‘‘జన్మభూమి’’ సాక్షిగా.. జనసేన ప్రచారం!!

February 14, 2019 | News Of 9

anasena Campaign on board Janmabhumi Express

  • విశాఖ నుంచి విజయవాడ వరకూ
  • కదిలే వేదిక… జన్మభూమి ఎక్స్ ప్రెస్
  • తేదీ: ఈ నెల 16 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ

విశాఖపట్నం: పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం చేయడంలేదు అని ఒకప్పుడు అనేవారు. మీరంతా పార్టీ కాదా అని పవన్ సభల్లో అడిగేవారు. ఆయన అన్నట్లుగానే పార్టీ దానంత అదే నిర్మించుకుంటూ పోతున్నది. జనసేనాని అందించే స్ఫూర్తితో అనేక మంది స్వయంగా కార్యక్రమాలను రూపొందించుకోవడాన్ని చూస్తుంటే.. పెట్టుబడిదారీ పార్టీలకూ, జనసేనకూ ఎంత తేడా? చరిత్ర మార్పును కోరుకుంటున్నపుడు… అన్నీ వాటంతట అవే జరుగుతాయి. జనసేనాని స్ఫూర్తితో మరో రైలు ప్రయాణానికి జన సైనికులు శ్రీకారం చుడుతున్నారు. మొన్న విశాఖ నుంచి పలాస వరకూ రైల్లో ప్రయాణించి పెద్ద ఎత్తున పార్టీ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇపుడు అంతకంటే పెద్ద స్థాయిలో ట్రెయిన్ క్యాంపెయిన్ చేయాలని ‘‘జనసేన- హెల్పింగ్ హ్యాండ్స్’’ సంస్థ నిర్ణయించింది. ‘‘జన సైనికుల రైలు ప్రయాణం’’ దీనికి నామకరణం చేశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఇందుకు కదిలే వేదిక అవుతున్నది. ఈ నెల 16న విశాఖపట్నం నుంచి విజయవాడ వరకూ ఈ రైలు యాత్ర సాగుతుంది. ఉదయం ఆరు గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ చేరుకుంటారు. పార్టీ సిద్ధాంతాలను జన సైనికులు ప్రయాణికులకు వివరిస్తారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *