మైదుకూరులో జనసేన కార్యలయం ప్రారంభం..

February 9, 2019 | News Of 9
previous arrow
next arrow
Slider

మైదుకూరు: కడపజిల్లా మైదుకూరులో ఈ రోజు జనసేన కార్యాలయం ప్రారంభమైంది. పందిటి మల్హోత్రా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర నాయకులు దిలీప్ సుంకర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయానికి ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు పీవీఎస్ మూర్తి, జయప్రదారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మైదుకూరు సాయిబాబా గుడి నుండి రాయల్ కూడలి మీదుగా జనసేన పార్టీ కార్యాలయం వరకు సాగింది.

కార్యలయాన్ని ప్రారంభించిన అనంతరం దిలీప్ సుంకర మాట్లాడుతూ ‘‘ఒక పెద్దాయన నాతో అన్నాడు. జనసేన పార్టీ ప్రభల్యం ఉభయగోదావరి జిల్లాల్లో తప్ప మరెక్కడా లేదన్నాడు. అది నిజమో కాదో చూద్దామని పందిటి మల్హోత్రా పిలవగానే ఇక్కడికొచ్చాను. ఇక్కడ అడుపెట్టగానే కడప గడ్డ జనసేన అడ్డా అన్నట్టు ఉంది. కార్యకర్తల ఉరిమే ఉత్సాహం చూస్తుంటే మార్పును కాంక్షించే వ్యక్తులు వ్యవస్థను దాటి సామాజిక వర్గాలను దాటి ఏకీకృతమవుతున్నారనడానికి ఇది చిహ్నం అని తెలియజేసుకుంటున్నాను. మీకెన్ని ఓట్లొస్తాయని అడుగుతున్నారు.. నియోజక వర్గానికి పదివేల ఓట్లే వస్తే ఆ పదివేల మందీ జనసేనకు మద్దతుదార్లు కాదా అని అడుగుతున్నాను. బలం అనేది ప్రత్యర్థుల కండల్లో ఉండదు. వారి పట్ల భయం మన గుండెల్లో ఉండి మనల్ని తెలియకుండానే బానిసల్ని చేస్తుంది. కడప నిత్యం నేను వస్తూనే ఉంటా మీలో ధైర్యం నింపుతూనే ఉంటాను.’’ అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *