రైతులకు శుభవార్త.. ఈ ఏడాది వర్షాలకు లోటుండదు

April 16, 2019 | News Of 9

న్యూఢిల్లీ: రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2019 సంవత్సరానికి వాతావరణ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం ఈఏడాది మంచి వర్షాలు కురుస్తాయని తెలిస్తోంది. దేశవ్యాప్తంగా 96శాతం వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ డైరెక్టర్ కేజే రమేష్ వివరించారు. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు కేరళను తాకుతాయని ఆయన తెలిపారు.

గడచిన రెండేళ్లలాగే ఈసారి కూడా సాధారణ వర్షాలు కురుస్తాయనీ పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనీ రమేష్ తెలియజేశారు. అలాగే ఈసారి ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు. ఎల్ నినో ప్రభావం భారత్ పై ఉండని కారణంగా వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని రమేష్ పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దండిగా కురుస్తాయని ఆయన తెలిపారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *