జనసైనికుల పాదయాత్ర

February 11, 2019 | News Of 9

కంచికచర్ల: రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కృష్ణా జిల్లా కంచికచర్ల జనసైనికులు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర కంచికచర్ల  పట్టణం నుంచి పరిటాల ఆంజనేయ స్వామి సన్నిధానం వరకు సాగుతుంది. ఆలయానికి చేరుకున్న అనంతరం ఆంజనేయ స్వామి పాదాలచెంత జనసేన పార్టీ మేనిఫెస్టో పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి కావడం వల్లే తమ ప్రచారాన్ని ఈ విధంగా ప్రారంభించామని నాయకులు తెలిపారు.

ప్రజలకు మేనిఫెస్టో పత్రాలను పంచుతూ అందులో పొందుపరిచిన అంశాల ప్రాముఖ్యతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని జనసైనికులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలతో కూడిన పరిపాలన పవన్ తోనే సాధ్యమని ఈ సందర్భంగా జనసేన నాయకులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్క జన సైనికుడు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జనసేన మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేన పార్టీకి అఖండ విజయం చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *