బాబా సాహెబ్ చూపిన బాటలో…!!

December 6, 2018 | News Of 9

In the path of Dr Baba saheb Ambedkar | Newsof9

ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 62వ వర్థంతి. ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ఆయన చదువులు, సాధించిన విజయాలు, ఆయన వ్యక్తిత్వం అన్నీ కొత్త తరాలకు ఎప్పుడూ స్ఫూర్తిని కలిగించేవే.

అంబేద్కర్ జీవన విశేషాలను ‘అంబేద్కర్ ప్రచార సభ’ అన్న ఫేస్ బుక్ అక్కౌంటు అందించింది. దీనిని మరింత మందికి చేరువ చేయాలన్న ఆసక్తితో దీనిని ‘న్యూస్ ఆఫ్ 9’ మీకు అందిస్తోంది.

 

 •  తల్లిదండ్రులు :- తల్లి భీమాబాయి సక్పాల్తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి సొంత గ్రామం అంబెవాడ గ్రామంరత్నగిరి జిల్లామహారాష్ట్ర.
  జననం:– 14 ఏప్రిల్ 1891
  ప్రాంతం :- మావ్సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) (రాంజీ సక్పాల్ ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)
 •  వివాహం

రమాబాయి అంబేద్కర్:- 1906 లో వివాహం జరిగింది. ఆయన ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు. తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకుఆయన చేసే కార్యక్రమాలకు సహకారం అందించారు. చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో చనిపోయారు.
సవిత అంబేద్కర్ :- అసలు పేరు శారదా కబీర్. రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమికాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు.
మరణం:- రాజకీయ పరిస్థితులపైతన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారు. నిద్రలేమిమానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు . తన ఆఖరి పుస్తకం “బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’’ పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసెంబర్ 06న నిద్రలోనే పరినిర్వాణం చెందారు.

 •   బాబాసాహెబ్ చదువులు – ప్రత్యేకతలు

మెట్రికులేషన్ -1908
B.A – (పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్) బాంబే విశ్వవిద్యాలయం -1912 – అంటబడని కులాల నుండి మొట్ట మొదటి గ్రాడ్యుయేట్.
M.A – (ఎకనమిక్స్ –  సిద్ధాంత గ్రంథం: ప్రాచీన భారత వాణిజ్యం) అమెరికా- 1915.
Ph.d– (ఎకనమిక్స్ – సిద్ధాంత గ్రంథం: బ్రిటీష్ ఇండియాలో ప్రొవిన్షియల్ ఫైనాన్స్ పరిణామం- అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, అమెరికా-1917. ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్ట మొదటి డాక్టరేట్.
D.Sc – (సిద్ధాంత గ్రంథం:  రూపాయి కష్టాలు- దాని పుట్టుక పరిష్కారాలు) లండన్ ఎకనమిక్స్ స్కూలు- 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి, ఆఖరి భారతీయుడు.
M.Sc– (ఎకనమిక్స్ – సిద్ధాంత గ్రంథం: బ్రిటీష్ ఇండియాలో రాచరిక ఆర్థిక విధానం- ప్రాదేశిక వికేంద్రీకరణ) లండన్,  ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్.
బార్ ఎట్ లా– గ్రేస్ ఇన్… లండన్- 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది.
రాజకీయ ఆర్థిక శాస్త్రం -జర్మనీ.
ఎల్ఎల్ డీ – (గౌరవ) కొలంబియా విశ్వవిద్యాలయం, న్యూయార్క్, నాయకత్వ ధీరోదాత్తతకు, భారత రాజ్యాంగ రచనకు గుర్తింపుగా.

డిలిట్ (గౌరవఉస్మానియా విశ్వవిద్యాలయంహైదరాబాద్,

బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు.అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్ మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.

 •  భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావీణ్యత కలిగి ఉన్నారు.  

మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, గుజరాతీ, పాళీ (- పాళీ వ్యాకరణం, నిఘంటువు కూడా రాసారు), సంస్కృతంజర్మన్, పార్శీ,  ఫ్రెంచ్.

 •  బాబాసాహెబ్ ఉద్యమ జీవితం
 •  బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు
 •  బహిష్కృత హితకారిణి సభ :- జులై 20, 1924
   సమత సైనిక్ దళ్ :– మార్చి 13, 1927
 •  బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు:-
 •  ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)– ఆగస్టు 16, 1936
  షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)– జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)
  రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) – అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)
 •  బాబాసాహెబ్ స్థాపించిన విధ్యా సంస్థలు
 •  డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ — జూన్ 14, 1928
  పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ — జూలై 08, 1945
  సిద్ధార్థ్ కాలేజిముంబై — జూన్ 20, 1946
  మిళింద్ కాలేజీఔరంగాబాద్ — జూన్ 01, 1950
 •  బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ.
 •  బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా – మే 4, 1955
 •  బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు.

మహద్ చెరువు ఉద్యమం –20/3/1927మొహాళీ (ఘులేల)తిరుగుబాటు –12/2/1939అంబాదేవీ, మందిరం ఆందోళన –26/7/1927పూణే కౌన్సిల్ ఉద్యమం –4/6/1946పర్వతీ ఆలయ ఉద్యమం , 22/9/1929నాగపూర్ ఆందోళన – 3/9/1946 కాలారామ్ ఆలయ ఆందోళన –2/3/1930లక్నౌ ఉద్యమం – 2/3/1947,ముఖేడ్ ఉద్యమం –23/9/1931,

బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు

 •  మూక్ నాయక్ – జనవరి 31, 1920బహిష్కృత భారత్ – ఏప్రిల్ 3, 1927సమత – జూన్ 29, 1928జనత నవంబరు 24, 1930ప్రబుద్ధ భారత్ – ఫిబ్రవరి 4, 1956,

బాబాసాహెబ్ ప్రత్యేకతలు – దక్కిన గౌరవాలు

 •  బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేశారు. ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే..
  లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి ఔపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్
  ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్.  ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన ఆరుగురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు. 
 •  లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ పీహెచ్డీని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి. 
  తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటేమరో ఆలోచన లేకుండా 5 లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడూ పొంది ఉండడు.

అరుదైన గౌరవాలు 

 •  భారత రత్న – ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ              గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం. 
 •   కొలంబియా యూనివర్సిటీ ప్రకారం – ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు
  ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత. సీఎన్ఎన్ఐబీఎన్హిస్టరీ ఛానెల్ నిర్వహించిన సర్వే ప్రకారం అత్యంత గొప్ప భారతీయుడు.

బాబాసాహెబ్ గురించి బయటకు తెలియకుండా దాయబడుతున్న అంశాలు

 •  బాబాసాహెబ్ ను నవ భారత నిర్మాతగాభారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకునిగా గుర్తిస్తుంటే,భారతదేశంలో మాత్రం ఆయనను ఒక కులానికి నాయకునిగాఒక వర్గానికి నాయకుడిగా చూస్తోంది. సంఘ్ విద్రోహులు బాబాసాహెబ్ అందరి నాయకుడు అంటూనే ఆయన గొప్పదనం గురించి చెప్పకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేసిహిందూ మత ఉద్ధారకుడుగా  ప్రచారం చేస్తూ హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవాలని కుట్ర పన్నుతోంది.ఇది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టే కుట్ర.
 •  ఇలాంటి సమయంలో బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోకపోతేమనువాద వక్రీకరణలే చరిత్రగా మారే ప్రమాదం ఉంది. మన భావితరాలను ఈ వక్రీకరణల నుండి కాపాడుకోకపోతే.అంబేద్కరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టినవారం అవుతాం.
 •  వివిధ రంగాల్లో బాబాసాహెబ్ కృషి – గొప్పతనాలు – వాటి ఫలితాలు .
 •  బాబాసాహెబ్ – మహిళా హక్కులు

హిందూకోడ్ బిల్లు – మహిళల విధ్యఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున

పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం మంత్రి పదవి వదిలేశారు).

పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు. 

మహిళలకు గర్భధారణ సమయంలో వారాల ప్రత్యేక సెలవు (మెటర్నిటీ సెలవు).
✓ పని ప్రాంతాలలో మహిళకు ప్రత్యేక సౌకర్యాల కోసం పథకాలు
✓ స్త్రీ శిశు సంక్షేమ చట్టం – ఇది తరువాతి కాలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆవిర్భావానికి దారి తీసింది.

 •  అయినప్పటికీ మనువాదంలో మునిగి తేలుతున్న స్త్రీ సమాజం ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా తలుచుకోదు. మహిళా హక్కులంటూ గొంతు చించుకునే మహిళా సంఘాలు బాబాసాహెబ్ గురించి ఒక్క మాట కూడా తమ సంఘాల వారికి చెప్పరు.
 •  బాబాసాహెబ్ – కార్మికుల హక్కులు: గంటల పని దినాలు – 7వ భారతీయ కార్మిక సదస్సునవంబరు 27, 1942 లో 14 నుండి గంటలకు కుదించారు. ఈఎస్ఐ సౌకర్యం :- కార్మికుల ఆరోగ్య భద్రత కోసం (తూర్పు ఆసియాలోనే మొదటిది. 
  ఇండియన్ ఫాక్టరీల చట్టం :- పని ప్రదశంలో నిర్ధిష్ట విధానాలుజవాబుదారీతనం.  
  ✓ కరువు భత్యం: పెరిగిన నిత్యావసర కర్చులను భరించేందుకు వీలుగా. 
  ✓ కనీస వేతనం ఉండే విధంగా చర్యలు. 
  ✓ కేంద్ర కార్మిక సంఘాల (సవరణ) చట్టం :- 1926 చట్టం కేవలం కార్మిక సంఘాలను రిజిష్ట్రేషను చేయమని మాత్రమే చెప్పింది. 8 నవంబరు 1943న సవరణ చట్టం తీసుకొచ్చి పూర్తి విధివిధానాలను రూపొందించారు.  ✓ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం.
 •  కానీ ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా ఎత్తకుండా కార్మికులను మాయలో ఉంచుతారు ఈ అగ్రకులాల నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్టులు.
 •  బాబాసాహెబ్ – రైతుల కోసం. 
  ✓ నీటిపారుదల సౌకర్యాల పితామహుడు:- హిరాకుడ్ ప్రాజెక్టుదామోదర్ నదీలోయ ప్రాజెక్టుసోన్ నది లాంటి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల డిజైన్ దగ్గర నుండి పూర్తి చేసే దాకా బాబాసాహెబ్ కృషి ఉంది.. భారత దేశ చరిత్రలో అనుకున్న ఖర్చు, అనుకున్న సమయంలో పూర్తయిన నీటిపారుదల జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవే.
  ✓ మెరుగైన నీటిపారుదల కోసం సెంట్రల్ వాటర్ వేస్ అండ్ ఇరిగేషన్ కమిషన్ (CWIRC) ఏర్పాటు చేశారు.
  ✓ జలవనరుల నుండి విధ్యుత్తుత్పత్తిని క్రమబద్ధం చేయడం కోసం సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డును స్థాపించారు.
  ✓ ఇప్పటికీ సమస్యలు లేకుండా విజయవంతంగా నడుస్తూ దేశంలో విధ్యుత్తు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న “గ్రిడ్ వ్యవస్థ ” బాబాసాహెబ్ ఆలోచనే.
 • మొక్షగుండం విశ్వేశ్వరయ్యనెహ్రుపటేల్ ల వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయంటూ బాబాసాహెబ్ పేరును ఈ ప్రభుత్వాలు తలవడం లేదు.
 • బాబాసాహెబ్-నిరుద్యోగం-స్వయం వికాసం

✓ ఇప్పుడు నిరుద్యోగులకు అత్యంత సహాయకరంగా నిలుస్తున్న “ఎంప్లాయిమెంట్ ఎక్సచేంజీలు” బాబాసాహెబ్ స్థాపించినవే. 
✓ భారత దేశంలో సాంకేతిక విధ్య అందుబాటులో లేని కారణంగా నిరుద్యోగులను యూనిట్ గా చేసుకుని ITI లాంటి సంస్థలు ఏర్పాటు చేసి అవసరం అయితే వారిని విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు బాబాసాహెబ్.

 •  భారతదేశ ఆర్థిక ప్రగతికి బాబాసాహెబ్ కృషి
  ✓ రెండో ప్రపంచ యుద్ధం సమయానికి ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న భారతదేశాన్ని మళ్ళీ పునర్ నిర్మించే ప్రయత్నంలో భాగంగా నియమించిన రికన్ స్ట్రక్షన్ కౌన్సిల్ లో బాబాసాహెబ్ సభ్యులుగా ఉన్నారు. నీటిపారుదల, విధ్యుత్తుత్పత్తి ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేసారు.
  ✓ ఇప్పటిదాకా నివేదికలు సమర్పించిన 13 ఆర్థిక సంఘాల నివేదికల కూడా బాబాసాహెబ్  సిద్ధాంత గ్రంధం నుండి తీసున్నవే.
 •  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఘోరంగా దెబ్బ తీస్తున్న ఆర్థిక మాంద్యాలు కూడా భారతదేశాన్ని ప్రభావితం చేయలేక పోవడానికి ముఖ్య కారణం అయిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపన పూర్తిగా బాబాసాహెబ్ కృషి ఫలితమే.రిజర్వు బ్యాంకు స్థాపన కోసం ఏర్పాటు చేసిన హల్టన్ అండ్ యంగ్ కమీషన్ పూర్తిగా బాబాసాహెబ్ రాసిన రూపాయి పుట్టుక అన్న పుస్తకం నుంచే.
 •  ఈనాడు చూస్తే కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ, బ్యాంకుల్లో రవీంద్రనాద్ ఠాగోర్ ల ప్రవచనాలే కనిపిస్తాయి. నిజానికి వీరి ఇద్దరి సహకారం శూన్యం.
 •  బాబాసాహెబ్ – హేతువాదం – సామాజిక ఉద్యమాలు 
  ✓ భారతదేశం విజ్ఞానపరంగా ముందుకు వెళ్ళకుండా మూఢనమ్మకాలలో మగ్గుతూ ఉండడానికి ముఖ్య కారణం హిందూమతం అని నినదించి, ఈ రుగ్మతలు ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్న మను ధర్మాన్ని తగలబెట్టారు బాబాసాహెబ్. 
  ✓ ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ఎదుర్కోవడానికి హేతువాదం మాత్రమే సరిపోదుఒక హేతువాద భావనలు గల మరో సంస్కృతిని సృష్టించాల్సిందే అని చెప్పి నవయానాన్ని ప్రభోధించారు బాబాసాహెబ్.
 •  హేతువాదులం అని చెప్పుకునే అగ్ర కులస్థులు బాబాసాహెబ్ పేరు తలవడానికి ఇష్టపడటం లేదన్నది వాస్తవం.
 •  ఇలా మనువాద భావాలు నిండిన మన సమాజం బాబాసాహెబ్ ఈ దేశ వ్యవస్థకు అందించిన సహకారాన్ని పూర్తిగా విస్మరిస్తూ వస్తోంది .
 •  బాబాసాహెబ్ తన జీవిత కాలంలో నిర్వహించిన బాధ్యతలు

ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త, ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు, ఒక విశిష్టమైన చరిత్రకారుడు, ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక  శాస్త్రవేత్త, ఒక అద్భుతమైన రచయిత, ఒక తిరుగులేని ఉద్యమకారుడు, ప్రజలను కట్టిపడేయగల వక్త, ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని చదువులు చదివి, డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత,  అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాదిస్వేచ్చసమానత్వ స్థాపన కోసం, తపన పడ్డసామాజిక విప్లవకారుడు, భారత భూమిపై నడయాడిన ఒక గొప్ప భారతీయుడు.

 • జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదనీగొప్పగా ఉండాలని” బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయనకే వర్తించాయి.
 •  భారతదేశ సామాజిక ఉద్యమ పితామహుడుప్రపంచ మేధావినిజమైన ప్రజా నాయకుడు బాబాసాహెబ్ కు ఆయన 60 వ వర్ధంతి సంధర్బంగా అశ్రునివాళి అర్పిస్తూ.  

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *