‘సైరా’లో జ‌గ‌ప‌తిబాబు రోల్ ఏంటంటే..

February 12, 2019 | News Of 9

SyeRaa Movie Jagapathi Babu Look | telugu.newsof9.com

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టులో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న చిత్ర‌యూనిట్.. స్పెషల్ అకేషన్స్ సందర్భంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా సైరాలో ఆయనకు సంబంధించిన లుక్ విడుద‌ల చేశారు.

‘సైరా’లో జగపతి బాబు వీరారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఉయ్యాలవాడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆయనకు సపోర్టుగా జగపతిబాబు పాత్ర ఉంటుందని తెలుస్తోంది. తాజాగా విడుదదలైన లుక్ జగ్గూభాయ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారీగా గడ్డం, పొడవాటి జుట్టుతో జగపతి బాబు లుక్ ఎవరూ గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఆయన పాత్ర తలపాగా చూస్తుంటే.. రాజరికపు పాత్రలో లేదా అధికారి పాత్రలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమా ఓవరాల్ షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా డెడ్ లైన్ పెట్టుకున్నారని తెలుస్తోంది.

Other Articles

8 Comments

 1. I do not even know the way I finished up here, however
  I assumed this put up was once great. I don’t realize who you’re but definitely you are
  going to a famous blogger for those who aren’t already.
  Cheers!

 2. Amazing blog! Do you have any hints for aspiring writers?
  I’m planning to start my own blog soon but I’m a little lost on everything.
  Would you advise starting with a free platform like WordPress or go
  for a paid option? There are so many choices out there that I’m completely confused ..
  Any ideas? Appreciate it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *