగించే అంశాలు ఉంటాయనీ, 2019 ఎన్నికల్లో… కూడా అటువంటి అంశం ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీవీ 99 ఇంటర్య్యూలో చెప్పారు. 40 సీట్లు వస్తాయన్న అంచనాలపై వ్యాఖ్యానించమని 99 విలేకరి అడగ్గా… పవన్ సర్ ప్రైజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నారు. తాను ఎన్నికలను అలా చూడటం లేదని, ఏదైనా జరగవచ్చంటూ నర్మగర్భంగా మాట్లాడారు. దీనిని బట్టి… ఆయనకే మెజారిటీ వస్తుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారని అర్థం అవుతున్నది. చంద్రబాబు తన సొంత పత్రికల్ని నమ్ముకోగా, జగన్ సాక్షిని నమ్ముకున్నారు. పవన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా యువ హృదయాల్లోకి దూసుకుపోతున్నారు. జనసేన విజయావకాశాల గురించి ఒక ఛార్టెట్ అక్కౌంటెంటును ప్రశ్నంచగా… ‘‘మేము బ్రాహ్మలం.. మా పూర్వీకులు పెట్టిన కుల వ్యవస్థ కారణంగా అనేక మంది కుల వివక్షకు గురవుతున్నారు. అందుకు నేను చింతిస్తున్నాను. కులాలే వద్దంటున్న జనసేన సిద్ధాంతం నచ్చింది. మీరేమైనా అనుకోండి. నా ఓటు జన సేనకే’’ అని ట్విటర్ ద్వారా తన వ్యక్తిగత సందేశాన్ని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ కు పంపించారు. రాజకీయాల్లో ఉన్న తమ సామాజిక వర్గం వారే కులానికి చెడ్డ పేరు తెస్తున్నారని, లేదంటే తాము కూడా మంచివాళ్లమేనని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు ‘‘న్యూస్ ఆఫ్ 9’’ వెబ్ సైట్ కు సందేశాన్ని పంపారు. ‘‘చిరంజీవి పార్టీ పెట్టినపుడు కావాలనే ఒక సామాజిక వర్గం వారు దెబ్బతీశారని, అది చిరంజీవి వైఫల్యంగా భావించరాదని, ఈ సారి జనసేనకు ఓటు వేయడం ద్వారా దీనిని నిరూపిస్తాం’’ అని చిన్న వ్యాపారి చెప్పారు. తమ సామాజిక వర్గం వారే అయినా… కొందరు వైసీపీ, టీడీపీల్లో ఉన్నారని, వారికి కూడా తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.

మారు మూల గ్రామాల్లో… వైసీపీ పోస్టర్లు, బ్యానర్లు కనిపించాయి. క్రైస్తవ మిషనరీలు ఉన్న ప్రాంతాల్లోనే ఈ పోస్టర్ల ప్రభావం కనిపిస్తోంది. జగన్ బంధువు అనిల్ కుమార్ ప్రభావంతో…. క్రైస్తవ మిషనరీలు వైసీపీ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వీటి ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ పోస్టర్ల కంటే ప్రభుత్వ పథకాల పోస్టర్లు అక్కడక్కడా దర్శనమిచ్చాయి కానీ… పార్టీ పరమైన హడావిడి కనిపించ లేదు. కోస్తా జిల్లాల్లో ఈ రెండు పార్టీల ప్రభావం ఆ పార్టీలు ఊహించనంత కానరాలేదు.

జనసేనతోనే.. మహిళలు, కలిసి వచ్చిన గాజు గ్లాసు

జనసేన పార్టీకి ఎన్నికల సంఘం కేటాయించిన గాజు గ్లాసు గుర్తు కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. కోస్తా జిల్లాల్లో గాజు గ్లాసు గుర్తు ఇప్పటికే జన బాహుళ్యంలోకి వెళ్లిపోయింది. ఇపుడది ఇంటి ముందు సంక్రాంతి ముగ్గుల మధ్యలో కిరీట స్థానాన్ని ఆక్రమించింది. గ్రామ ప్రాంతాల్లో పురుషుల కంటే కూడా… మహిళలు జనసేనపై మక్కువను చూపిస్తున్నారు. అతిధులు వస్తే టీ ఇచ్చేందుకు ఇప్పటి వరకూ టీ కప్పులు మాత్రమే ఇళ్లలో ఉండేవి. ఇపుడు రంగు రంగుల లతలతో ఉండే ఆ టీ కప్పులు మాయమై…వాటి స్థానంలో గాజు గ్లాసులు చేరాయి. అతిథులకు గాజు గ్లాసుల్లోనే టీ అందిస్తున్నారు. అదేమిటి అంటే… ‘‘ఇప్పుడు ఇంతే’’ అంటూ మహిళలు ఆనందంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మార్పులు ఈ రకంగా ఉండటాన్ని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ గుర్తించింది.

పురుషులు యల్లో పత్రికలు చదివి వింతగా ఆలోచిస్తారుగానీ… మహిళలు పుచ్చు వంకాయల్ని తేలిగ్గా ఎడమ చేత్తో ఏరిపారేస్తారు. అందులో వారు నిపుణులు. పురుషులు చెప్పినా వారు వినరు. జనసేనకు మహిళల్లో చక్కటి ఆదరణ కనిపిస్తోంది. జనసేన పార్టీ గుర్తులను వారు ఇంటి ముందు రంగు రంగుల్లో చిత్రించుకుని మురిసిపోతున్నారు. యువత ఎలాగూ జనసేన వైపే ఉన్నది. ఈ ఓటు బ్యాంకు జనసేన ఖాతాలోనే ఉంది.

పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పు ఇప్పటికే గ్రామాల్లో… కనిపిస్తోంది. 4 శాతం ఉన్నవారు 90 శాతంగా ఉన్న వారికి ఓటు వేయరుగానీ… తామెందుకు వేయాలి అన్న వివేచన గ్రామీణుల్లో కనిపిస్తోంది. ఇప్పటి వరకూ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు కూడా పాతకాలం పార్టీలు, వారి కుయుక్తులు తెలుసు గనుక వారు పాత పార్టీలకు ఎక్కువ ఓట్లు వస్తాయని, కొత్త పార్టీలో నాయకులు గుంపులు గుంపులుగా లేరు కాబట్టి… 50 సీట్లు రావచ్చని చెబుతారు.

తెరాస ఓడిపోతుందని తెలంగాణలో విశ్లేషణలు చేసిన తలపండిన జర్నలిస్టులు తెరాస గెలిచిన తర్వాత నోళ్లు వెళ్లబెట్టారు. అదేమని అడిగితే… కేసీఆర్ పథకాలు గెలిచాయి అని ఈనాడుతో సహా అందరూ రాసుకున్నారు. కానీ వాస్తవం వేరు. 2019లో కూడా టీడీపీ, వైసీపీలకు భారీగా సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటారు. రేపు జనసేన భారీగా గెలిస్తే…. చివరి నిమిషంలో వేవ్ వచ్చిందని, అంతా మారిపోయిందని, అలా వస్తుందని తాము కూడా ఊహించలేదని రాసుకుంటారు. చెప్పుకుంటారు. లేదంటే… కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడమే బాబు కొంప ముంచిందని తప్పుకుంటారు. ఇలా రాసుకోవడానికి వారంతా సిద్ధంగా ఉంటారు. ప్రజలు మాత్రం వారు ఇవ్వాల్సిన తీర్పును సిద్ధం చేసుకున్నారు. ఆశ్చర్యపోవడానికి టీడీపీ, వైసీపీలతోపాటు రాజకీయ విశ్లేషకులు కూడా సిద్ధంగా ఉంటే మంచిది. తెలంగాణలో తెరాస గెలుస్తుందని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ ముందే చెప్పింది. మా పాఠకులకు ఈ విషయాలు గుర్తుండవచ్చు.

Other Articles

2 Comments

  1. Hello! I could have sworn I’ve been to this blog before but after browsing through some of the post I realized it’s new to me. Anyways, I’m definitely happy I found it and I’ll be book-marking and checking back frequently!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *