అమెరికాలోని సియాటెల్ లో జనసేన గర్జన నేడే

December 2, 2018 | News Of 9

Janasena garjana today in Seattle USA | Newsof9

సియాటెల్: మార్పు అవసరం అయినపుడు.. చరిత్ర ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది. అప్పుడు అందరూ కలిసి ముక్తకంఠంతో గర్జిస్తారు. అదే జనసేనగా అవతరించింది. మార్పు దిశగా జన సైనికులను సమీకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉవ్వెత్తున సాగుతున్న జనసేన ప్రభంజనం దేశ సరిహద్దులు దాటి.. ప్రవాస జనసేన రూపంలో ప్రతిధ్వనిస్తూ సరిహద్దుల అవతల కూడా జనసేన ప్రాచుర్యాన్ని పొందుతోంది. అమెరికాలోని సియాటెల్ నగరం డిసెంబరు 1వ తేదీ నాటి సమావేశానికి సర్వం సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ సజావుగా జరిగాయి. డల్లాస్ నగరంలో డిసెంబరు 15న జరగనున్న ‘‘డల్లాస్ ప్రవాస గర్జన’’కు ఇది సన్నాహక సమావేశంగా మొదలైనా… ఇది కూడా సియాటెల్ గర్జనలా మారింది. చూడండి… పైనున్న ఫోటోలోనూ, ఈ వార్త కిందనున్న వీడియోలోనూ వలంటీర్ల బృందాన్ని చూస్తుంటే.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ అందరినీ జనసేన ఘోష చుట్టేస్తోంది.

కొత్త సభ్యత్వాలను నమోదు చేయడంతోపాటు జనసేన సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ఎన్నారైల్లోకి తీసుకెళ్లేందుకు ప్రాథమికంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపు 500 మంది ఎన్నారైలు పాల్గొంటున్న ఈ సియాటెల్ గర్జన సమావేశం జరిగేది ఈ రోజే. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ జరుగుతుంది. సియాటెల్ లోని రాయల్ బాంక్వెట్ హాల్లో జరిగే ఈ సమావేశానికి జనసేన సైనికులు, అభిమానులూ పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *