విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలంటూ జనసైనికుల నిరాహారదీక్ష

February 9, 2019 | News Of 9

Janasainiks started hunger strike demanding quality food for students

ఉప్పలగుప్తం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కొత్తపల్లి గ్రామంలో జనసైనికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఉప్పలగుప్తం మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో 400 మంది మధ్యాహ్న భోజనం చేసేవారు. అయితే ప్రభుత్వం కాంట్రాక్టు విధానం తీసుకొచ్చాకా పట్టుమని 20 మంది కూడా స్కూల్లో భోజనాలు తినడం లేదు. భోజనంలో నాణ్యత లేకపోవడంతో తిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

ఈ విషయం గ్రామంలోని జనసైనికుల దృష్టికి వచ్చింది. దాంతో కొంతమంది కార్యకర్తలు మూడురోజులపాటు పిల్లలకు పెట్టే కాంట్రాక్ట్ భోజనాన్ని పరిశీలించారు. ఆ పాఠశాల విద్యార్థుల అభిప్రాయాలను తీసుకున్నారు. సమారు 150 మంది నుంచి సంతకాలతో మండల కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. స్కూలు సిబ్బందికి కూడా వినతి పత్ర ఇచ్చారు. కానీ వారినుంచి ఎటువంటి స్పందనా లేదు.

పిల్లలకు పెట్టే భజనంలో కూడా కాంట్రాక్టు విధానం తీసుకొచ్చి ప్రభుత్వం అన్యాయం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కొత్తపల్లి సెంటర్ లో అమలాపురం పార్లమెంటరీ అధికార ప్రతినిధి కడియం సత్యానందం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో భోజనం ఇంతకు ముందు మాదిరిగా వండి పెట్టే వరకూ ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని అంటున్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పెమ్మాడి శ్రీను, చెక్కా ఈశ్వర్ , చిక్కం భీముడు, సత్తి అలేఖ్య, కైరం సత్య , పినిశెట్టి సురేష్, కోడి శివ, మోటూరి భాస్కర్ రావు పాల్గొన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *