పేదల దేవుడు వస్తున్నాడు!!

December 2, 2018 | News Of 9

Here coming the god of the poor! | Newsof9

అనంతపురం: ఒకప్పుడు రతనాలసీమగా పేరున్న రాయలసీమ ఇప్పటికీ కటిక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నది. ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులతో రక్తమోడిన రాయలసీమ నేటికీ కరవు రక్కసి కోరల్లోనే చిక్కి విలవిలలాడుతున్నది. ముఖ్యమంత్రులను అందించిన రాయలసీమ మాత్రం అభివృద్ధికి ఆమడదూరంలోనే ఆగిపోయింది. రాజకీయపరమైన దార్శనికత లేకపోవడంతో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కొద్దో గొప్పో ఆర్డీటీ వంటి స్వచ్ఛంద సంస్థలే సీమవాసులను ఆదుకున్నాయని చెప్పాలి.

ఏ ఆశా లేక… నిరాశలో కూరుకుపోయిన సీమ వాసులకు ఇపుడు పవన్ కళ్యాణ్ రూపంలో ఓ పరిష్కారం కనిపిస్తోంది. ‘‘ఆల్ ది బెస్ట్ సోల్జర్’’ అంటూ సీమవాసులు ఆయన్ను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు. మీకు 25 కేజీల బియ్యం కాదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్తును ఇస్తానంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ ప్రభంజనంలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కు ఆదరణ లభిస్తుంది… ఆయన అది దాటి రావడంలేదుగా అన్న విమర్శకుల ప్రశ్నలకు అనంతపురం కవాతు దీటైన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గుత్తి రోడ్డులోని శ్రీ సెవెన్ కన్వెన్షన్ హాలు నుంచి ఆర్టీసీ బస్టాండు మీదుగా సప్తగిరి సర్కిల్ వరకూ కవాతు నిర్వహిస్తారు. దాదాపు 5 నుంచి 10 లక్షల మంది వరకూ ప్రజలు హాజరుకావచ్చని అంటున్నారు.

ప్రజల కష్టాలను తీర్చడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందన్నది పవన్ కళ్యాణ్ సభలకు వస్తున్న ప్రజలను చూస్తే అర్థమైపోతుంది. ప్రజలు ఈ స్థాయిలో తనను చూసేందుకు రావడం లేదని, ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడమేనని అందుకు కారణమని స్వయంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి తెలుగు ప్రజలను ఒక వైపు కాల్చుకుతింటుంటే పవన్ కళ్యాణ్ అన్నట్లు ప్రశ్నించే వారే లేకపోయారు. ఎవరికి వారు వాటాల సంగతి చూసుకుంటున్న ఈ రోజుల్లో… ప్రజలకు మేలు చేయాలన్నది పూర్తిగా వెనక్కిపోయింది. ఈ సమయంలో స్వలాభం చూసుకోకుండా.. నేనున్నాను.. అంటూ పవన్ ఆపన్నులకు భరోసా ఇస్తున్నారు. త్వరలోనే ఈ అవినీతి ప్రభుత్వానికి సమాధికట్టి… సరికొత్త పాలనను ఆవిష్కరిద్దామంటూ ఆయన ప్రజలను ఓదార్చుతున్నారు. ధవళేశ్వరం కవాతు నిర్వహించిన తర్వాత.. జనసేన పార్టీ ప్రభంజనం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ధవళేశ్వరం కవాతుకు దాదాపు 10 లక్షల మందికి పైగా హాజరై ఉంటారని అంచనా. యువతే లక్ష్యంగా సాగిపోతున్న పవన్ కళ్యాణ్ గొంతు యువ కిశోరాలను, మహిళలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 50 ఏళ్ల మహిళలు కూడా పవర్ స్టార్ సీఎం అంటూ కేకలు వేయడం అక్కడ కనిపించిన అరుదైన దృశ్యం. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అని కాకుండా, పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశపు ప్రశ్నించే గొంతుక అయిందని తమిళ హీరో కార్తీ ట్వీట్ చేశారు. అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తున్నాడని ప్రశంసించారు. ట్విటర్ లో ఇండియా ట్రెండ్స్ లో అనంతపురం కవాతు ఇపుడు ఆరో స్థానానికి ఎగబాకింది. విజయవాడ, విశాఖపట్నం, ధవళేశ్వరాల తర్వాత ఇపుడు జరుగుతున్నది నాలుగో కవాతు. ఇపుడు రాయలసీమ రోడ్లన్నీ అనంతపురంవైపే.. !!

ఆరు రోజులపాటు జిల్లాలో పర్యటన
ఇవ్వాళ నుంచి ఆరు రోజులపాటు పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. రేపటి నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని 14 నియోజక వర్గాల పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో పవన్‌ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *