చర్చ:పవన్ కళ్యాణ్ గారికి మద్యపానాన్ని నిషేధించే సత్తా ఉందా?

October 1, 2018 | News Of 9

మద్యపాన నిషేధం గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాలకొల్లు లో జరిగిన ప్రజాపోరాట యాత్రలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కన్నా ఒక బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీ అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒక గ్రామంలో 70 శాతం మహిళలు మద్యపాన నిషేధానికి మద్దతు పలికితే ఆ గ్రామంలో మద్యపాన నిషేధానికి జనసేన సిద్ధంగా ఉంది అని తెలియజేశారు.
తెలుగు రాష్ట్ర ప్రజలకు మద్యపాన నిషేధం అనేది ఏమీ కొత్తది కాదు. 1952లో రాజగోపాలచారి హయాంలో మరియు 1994లో ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు పరిచింది. 1997లో వెన్నుపోటు రాజకీయం తో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రెవిన్యూ లోటు కారణముగా చూపించి మద్యపాన నిషేధం ఎత్తివేశారు.
భారతదేశంలో గుజరాత్, నాగాలాండ్, లక్షద్వీప్ రాష్ట్రాలు ఇప్పటివరకు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తున్నాయి. కేరళ రాష్ట్రం మద్యపానాన్ని నిషేధించి ఆ తరువాత ఆర్థిక అభివృద్ధి కుంటుపడటం తో నిబంధనలను సడలించింది. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని నవంబర్ 2015 నుంచి అమలు పరుస్తోంది.
1992లో నెల్లూరులోని దూబగుంట గ్రామంలో మద్యపానాన్ని నిషేధించాలని మొదలైన ఒక చిన్న ఉద్యమం అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం మొత్తం విస్తరించి 1994లో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తెరతీసింది. మరి అదే బాటలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక గ్రామంలో మహిళల మద్దతును బట్టి తాను మద్యపాన నిషేధించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియజేశారు. ఆ రోజుల్లో కేవలం ప్రింట్ మీడియా సహకారంతోనే మద్యపాన నిషేధ ఉద్యమం రాష్ట్రం మొత్తం వ్యాపించింది. మరి ఈరోజు ప్రింట్ మీడియా తో పాటు సోషల్ మీడియా ప్రభావంతో ఉద్యమం ప్రజల్లో కి ఎంతో  త్వరగా విస్తరించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రెవెన్యూ 2016-17 గాను  46,285.30 కోట్లు మరియు రెవెన్యూ వృద్ధి రేటు 9.81%. అందులో ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజి శాఖ రెవిన్యూ వృద్ధిరేటు 5.8% . అనగా సుమారు 4,644.45 కోట్లు.
ఒకవేళ మద్యపానాన్ని నిషేధించాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 5 వేల కోట్ల ఆర్థిక లోటు భర్తీ చేయడానికి ఇతర విధి విధానాలను పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మద్యపానాన్ని నిషేధించిన తరువాత కలిగే ఆర్థిక సమస్యలను నివారించే సామర్థ్యం ఉందని మీరు విశ్వసిస్తారా? ఎటువంటి బాధ్యతతో కూడిన విధివిధానాలు మన రాష్ట్రానికి అవసరం అని మీరు భావిస్తారు ?
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.

Other Articles

5 Comments

  1. ఆయన చేసేదే చెప్తాడు
    ఒక్కసారి చెబితే ప్రాణం పెట్టి అయినా చేస్తాడు

    1. he can definitely do. there is no doubt about it. because he is not just politician, more than that he is an activist working for change in the society.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *