చెప్పిన పార్టీకి ఓటు వేయలేదని వేలు నరికేసిన భర్త!

December 7, 2018 | News Of 9

Husband cut wife’s finger on post-voting | Newsof9

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు… ఒక రకంగా అందరిలోనూ బ్లడ్ ప్రెషర్ ను పెంచేశాయి. కేసీఆర్ ఫ్యామిలీలోనే కాక… అందరినీ ఉరుకులు పరుగులు కూడా పెట్టించాయి. అది సరే. ఫలానా పార్టీకే ఓటు వెయ్యి అని ఒక భర్త ఆదేశించాడు. కానీ ఆయన భార్య మాత్రం తనకు నచ్చిన పార్టీకి ఓటు వేసింది. భర్త అనేవాడు ఊరుకుంటాడా? కత్తి తీసుకుని ఆమె వేలు నరికేశాడు. ఇంకా నయం మెడ మీద వేటు వెయ్యలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన సప్పిడి రమేష్… తాను చెప్పిన పార్టీకే ఓటు వెయ్యాలని భార్య బుజ్జమ్మకు ఆర్డర్ పారేశాడు. థూ నా బొడ్డు అని ఆమె తనకు నచ్చిన పార్టీకి వేసింది. నువ్వు చెప్పిన పార్టీకే వేసినాలే అంటే ఒక ముక్కలో పోయేది కదా బుజ్జమ్మా… అంటూ పక్కింటి వాళ్లు గొణుక్కుంటూ పోయారు. ఓటు వేసిన వేలుపైనే దాడి చేశాడా అన్నదానిపై పూర్తి సమాచారం లేదు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *