జగన్ పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏ తేల్చేసిందా?

March 16, 2019 | News Of 9

Has Jagan’s airport case finalised?

  • చక్కగా అబద్ధాలు చెబుతున్న చినబాబు
  •  అచ్చు… నాన్నగారి అడుగుజాడల్లో…
  •  ఇంకా కేసు విచారణలోనే…!!

(న్యూస్ ఆఫ్ 9)

చిన్నబాబుకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో గానీ… అబద్ధాలు చెప్పడంలో నైపుణ్యం బాగానే సాధించాడు. సీఎం, చంద్రబాబు ఒకవైపు, చిన్నబాబు మరోవైపు చక్కగా మీడియా సమక్షంలో అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్లిపోతారు. అబద్ధాలే ఎందుకు చెబుతారంటే… వారికి నిజాలు చెప్పకూడదని వారికి శాపం ఉంది అని అంటారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసును జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్ఐఏ) తేల్చివేసిందని, జగన్ పై హత్యాయత్నానికి ఆ పార్టీకి చెందిన కార్యకర్తే కారణమని కూడా చెప్పేసిందని ఐటీ మంత్రి లోకేష్ చెప్పారు. మంగళగిరిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండే… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఇలా అబద్ధాలు చెప్పవచ్చా.. అన్నది ప్రశ్న. ఈ కేసు ఇంకా ఎన్ఐఏ విచారణలోనే ఉంది. దీనిమీద ఎన్ఐఏ ఎలాంటి ప్రకటనా ఇంత వరకూ చేయలేదు. ముందే లోకేష్ ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ మాత్రం రాజకీయ అనుభవంలేని ఇలాంటి వ్యక్తినా… తెలుగుదేశం పార్టీ రేపటి సీఎంగా ప్రజల నెత్తిన రుద్దబోతున్నది? అబద్ధాలు చెప్పడం అన్నది ఆంధ్రా సీఎంగా ఉండేవారికి ఉండాల్సిన ప్రధానమైన అర్హతగా తెలుగుదేశం పార్టీ భావిస్తోందా?

ఇది తప్పు అని చెప్పలేని, అడగలేని మీడియా తెలుగుదేశం నిర్వహించే విలేకరుల సమావేశాల్లో చక్కగా రాసుకుని వచ్చేస్తున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *