ఐటీ దాడులు… రోడ్డుపైనే పడుకున్న రేవంత్ రెడ్డి

December 1, 2018 | News Of 9

IT and police conduct raids on RevanthReddy’s house | Newsof9      

  • అనుచరుల ఇళ్లపైనా దాడులు
  • నిరసనగా రోడ్డుపై పడుకున్న రేవంత్
  • కొడంగల్ లో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాదు: కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై శనివారం రాత్రి పోలీసులూ, ఐటీ అధికారులూ సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. రేవంత్ అనుచరుల ఇళ్లలోనూ భారీ పోలీసు బందోబస్తు మధ్య ఐటీ దాడులు జరుగుతున్నాయి. మొత్తం 15 ప్రాంతాల్లో మూకుమ్మడిగా దాడులు జరుగుతున్నాయి. పోలీసు దాడులకు నిరసనగా కొడంగల్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. తన అనుచరులతో కలిసి… రోడ్డుపైనే పడుకున్నారు. వికారాబాద్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కూడా రేవంత్ కు సంఘీభావంగా ధర్నాలో కూర్చుకున్నారు. పోలీసులకూ, కాంగ్రెసు కార్యకర్తలకు ఘర్షణ జరుగుతోంది. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తనపై ఐటీ దాడులు జరగవచ్చని కూడా రేవంత్ రెండు రోజుల కిందటే చెప్పారు. అలాగే తనను అంతమొందించడానికి కూడా ప్రయత్నం జరుగుతోందని రేవంత్ ఆరోపిస్తున్నారు. కార్యకర్తలు మాత్రం.. ఒకింత భయపడుతున్నారు. దాడి కూడా జరుగుతుందేమోనన్నదే వారి భయం.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా భారీగా మొహరించారు. కొడంగల్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడైన కొడంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యూసుఫ్ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. సమాచారం తెలుసుకుని రేవంత్ రెడ్డి నివాసం వద్దకు అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికీ, పోలీసులకూ మధ్య వాగ్వివాదం నడుస్తోంది. నీ సంగతి తేలుస్తాం అంటూ కొండల్ రెడ్డిని పోలీసులు హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు నిరసన చేస్తానని కొండల్ రెడ్డి కూడా ఘర్షణకు దిగారు.

కొడంగల్, బాంరస్ పేటలలో కాంగ్రెసు నేతలు ధర్నాలకు దిగారు. బోమరస్ పేటలో కార్యకర్తలు పోలీసులపై తిరగబడ్డారు.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి, బోమరస్ పేటలో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ధర్నా చేస్తున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *