జనసేన పార్టీ సోషల్ మీడియా సెంట్రల్ కమిటీని ప్రకటించిన జనసేనాని..

February 8, 2019 | News Of 9

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సోషల్ మీడియా విభాగం “శతఘ్ని” సెంట్రల్ కమిటీని హైద్రాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించారు. అలాగే ‘జే ఎస్ పీ రివోల్ట్ 2019’ అనే సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాన్ని జనసేనాని ప్రారంభించారు. ‘పాతిక కిలోల బియ్యం కాదు పాతికేళ్ల పిల్లల భవిష్యత్తు’ అనే నినాదాన్ని ఈ ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన కమిటీలో ఆరుగురు సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు , పన్నెండు మంది సోషల్ మీడియా ఎక్సిక్యూటివ్ సభ్యులతో పాటుగా, ఆరుగురు అడిషనల్ ఎక్సిక్యూటివ్ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ కమిటీ రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని గుర్తించి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పార్టీ కోసం పనిచేస్తున్న జనసైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసారు. పార్టీ భావజాలాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్, సెంట్రల్ కమిటీ.

1. జ్ఞాన వర్ష

2. ముకేష్ చౌదరి

3. మాచర రావు (చంటి)

4. రుద్ర బండారు

5. సౌరబ్ హరి

6. వినోద్ వర్మ

సోషల్ మీడియా ఎక్సిక్యూటివ్స్, సెంట్రల్ కమిటీ.

1. అఖిల్

2. అనిల్

3. అనుదీప్

4. చాంద్ బాషా

5. చందన్ కుమార్

6. కలేషా వలి

7. నవీన్

8. ప్రతాప్

9. శ్రీ చరణ్

10. శ్రీరామ్ చక్రవర్తి

11. సూర్య హర్ష

12. వెంకట కృష్ణ

అడిషనల్ సోషల్ మీడియా ఎక్సిక్యూటివ్స్, సెంట్రల్ కమిటీ.

1. హరి కృష్ణ

2. పవన్ కుమార్

3. రాజేష్

4. రత్న సాయి

5. సాయి ప్రవీణ్

6. శ్యామ్ ప్రకాష్

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *