అది ఎలక కాదు.. ఎఖిలిస్! ఉండవల్లి బోనులో పడుతుందా?

January 2, 2019 | News Of 9

అమరావతి: చంద్రబాబును తక్కువ అంచనా వేయకండి… ఆయన క్యారెక్టర్ ను చూస్తే చివరి వరకూ పోరాడే తత్వం ఉన్నవాడు. ఈ మాటలన్నది ఎవరో కాదు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్. రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేకరుల సమావేశంలోనే ఇష్టాగోష్టిగా పాత్రికేయులతో మాట్లాడుతూ చంద్రబాబును తక్కువగా అంచనా వేయవద్దని చెప్పారు. ఈ మాట మాత్రం నూటికి నూరు శాతం నిజం. ఈ లక్షణం.. కోస్తాంధ్ర ధనిక వర్గాలది. మొదటి నుంచీ భూములున్న వర్గాలుగా, డబ్బున్న వర్గాలుగా వారు ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోరు. రాయలసీమ వాసే అయినా.. ఎన్టీరామారావు అల్లుడుగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన ఈ లక్షణాన్ని బాగానే ఒంటబట్టించుకున్నారు. ఈనాడు అధినేత రామోజీరావునే చూడండి. ఓటమిని ససేమిరా అంగీకరించరు. అది ఆయన ఒక్కరికే పరిమితం కాదు. కోస్తాంధ్రకు చెందిన ఆ సామాజిక వర్గం జన్యువుల్లోనే అది ఉంది. అందువల్ల చంద్రబాబు కూడా ఓటమిని అంత తేలికగా అంగీకరించరు. ధరిత్రిని తల్లకిందులు చేసైనా, ప్రజలని మాయలో పెట్టి అయినా, శత్రువులను మచ్చిక చేసుకని అయినా, కుదరని పక్షంలో వంచించి అయినా నెగ్గాలి. చంద్రబాబును తక్కువగా అంచనా వేయవద్దని ఉండవల్లి చక్కగానే చెప్పారుగానీ… ఒక విషయాన్ని ఆయన గుర్తించలేదు. పార్టీలోనూ, పార్టీ బయటా ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న కోస్తాంధ్ర నయా పెట్టుబడిదారుల ఆకాంక్షల కోసం చంద్రబాబు పని చేస్తున్నారన్న విషయాన్ని ఉండవల్లి గుర్తించలేదు (లేదా బయటకు చెప్పడానికి ఇబ్బంది ఉండవచ్చు).

మరొక విషయంలో ఉండవల్లి పప్పులో కాలేశారు. భాజపాకి ఆంధ్ర రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేదు కాబట్టి… భాజపాని తిట్టి ఉపయోగం ఏమిటి అన్నది ఎవరి తర్కానికైనా అందే విషయమే. కానీ చంద్రబాబు ఎవరి తర్కానికీ అందని రాజకీయ నాయకుడు. కోస్తాంద్ర ధనిక వర్గం కోసం పని చేస్తున్నపుడు… సీఎంగా ఉన్న వ్యక్తి ఏం చేయాలో కూడా కోస్తాంధ్ర మేథావులే నిర్ణయిస్తారు. ఈ విషయంలో చంద్రబాబు కోణం నుంచి ఆలోచిస్తే.. ఆయన వ్యూహం సరైనదే. ఎప్పుడూ లేని స్థాయిలో అవినీతి అరోపణలు ఇపుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. నీతివంతమైన పాలనను అందించాను అని చెప్పి ప్రజల్ని ఒప్పించి పార్టీని గెలుపించుకోవడానికి అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయిన విషయాన్ని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు. అందుకే ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. ఇటు జగన్మోహన్ రెడ్డిగానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గానీ ఇప్పటి వరకూ అధికారంలో లేరు కనుక.. వాళ్లను తిట్టిపోయడానికి అంత అవకాశం లేదు. సీబీఐ కేసులున్నాయని కాబట్టి జగన్మోహనరెడ్డిని తిట్టడానికి కాస్తో కూస్తో చంద్రబాబుకు ఒక అవకాశం లభించింది. పవన్ విషయంలో విమర్శించడానికి ఏమీ లేదు. కిం కర్తవ్యం?

హీరో గెలవాలంటే.. విలన్ ఉండాలి కదా. ప్రతిపక్షం ఉంది కానీ, అది అంత పెద్ద విలన్ పాత్రకు సరిపోదు (చంద్రబాబు దృష్టి కోణంలో ఆలోచించాలి). మోడీ అంటే పెద్దవాడు. దేశానికే ప్రధానమంత్రి. చంద్రబాబు లాంటి వ్యక్తి యుద్ధం చేస్తే మోడీ లాంటి వ్యక్తిపైనే చెయ్యాలని కోరుకుంటాడు. జగన్ ను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి జగన్ తనకు సమఉజ్జీ అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు అవుతుంది. అందుకు చంద్రబాబు ఇష్టపడడు. ఎలాగూ మోడీ… కోస్తాంధ్ర ధనిక వర్గాలను కెలకడం చంద్రబాబుకు కలిసి వచ్చింది. చేతికి ఒక ఆయుధం దొరికింది. మోడీనే విలన్ చేస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరతాయి. ఎన్నికల్లో గెలవనూ వచ్చు. జగన్ వంటి చోటా లీడర్ ను ఉఫ్ మంటూ ఊదేయవచ్చు. కోస్తాంధ్ర ధనిక వర్గాల దృష్టిలో సీఎం చంద్రబాబు.. ఎఖిలిస్ తరహా యోధుడు. ఎవరితో పోల్చడానికి తెలుగు ఇతిహాసాల్లో మాకు సరైన పాత్ర కనిపించలేదు. అందుకే గ్రీకు ఇతిహాసం నుంచి తీసుకున్నాం. హోమర్ రాసిన ‘‘ది ఇలియాడ్’’ నాటకంలో ఎఖిలిస్ అనే పాత్ర ఉంటుంది. దీన్ని గ్రీకు హీరో అంటారు కానీ, అది యాంటీ హరో లక్షణాలున్న పాత్రే. (గుర్తులేకపోతే ట్రాయ్ సినిమా చూడండి). ఎఖిలిస్ తానొక పెద్ద వీరుడనిని నమ్ముతాడు. క్షమ అనేది ఏ కోశానా ఉండదు. అతని హృదయం పాషాణం అంటారు. అంటే శిల. తేలికగా లొంగే ఘటం కాదు. ట్రాయ్ దేశంపై దండెత్తిన రాజుల తరఫున ఎఖిలిస్ ట్రాయ్ యుద్ధంలో పాల్గొంటాడు.

మోడీ మానసికంగా మీపై ఒత్తిడి తెస్తున్నాడా అని ఇటీవలే ఒక విలేకరి చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.. ‘‘ఆయనే కాదు… ఎవరూ నాపై ఒత్తిడి తేవడం ఎవరి వల్లా కాదు. ఇంపాజిబుల్’’ అంటూ ఒక్క ముక్కలో కొట్టిపారేశాడు బాబు. అందుకే కోస్తాంధ్ర ధనిక వర్గాలుగానీ, ఆంధ్రప్రదేశ్ బయట ఉన్న పెట్టుబడిదారులుగానీ చంద్రబాబుపై ఆధారపడ్డారు.

అందుకే, ఒక వ్యూహం ప్రకారం బాబు భాజపాని విలన్ గా నిలబెట్టారు. భాజపా విలన్ అని ఇప్పటికే జనంలో ఒక భావన ఉంది. దానికి ఇంకాస్త నెయ్యి చేర్చితే చాలు. అదీ బాబు ప్లాన్. అందుకే భారతీయ జనతా పార్టీని విలన్ గా చేసేశారు. భాజపాకి ఓట్లు లేకపోతేనేమి? భాజపా రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని, తాను రాష్ట్రం కోసం  పని చేస్తున్నా.. మోడీ అడ్డం పడుతున్నారని లారీల కొద్దీ తిట్లు లంకించుకున్నారు చంద్రబాబు. పైగా జగన్ కూడా మోడీతో కలిసిపోయాడని చంద్రబాబు పదే పదే చెబుతున్నాడు. దీని వల్ల ఏమవుతుంది? ‘‘అయ్యో… చంద్రబాబుపై వీళ్లంతా దాడి చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రాజక్టులను అడ్డుకుంటున్నారు.. పాపం ఈ సారి కూడా చంద్రబాబుకే ఓట్లు వేద్దాం’’ అని ప్రజలు అనుకోకపోతారా అన్నది చంద్రబాబు ఐడియా. షాక్ అవుతున్నారా? ‘‘గ్లిజరిన్ పాలిటిక్స్ అను ఒక మాయాజూదం’’ శీర్షికతో ‘‘న్యూస్ ఆఫ్ 9’’ దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పటికే మా పాఠకులకు అందించింది. అది కేసీఆర్ తిట్ల పురాణం వెనుక ఉన్న రహస్యాన్నీ విడమరిచి చెప్పింది. 2019 ఎన్నికలకు బాబు చేతిలో ఉన్న పాశుపతాస్త్రం.. ‘‘సానుభూతి కార్డు’’. ప్రజల ఓట్లు కొల్లగొట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి ఇంత కంటే మంచి ఐడియా చంద్రబాబు దగ్గర ఏం ఉంటుంది? భాజపాకి ఇక్కడ ఏమీ లేదుగా అంటే.. లేదు. ఈ విషయం చంద్రబాబుకు తెలియదేమిటి? అధికారం విషయంలో కోస్తాంధ్ర ధనికులు… సొంత మనిషైనా ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. వెన్నుపోటు పొడిచి మరీ దింపేశారు. పాత తెలుగు సినిమాల్లో రాజులూ, రాచరికాలూ కుట్రలూ మామూలే. అందువల్ల చంద్రబాబుకు వెన్నుపోటు పెద్ద నెగటివ్ కాకుండా పోయింది.

అబద్ధాల యంత్రం!

సీఎం చంద్రబాబు వెనుక భారీ అధికార యంత్రాంగం ఉంది. ఈ యంత్రాంగం పుంఖాను పుంఖానులుగా అబద్ధాలను తయారు చేస్తుంది. విలేకరుల సమావేశాలు పెట్టి… చంద్రబాబు వాటిని అలవోకగా చెప్పేస్తూ ఉంటారు. విలేకరులు ఒక్క ప్రశ్న కూడా అడగరు. చెప్పింది రాసుకుని వెళ్లిపోతారు. ఇదీ అమరావతిలో జరుగుతున్న తంతు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నాడంటూ ఐవైఆర్ కృష్ణారావు, ఇతరులు యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబుకున్న సాయుధ సంపత్తి వల్ల ఆయన్ను జీరో అని చూపించడం వీళ్లకు కష్టం అయిపోతున్నది. చంద్రబాబు… కోస్తాంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధిగా ఉన్నారన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. తెలుగుదేశం పార్టీ మొదట నుంచీ.. సొంత పెట్టుబడిదారుల కోసమే పని చేసింది. గొంగటిలో తింటూ… ఏదో ఏరుకున్నట్లు అన్న సామెత తెలుసుకదా. చంద్రబాబును నిజాయితీగా ఉండమని అడగడం, జరుగుతున్న అక్రమాలకు సమాధానం చెప్పమని అడగడం ఇవన్నీ వృధా. దేనికీ ఆయన సమాధానం చెప్పరు. నిజాయితీగా దేనికైనా సమాధానం చెప్పిన దాఖలా చరిత్రలో లేదు. మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ చాలా సీనియర్ రాజకీయవేత్త… చంద్రబాబు పారదర్శకంగా ఉండాలని హితబోధ చేయడం విచిత్రం. అన్నా క్యాంటీన్లు, ఎల్ ఈడీ బల్బులు అన్ని ప్రాజెక్టుల్లోనూ డబ్బులు మింగేశారని అరుణ్ కమార్ వాపోతున్నారు. కృష్ణానది అన్నది రేపన్న రోజున ఉంటుందో లేదోనని బాధపడాలి. ఎల్ఈడీ బల్బుల కోసం ఆయన ఆందోళన పడటం విచిత్రం. మార్పు ఒక్కటే సరైన పరిష్కారం. పెట్టుబడిదారుల పార్టీల వల్ల ఇదే జరుగుతుంది. మనుషులు మారినా ఫలితాలు ఇలాగే ఉంటాయి. పేదల కోసం పని చేసే పార్టీలు అధికారానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కోస్తాంధ్ర ధనికుల పెత్తనమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు జరిగే మేలు ఏమీ ఉండదు. ఆలోచించాల్సిన సమయమిది!!

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *