హైదరాబాదులో ప్రతి అంగుళం నేనే బాగు చేశా: చంద్రబాబు

November 30, 2018 | News Of 9

CBN | telugu.newsof9.com

అమరావతి: తాను రాష్ట్రానికే పరిమితమైపోవడం భావ్యం కాదనీ, దేశం కోసం పనిచేయాల్సివుందని, దేశం బావుంటే రాష్ట్రం కూడా బావుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి ప్రజావేదికలో శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చే సరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ప్రత్యర్ధులు చేస్తున్నప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. చెప్పిన దానికీ చేసిన దానికీ పొంతన లేకుండా పాలన సాగిస్తే ప్రజల్లో అసహనం తప్పదని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా కేంద్రంలో నరేంద్రమోడీ పాలన సాగిందన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఆనాడు దార్శనికతను రూపొందించి దానికి తగ్గట్టు కృషిచేశానని,  నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీగా అభివృద్ధి చేశామనీ, గ్రాండ్ హైదరాబాద్ కు విజన్ ఇచ్చాననీ, అంగుళం అంగుళం అభివృద్ధి చేశాననీ చెప్పుకొచ్చారు. ‘‘

5 వేల ఎకరాల భూమిని సేకరించి శంషాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే రక్షణశాఖ సలహాదారు అడ్డుచెప్పారు.  ఆనాడు ప్రధాన మంత్రి స్థాయిలో జోక్యం చేసుకుని అడ్డంకుల్ని తొలగించారు.

సియాటెల్ తరహాలో మైక్రోసాఫ్ట్ బేస్ హైదరాబాద్ పెట్టమన్నా. అహ్మదాబాద్బెంగుళూరు మెట్రో ఇవ్వాలని ఆనాటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయిస్తే  హైదరాబాద్‌కు కూడా మెట్రో ఇవ్వాలని ప్రతిపాదించి  ఒప్పించాను.  అవుటర్ రింగ్ రోడ్డుకు నేను ఆరోజు రూపకల్పన చేశాను.  నేడు హైదరాబాద్‌కు పెద్ద ఆస్తిగా మారింది. 165 కి.మీ. పొడవున 8 వరుసల రహదారిని 20 ఏళ్ల క్రితం వేయాలనుకోవడం నా విజన్. అప్పట్లో హైదరాబాద్ కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్ నడపడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.  ఇప్పుడు అమరావతికి అవే ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది హైదరాబాద్ కు అంతర్జాతీయ విమాన సర్వీసులు నేను సాధించిందే. అదే స్ఫూర్తితో అమరావతికి కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులు సాధిస్తాం. నిన్ను చూస్తుంటే దేశ రాజధాని కూడా హైదరాబాద్ తీసుకుపోయేట్లు ఉన్నావు అన్నారు వాజ్ పేయి. దానిని నేను కాంప్లిమెంట్ గా తీసుకున్నాను. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోసం రంగాచారి దేశమంతా తిరిగారు. ఎక్కడా భూమి ఇవ్వలేదు. నేను భూమి ఇస్తానని చెప్పి వాజ్‌పేయిని కలిశాను. హైదరాబాద్ కట్టానని అంటున్నానని కేసీఆర్ ఎద్దేవా చేస్తుంటే ఇవన్నీ గుర్తుచేయాల్సి వచ్చింది. గచ్చిబౌలి స్టేడియం నేనే నిర్మించాను. పట్టుబట్టి నేషనల్  గేమ్స్ నిర్వహించాం. అప్పుడు నిర్వహించిన అంతర్జాతీయ క్రీడోత్సవాల వల్లే ఇప్పుడు హైదరాబాద్ లో క్రీడా సదుపాయాలు ఇనుమడించాయి. ఎందరో క్రీడాకారులను జాతికి అందించాం ఆర్టీజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏపీలో ప్రవేశపెట్టాం. ప్రజావేదిక తీసుకొచ్చాం. ప్రతి నిత్యం వేలాది కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వయాడక్ట్ తీసుకొస్తున్నాం. వయాడక్ట్ ఇప్పుడు మనందరి అభివృద్ధి మంత్రం. నాయకత్వం ఇవ్వగలిగితే రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ చేయడం సాధ్యమే. విజన్ 2020 చూసి ఆనాడు అబ్దుల్ కలామ్ దేశానికి దార్శనిక పత్రం రూపొందించారు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే ఫలితాలు కూడా చిన్నవిగానే ఉంటాయి’’ అని అన్నారు.  

‘‘అమరావతి అనేది అతిపెద్ద ఆవిష్కరణ. నావద్ద సొమ్మేం లేదు. కానీ రైతులు రూ.50 వేల కోట్ల సంపద ఇచ్చారు. దానినే పెట్టుబడిగా పెట్టాం. అభివృద్ధి వైపు అడుగులేస్తున్నాం. ఇండియా తరపున ప్రపంచానికి ప్రకృతి సేద్యాన్ని పరిచయం చేయబోతున్నాం. పట్టిసీమ అనేది మరో ఆవిష్కరణ. నదుల అనుసందానం నిజం చేశాం. నాలుగేళ్లుగా అద్భుత ఫలితాలు సాధించాం. 4 ఏళ్లలో రూ.40 వేల కోట్ల ప్రయోజనం పట్టిసీమతోనే. కృష్ణా డెల్టాలోనే కాదు సీమ రైతుల్లో కూడా అశాంతి లేకుండా పోయింది. ఎల్ఈడీ బల్బులు మరో ఆవిష్కరణ. ఈ ఏడాది నరేగాలో నిధుల కన్వర్జన్స్ కింద రూ.10 వేల కోట్లు తీసుకుని ఖర్చు పెట్టబోతున్నాం. వ్యవసాయఅనుబంధ రంగాలలో వ్యూహాత్మక విధానాలను అనుసరించి అద్భుత ఫలితాలను సాధించాం. నదుల అనుసంధానంతో వదిలిపెట్టలేదుసూక్ష్మ సేద్యానికి వెళ్లాం. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గిద్దాం. ఆర్టీసీ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారూస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *