వెంకటేష్ కూతురు ఎవ‌రిని పెళ్లాడ‌బోతోందో తెలుసా!

February 9, 2019 | News Of 9

Guess who will marry Venkatesh's daughter? | telugu.newsof9.com

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత దగ్గుబాటి ఏడ‌డుగులు వేయ‌బోతోంది. గత కొద్దికాలంగా వినాయక్ రెడ్డి అనే సంపన్నకుటుంబానికి చెందిన యువకుడితో అశ్రిత ప్రేమలో ఉంద‌ట‌. వరంగల్ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త ఆర్ సురేందర్‌రెడ్డి మనవడే వినాయక్ రెడ్డి. హైదరాబాద్ రేస్ కోర్స్‌కు అధ్యక్షుడిగా కూడా సురేందర్ రెడ్డి సేవలందిస్తున్నాడు.

ఇరు కుటుంబాల అంగీకారం తెలుపడంతో అశ్రిత, వినాయక్ రెడ్డి పెళ్లికి లైన్ క్లియర్ అయింది. మార్చి 24వ తేదీన వీరి వివాహాన్ని జరిపించేందుకు ముహుర్తం నిర్ణయించినట్టు సమాచారం. అశ్రిత, వినాయక్ రెడ్డి వివాహాన్ని గ్రాండ్‌గా జరిపించాలని వెంకటేష్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుకను జైపూర్‌లో గానీ, లేదా రామానాయుడు స్టూడియోలో గానీ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *