మ‌ణిర‌త్నం భారీ ప్ర‌యోగం

December 6, 2018 | News Of 9

Huge experiment of Manirathnam | news of 9

బాహుబలి తర్వాత సౌతిండియా సినీ ఇండ‌స్ట్రీల్లో భారీ బడ్జెట్ ప్రాజెక్టుల‌కు తెర‌లేచింది. డైరెక్ట‌ర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో బాహుబలి రెండు పార్టుల సినిమాలు తీస్తే.. డైరెక్ట‌ర్ శంక‌ర్ 500 కోట్ల‌కుపైబ‌డి బడ్జెట్‌తో 2.O లాంటి భారీ గ్రాఫిక్స్ మూవీ తెరకెక్కించాడు. బాహుబలి తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇదే కోవాలో డైరెక్ట‌ర్ మణిరత్నం మరో భారీ ప్రాజెక్టుకు తెర లేప‌బోతున్నాడు.

 

నవాబు సక్సెస్‌తో జోష్ పెంచిన మణిరత్నం విక్రమ్, విజయ్, శింబుతో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాను భారీ స్టార్ కాస్టింగ్‌తో, అత్యంత‌ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది.

 

ప్రస్తుతం మణిరత్నం మల్టీస్టారర్ స్క్రిప్టు దశలో ఉన్నట్టు సమాచారం. తమిళంలో ప్రజాదరణ పొందిన నవల ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలిసింది. ఇది మరో దళపతి లాంటి సినిమా కావొచ్చనే మాట తమిళ వర్గాల్లో వినిపిస్తున్నది.

 

విక్రమ్ కు, విజయ్‌కు తమిళంలోనే కాదు సౌత్ ఇండ‌స్ట్రీల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అలాంటి వారితో సినిమా అంటే దక్షిణాదిలో మంచి మార్కెట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఇది RRR, రాజమౌళి సినిమాకు పోటీ అవుతుందా అనేది కచ్చితంగా చెప్పలేం. కొద్దిరోజులు ఆగితే ఈ ప్రాజెక్టుపై పూర్తి క్లారిటీ వ‌స్తుంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *