RRR మూవీపై పూర్తి క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి

March 14, 2019 | News Of 9
RRR Movie Press Meet Photos | telugu.newsof9.com

ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న RRR మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్స్‌ని రాజమౌళి తెలిపాడు. 1897 లో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు రోల్ లో రామ్‌చరణ్ నటిస్తున్నాడని , అలాగే, 1902లో యంగ్ ఏజ్ లో కొమరంభీమ్ క్యారెక్టర్ లో తారక్ నటిస్తున్నాడని చెప్పాడు రాజమౌళి. వీళ్లిద్దరి జీవితాల్లో ఒక సిమిలారిటీ ఉందని, ఇద్దరూ కూడా రెండు సంవత్సరాలు ఇంట్లోనుంచి బయటకి వెళ్లిపోయి తర్వాత వచ్చిన తర్వాతే స్వాతంత్ర్య సమరయోధులుగా మారారని చెప్పాడు రాజమౌళి. ఇదే మైయిన్ కథ అని, ఇది ఎవ్వరికీ తెలియని కథ అని చెప్పారు. చాలా లార్జ్ స్కేల్ లో సినిమా ఉండబోతోందన్నాడు.

రామ్ చరణ్ కి జోడిగా అలియాభట్ నటిస్తోందని, అలాగే ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ అందాలభామ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తోందని చెప్పాడు. ఇంకా ఈ సినిమాలో మైయిన్ లీడ్ రోల్ లో అజయ్ దేవ్ గన్ నటిస్తున్నాడ‌ని, సముద్రఖని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నారని  చెప్పాడు. అన్ని భాష‌ల్లో 2020 జూలై 30వ తేదిన ఈ  సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *