ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వం

April 5, 2019 | News Of 9

  • అనధికారికంగా అదే విధుల్లో మాజీ ఇంటిలిజెన్స్ అధికారి
  • ఏబీ వెంకటేశ్వరరావు, ఠాకూర్ లపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
  • డీజీపీ ఠాకూర్ ను వివరణ కోరిన కేంద్ర ఎన్నికల సంఘం
  • పనిలో పనిగా.. ఏసీబీ డీజీ హోదా నుంచి ఠాకూర్ కు ఉద్వాసన

                                                         (న్యూస్ ఆఫ్ 9)

ఇంటిలిజెన్స్ డీజీగా… వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం తొలగించినా… ఆయన అదే విధులను అనధికారికంగా నిర్వహిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను వివరణ అడిగింది. వెంకటేశ్వరరావును అధికారికంగా విధుల నుంచి తప్పించినా… మళ్లీ ఆయన అనధికారికంగా అదే పనిగా ఉండే అవకాశం ఉంటుందేమోనని ‘‘న్యూస్ ఆఫ్  9’’ అనుమానించకపోలేదు. అనుకున్నట్లే… కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు సమాచారం. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం  కమిషనర్లు అశోక్ లావాస, సుశీల్ చంద్రలతో  ఏపీ డీజీపీ ఆర్.పి. ఠాకూర్ తో భేటే అయి దీనిపై వివరణ అడిగారు. పనిలో పనిగా… ఏసీబీ డీజీగా అదనపు పదవిని నిర్వహిస్తున్న ఆర్.పి. ఠాకూర్ ను ఆ పదవి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పినట్లు సమాచారం. డీజీపీ ఆర్.పి. ఠాకూర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పని చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. తిరిగి అధికారంలో ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం శతధా ప్రయత్నిస్తుంది. అధికారులను తెలుగుదేశం ప్రభుత్వం… కార్యకర్తల్లా వాడేసుకుంటుంది. చట్టం పట్లగానీ, రాజ్యాంగంపట్లగానీ ఆ పార్టీకి ఎనాడూ గౌరవం లేకపోవడమే ఇందుకు కారణం.

Other Articles

One Comment

  1. I’ve been browsing online greater than 3 hours lately, but I by no means discovered any attention-grabbing article like yours. It’s lovely price sufficient for me. Personally, if all web owners and bloggers made excellent content as you probably did, the internet can be a lot more helpful than ever before. “When there is a lack of honor in government, the morals of the whole people are poisoned.” by Herbert Clark Hoover.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *