సర్దార్ విగ్ర‌హం గురించి అద్భుత విశేషాలు

October 28, 2018 | News Of 9

Sardar Vallabhbhai Patel

స్వతంత్ర భారతావనికి తొలి హోం మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఐరన్ మ్యాన్‌గా భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చిన్నచిన్న సంస్థానాలను దేశంలో విలీనం చేయించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. రాజకీయ నాయకుల్లో ఆజాను బాహుడిగా చెప్పుకునే ఆ మహోన్నత వ్యక్తిని కలకాలం గుర్తుంచుకునేలా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2013లో సంకల్పించింది. వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణానికి పూనుకుంది. చకాచకా పనులు మొదలుపెట్టింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో నిర్మించారు. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు కింద, డ్యామ్ వైపు చూస్తున్నట్లు ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్ర‌హానికి దేశంలోని ఐక్యత, సమగ్రతకు చిహ్నంగా ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు. 182 మీటర్లు అంటే 600 అడుగులు ఎత్తున్న ఈ విగ్రహం న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండింతలు పెద్దది. గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్ నుంచి 200 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఈ విగ్రహం ఉంది. విగ్రహం వద్ద పటేల్ మ్యూజియం మొదలైన వాటిని కూడా ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహం నిర్మాణంలో మొత్తం 2500 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ విగ్రహం తయారీలో 22500 మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను వినియోగించారు. వీరిలో వందల కొద్ది చైనా కార్మికులు ఉన్నారు. 5000 కంచు పలకలతో విగ్రహం పూర్తి చేయడానికి వీరంతా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఈ విగ్రహాన్ని చాలా దృఢంగా నిర్మించారు. సెకెనుకు 60 మీటర్ల వేగంతో వీచే గాలులను, వైబ్రేషన్, భూకంపాలను ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి అయిన ఖర్చు సుమారు మూడు వేల కోట్ల రూపాయ‌లు.

ప్రస్తుతం ఈ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్నారు.

Other Articles

19 Comments

 1. Hey there, I think your blog might be having browser compatibility issues.
  When I look at your website in Firefox, it looks fine
  but when opening in Internet Explorer, it has some overlapping.
  I just wanted to give you a quick heads up! Other then that, wonderful blog!

 2. Do you have a spam problem on this site; I also am a blogger,
  and I was wanting to know your situation; we have created some nice methods and we are looking
  to swap techniques with other folks, be sure to shoot me an email if interested.

 3. Hey there! Would you mind if I share your blog with my myspace group?
  There’s a lot of folks that I think would really enjoy your content.
  Please let me know. Thanks

 4. You really make it seem so easy with your presentation but I find this topic to be
  really something that I think I would never understand.
  It seems too complex and very broad for me. I’m looking forward for your next post, I’ll try to get the hang of it!

 5. Woah! I’m really digging the template/theme of this website.
  It’s simple, yet effective. A lot of times it’s difficult to get that “perfect balance” between superb
  usability and appearance. I must say you have done a awesome job with
  this. Additionally, the blog loads extremely quick for me on Chrome.

  Exceptional Blog!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *