‘2.O’ సినిమా స్టోరీ ఇదిగో..

November 29, 2018 | News Of 9

2.O Movie Photos

ఎనిమిదేళ్ల క్రితం చిట్టి అనే ‘రోబో’ను డైరెక్ట‌ర్ శంకర్ సృష్టించాడు. అచ్చం మనిషిలా ఉండే ఈ రోబోతో కామెడీ, ఆస‌క్తిక‌ర‌మైన ఫీట్లు చేయించాడు. అంతేకాదు ఆ రోబోలో హృద‌యం మొలిపించాడు, ప్రేమ పుట్టేలా చేశాడు. మొత్తం మీద ఒక‌ రోబోతో అద్భుతాల‌న్నీ చేయించి ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో ఓ స‌రికొత్త సంచ‌ల‌నానికి తెర‌లేపాడు.

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ యాక్టింగ్, ఐశ్యర్యరాయ్ గ్లామ‌ర్, అద్భుతమైన విజువల్స్, కళ్లు చెదరగొట్టే విఎఫ్ఎక్స్, రెహమాన్ మ్యూజిక్.. ఇలా ‘రోబో’లో ప్రతి విష‌యం ప్రేక్ష‌కుడిని ఎట్రాక్ట్ చేసింది.

రోబో సినిమా క్లైమాక్స్‌లో, చిట్టి వల్ల సమాజానికి మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆ రోబోను శంకర్ డిస్‌మాంటిల్ చేశాడు. మళ్లీ ఎనిమిదేళ్ల తరవాత ఆ చిట్టిని రీలోడ్ చేసి మంచికి వాడే ప్రయత్నం చేశారు. వర్షన్ ‘2O’ను రూపొందించారు. ‘రోబో’లో తన స్వార్థం కోసం క్రూరంగా మారిపోయిన చిట్టిని మార్చి.. ‘2.O’లో ప్రజల కోసం పోరాడేలా తీర్చిదిద్దారు. అక్క‌డి నుంచే క‌థ స్టార్ట‌వుతుంది. సెల్ ఫోన్‌ల వ‌ల్ల వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో, ఫ్యూచ‌ర్‌లో ఎన్ని వినాశాలు చూడాల్సి వ‌స్తుంద‌న్న‌దే ఈ మూవీ స్టోరీ. ఆ స‌మ‌స్య‌ను ప్ర‌స్త‌విస్తూనే ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ స్టోరీ క్రియేట్ చేశారు.

ఫ‌స్ట్ హాఫ్‌లో సెల్ ఫోన్ల మాయం, ప‌క్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్ర‌వేశం చేస్తాడో.. అప్పుడి నుంచి అస‌లు సినిమా మొద‌ల‌వుతుంది.  ప‌క్షిరాజుగా అక్ష‌య్ ని చూపించ‌డంతో ఫ‌స్టాఫ్ కంప్లీట్ అవుతుంది.

ఇక సెకండాఫ్‌లో మొత్తం చిట్టి – ప‌క్షిరాజు మ‌ధ్య వార్ ఉంటుంది. అస‌లు ప‌క్షిరాజు క‌థేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విష‌యాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పారు. ఆ ఎపిసోడ్ హృద‌యాన్ని హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు శంక‌ర్. అస‌లు ఈ సినిమాలో ఎమోష‌న్ పండింది అంటే… ఈ ఒక్క ఎపిసోడ్ లోనే. మేయిన్ సీన్‌ల‌ను విజువ‌ల్‌గా ఓ స్థాయిలోకి తీసుకెళ్లాడు శంక‌ర్‌. కొన్ని సీన్లు రోబోలో చూసిన‌ట్టే స‌ర‌దాగా అనిపిస్తుంటాయి

‘రోబో’ను మించి ఈ రెండో వర్షన్‌లో విజువల్ ఎఫెక్ట్స్, 3డి విజువల్స్, 4డి మ్యూజిక్‌ను జోడించి డైరెక్ట‌ర్ శంక‌ర్.. ప్రేక్షకులు థియేటర్‌లో మైమరిచిపోయేలా చేశాడు అన‌డంలో నో డౌట్.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *