తెలంగాణలో పోటీకి జనసేన సై…!!

March 16, 2019 | News Of 9

  Janasena

  • దరఖాస్తులు కోరుతూ ప్రకటన

(న్యూస్ ఆఫ్ 9)

జనసేన తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్ధులను నిలబెట్టనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంతకు పూర్వమే ప్రకటించారు. ఆ ప్రకారం.. 2019 లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి గట్టి అభ్యర్ధులను పోటీకి దించుతున్నట్లు  పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు. తెలంగాణ నుంచి ఎన్నికల్లో నిలబడేందుకు ఆసక్తి చూపిస్తూ ఇప్పటికే చాలా మంది అభ్యర్ధులు హైదరాబాదు, విజయవాడల్లోని పార్టీ కార్యాలయాలకు వచ్చి దరఖాస్తులను అందించారు. అభ్యర్ధిత్వాలను పరిశీలించేందుకు తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక ద్విసభ్య కమిటీని కూడా పార్టీ నియమించింది. పార్టీ నేతలు నేమూరి శంకర్ గౌడ్, అర్హం ఖాన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆసక్తిగల వారు హైదరాబాదులోని మాధాపూర్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచీ దరఖాస్తులను అందించాలని పార్టీ కోరుతున్నది. మూడు రోజులపాటు ఆశావహుల దరఖాస్తులను, రాజకీయ నేపథ్యాన్నీ ద్విసభ్య కమిటీ పరిశీలిస్తుంది. అభ్యర్థుల ఎంపికపై తుదినిర్ణయం పార్టీ జనరల్ బాడీదేనని జనసేన శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *