‘‘అక్షయపాత్ర’’ పథకానికి విరాళమిచ్చిన పవన్ ఫ్యాన్స్!!

May 15, 2019 | News Of 9

  • పేదల భోజన పథకానికి రవాణా వాహనం

(న్యూస్ ఆఫ్ 9)

ఎక్కడున్నా… ప్రజోపయోగ పనుల విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. వివిధ ప్రాంతాల్లో పేదలకు రూ.5 భోజనం అందిస్తున్న ‘‘అక్షయపాత్ర’’ పథకానికి అమెరికాలోని ‘‘గ్లోబల్ ఎన్నారై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్’’ 25 వేల డాలర్ల (సుమారు రూ.17 లక్షలు)ను విరాళంగా అందించారు. ఈ విరాళంతో అక్షయపాత్ర పథకం నిర్వాహకులు అయిన ఇస్కాన్ సరకు రవాణా వాహనాన్ని సమకూర్చుకున్నది. మంగళవారం తెలంగాణలోని కంది గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఈ వాహనాన్ని ఎన్నారై మధు దాసరి జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

గుంటూరుజిల్లాలోని వేంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన అన్నదాన పథకానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూ.1.32 కోట్లను విరాళంగా అందించారు. కష్టాల్లో ఉన్నవారిని అదుకోవడంలో పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ ముందుంటారు. నాయకుడు స్ఫూర్తిని అందిపుచ్చుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉంటారు. ఈ స్ఫూర్తి కేవలం మన దేశంలోనే కాకుండా, విదేశాల్లోని పవన్ అభిమానులైన ఎన్నారైలు కూడా ఇతోధికంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. శ్రీకాకుళంలో వచ్చిన తితిలీ తుపాను సమయంలో కూడా జనసేన పార్టీకి చెందిన ఎన్నారైలు తుపాను సహాయ సామగ్రిని బాధితులకు అందించారు. ఇటీవల భీమవరానికి చెందిన ఒక పిల్లవాడికి నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు చేతుల మీదుగా రూ.50 వేల ఆర్ధికసాయం అందించారు. పవన్ అభిమానులు, జన సైనికులు… ఆపన్నులకు అండగా నిలబడుతూ ప్రజల మన్ననలకు పాత్రులవుతున్నారు. 

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *