చరిత్ర- ఊహ మిక్స్ చేస్తే అదే RRR కథ

March 14, 2019 | News Of 9

RRR Movie Posters | telugu.newsof9.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బిగ్ ప్రాజెక్టు RRR సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వ‌చ్చేసింది.  ఈ సినిమా స్టోరీ ఏంటి ? ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు ఎలా ఉంటాయనే దానిపై స్పష్టత ఇచ్చిన రాజమౌళి.. ఇది పిరియాడికల్ స్టోరీ అని చెప్పేశాడు. తెలంగాణలో ఆదివాసీల కోసం పోరాడిన కొమరం భీమ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆదివాసీల సంక్షేమం, స్వాతంత్య్ర‌ కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రలే స్పూర్తిగా ఈ సినిమా తెరకెక్కుతుందని, కొమరం భీమ్ స్పూర్తితో ఎన్టీఆర్ పాత్ర, అల్లూరి సీతారామరాజు స్పూర్తిగా రామ్‌చరణ్ పాత్ర ఉంటుందని రాజమౌళి తెలిపాడు.

కథకు తగ్గట్టుగానే ఇద్దరు స్టార్ హీరోలను ఎంపిక చేసుకున్న జక్కన్న.. ఈ సారి చరిత్రపై కూడా ఎక్కువగా రీసెర్చ్ చేసినట్టు తెలిపాడు. అందుకే కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితచరిత్రలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందనే ఊహతోనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పిన రాజమౌళి.. సినిమా కథలో కొంచెం చరిత్ర, కొంచెం ఊహ కలగలిపి ఉంటుందనే విషయంలోనూ పూర్తి స్పష్టత ఇచ్చాడు.

బాహుబలి సినిమాతోనే జాతీయస్థాయిలో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి… ఆర్ఆర్ఆర్ సినిమా కథాంశం కూడా దేశమొత్తానికి నచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే స్వాతంత్ర ఉద్యమం నేపథ్యాన్ని ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. సినిమా ఏదైనా… భారీ స్థాయిలో తెరకెక్కించే దర్శకధీరుడు… ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తానని చెప్పాడు. మరి… కొంచెం చరిత్ర, కొంచెం ఊహ కలగలిపి ఉండబోయే ఆర్ఆర్ఆర్‌ను జక్కన్న అందరికీ నచ్చే విధంగా ఎలా చెక్కుతాడో తెలియాలంటే మాత్రం జూలై 30, 2020 వరకు వెయిట్ ఆండ్ సీ.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *