విజయ్ కు లేని ఇగో ఎన్టీఆర్ కు ఎందుకు..?

October 5, 2018 | News Of 9

‘తెలుగు వాళ్లు సెంటిమెంటల్ ఫూల్స్.. వాళ్లు ఎవరినైనా ఒక్కసారి అభిమానించడం మొదలు పెడితే చచ్చే వరకు అలాగే ఉంటుంది’ అని ‘ఠాగూర్’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఇది ముమ్మాటికీ నిజం. మామూలు జనాలతో పోల్చుకుంటే ఈ సెంటిమెంట్లు, ఎమోషన్లు సినిమా జనాలకు.. వాళ్లని అభిమానించే వారికి ఇంకాస్త ఎక్కువే. అందుకే తాము అభిమానించే హీరోల కోసం ఎదైనా చేస్తారు.. ఎంత దూరం అయినా వెళ్తారు. అలాంటి హీరోల జోలికి ఎవరైనా వస్తే.. ఆ హీరోలు అయినా చూసీ చూడనట్లు వదిలేస్తారేమో కానీ ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు. ప్రత్యర్థులు ఎంతటి వాళ్లైనా సరే వాళ్లతో సమరానికి సై అంటుంటారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇది రుజువు అయింది. హీరోలంటే అంత పిచ్చి అభిమానులకు. అయితే అభిమానం పేరుతో వారు ఒక్కోసారి హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు.  ఇలాంటి సమయంలోనే హీరోలు వారిని వారించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడున్న హీరోలలో ఒక్క పవన్ కళ్యాణ్ తప్పితే.. చాలా వరకు హీరోలందరూ అలాంటి ఫ్యాన్స్ ఫైటింగ్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారే కానీ.. బౌండరీస్ క్రాస్ చేయవద్దు అని అభిమానులను సంబాళించిన వాళ్లు లేరు. అయితే పవన్ తర్వాత మళ్లీ అలాంటి మంచి స్టెప్ హీరో విజయ్ దేవరకొండ తీసుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు.

అసలు విషయానికి వస్తే.. రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మధ్య కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ‘‘తారక్ ‘అరవింద సమేత’ రిలీజ్ టైమ్ లోనే విజయ్ ‘నోటా’ సినిమాను రిలీజ్ చేస్తావా, ఎంత ధైర్యం’’ అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. దీనికి కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చారు ‘రౌడీ’ హీరో ఫ్యాన్స్. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద గొడవగా తయారైంది. అయితే మ్యాటర్ సీరియస్ అవుతోందని రంగంలోకి దిగిన విజయ్.. తన ఫ్యాన్స్ కు ట్విట్టర్ లో పెద్ద మెసేజ్ పెట్టాడు. ‘’నేను ఇతరుల గురించి పట్టించుకోను.. ఒకవేళ ఎవరైనా మనల్ని ద్వేషించినా వారిని మంచిగానే పలకరిద్దాం, మన సంఖ్య పెరిగేకొద్దీ కొన్ని నియమాలు ఏర్పరచుకోవాలి.. సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టే సమయం వచ్చింది. దానికి మీ సహకారం నాకు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని అభిమానులకు చెప్పాల్సింది క్లియర్ గా చెప్పేశాడు.

అగ్నికి ఆజ్యం పోయకుండా.. తన మెసేజ్ తో ఫ్యాన్స్ ని కూల్ చేసిన విజయ్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. విజయ్ లాగే ఎన్టీఆర్ కూడా ఇలాగే ఫ్యాన్స్ కు ఏమైనా సూచనలు చేస్తే పరిస్థితి చేయి దాటకుండా చూడొచ్చు కదా అని సినీ జనాలు ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ వార్ గురించి తారక్ కు తెలిసే ఉంటుంది. కానీ తండ్రి చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉండి ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ అభిమానుల కోసం ఏదైనా చేస్తే అని మాటిమాటికీ చెప్పే ఎన్టీఆర్ కొంచెం సమయం కేటాయించి.. మాట వరసకైనా వాళ్లను కాస్త కంట్రోల్ లో ఉండమని సోషల్ మీడియా ద్వారా చిన్న మెసేజ్ పంపితే బాగుంటుందని ఫీలవుతున్నారు. మరి ‘అరవింద సమేత’ సినిమా ప్రమోషన్ లో ఉన్న వీరరాఘవుడు ఈ ఫ్యాన్ వార్ పై ఎంత తొందరగా రియాక్ట్ అయితే అంత మంచిది.

Other Articles

4 Comments

  1. Rey pawan kathi mahesh vivaadham jariginappudu enni rojulaki aapaadu ra and ntr chinna chinna vishayaalu scene chesey hero kaadhu ,so muskoni pakkaki mingeyyandi

  2. Already ntr chepparu a madyana Pawan fan ni ntr fan podichadu appudu already mahesh babu chepparu memu memu bagunnam mari meeru annaru akkade artam kavali all hero’s fans ki maarpu Mana lo ravaali okari nokaru dveshinchadam manesi snehanga undaali

  3. NTR to Vijay ni comparison it’s not correct
    NTR ముందు deniki panicestadu vadu, Vijay
    Nota mundu yenduku release చేసాడు, vadu కూడా 11-10-2018 release ceyyacchu కదా, వాడి stamina వాడి fans stamina realise cesukunee varu kada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *