ఆంధ్రాకు రమ్మంటున్నారు.. వెళతాం: కేసీఆర్

December 11, 2018 | News Of 9

KCR | telugu.newsof9.com

హైదరాబాద్: దేశ రాజకీయాలను దిశానిర్దేశం చేయడంలో భాగంగా ఏపీ రాజకీయాల్లో కూడా తమ వంతు పాత్రను పోషిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చిన తర్వాత తాము అక్కడికి వెళ్లకపోతే బాగుండదని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఆయన పాల్గొన్న తర్వాత అందుకు ప్రతిగా తాము కూడా పాల్గొనకపోతే బాగుండని అన్నారు. ‘‘పుట్టిన రోజున ఎవరైనా గిఫ్టు ఇస్తే మళ్లీ మనం తిరిగి ఇస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. ఇవ్వకపోతే తెలంగాణకు సంస్కారం లేదని మరో మాట అంటారు’’ అని చమత్కరించారు. ప్రాంతీయ పార్టీలతోకలిపి జాతీయస్థాయి పార్టీని కొత్తగా ఏర్పాటు చేస్తామని చెప్పినపుడు… మరి చంద్రబాబును కూడా కలుస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించగా ‘‘హి ఈజ్ ఏ పూర్ చాప్’’ అంటూ ఆయన గురించి ఎందుకు పదే పదే అడుగుతున్నారంటూ జాలిపడ్డారు కేసీఆర్. తెలంగాణలో ఫలితాలను చూసిన తర్వాత ఆంధ్రా నుంచి అనేక మంది ఫోన్లు చేసి అభినందనలు తెలిపారని, వాట్సాప్ నుండా మెసేజులే ఉన్నాయని అన్నారు. ఆంధ్ర రాజకీయాల్లో పాలుపంచుకోవాలని వారంతా కోరుతున్నారని అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *