ప్రజల తీర్పుపై మాకు అచంచల విశ్వాసం ఉంది: కేటీఆర్

December 8, 2018 | News Of 9

Have confidence on peoples verdict: KTR | Newsof9

హైదరాబాద్: ఓడిపోతే కారణాలు చెప్పడానికి ప్రజా కూటమి వాళ్లు కుంటిసాకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్ 73 శాతం జరగడం ఓ చరిత్ర అని ఆయన అన్నారు. ఇది పాజిటివ్ ఓటుగానే తాము పరిగణిస్తున్నామని అన్నారు. పెద్ద ఎత్తున మహిళలూ, వృద్ధలూ ఓట్లు వేశారని చెప్పారు. తీర్పు ఏకపక్షంగానే రాబోతున్నదని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు మించిన సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మూడు నెలలుగా అలుపెరగక పని చేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెసులో సీఎం అభ్యర్థులని చెప్పుకునే వారు కూడా ఓడిపోతున్నారని అన్నారు. ఈవీఎంల్లో ఏదో లోపాలు ఉన్నాయని ఉత్తమ్ చెప్పడం దీనికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడమే కాంగ్రెసును ముంచిందని ఆయన అన్నారు.

లగడపాటి తెలంగాణ రాదని చెప్పాడని, మరి తెలంగాణకు అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి కదా అని అన్నారు. ‘‘తెలంగాణ వచ్చాక లగడపాటికి రాజకీయ సన్యాసం తప్పలేదు. ఇపుడు సర్వేల సన్యాసం కూడా తప్పదు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘ఓట్ల గల్లంతు జరిగింది నిజమే ..మా అభిమానులు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు’’ అని అన్నారు. పార్లమెంటు ఎన్నికల కైనా ఈ పొరపాట్లు జరగనివ్వవద్దని కోరారు. ‘‘మాకు ప్రజల తీర్పు పై అచంచల విశ్వాసం ఉంది. మిగతా విషయాలు 11 తర్వాత మాట్లాడుకుందాం’’ అని కేటీఆర్ అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *