తప్పును మీ లెక్కలు… తప్పవు రేపు లెంపలు!!

February 6, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేకం)

2019 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి?

ఎవరు ఎవరికి ఓటు వేస్తారు?

బరిలో నిలబడే అభ్యర్ధులను బట్టి ఓటర్ల మనోభావాలు ప్రభావితం అవుతాయా?

ఈ సారి క్రాస్ ఓటింగ్ జరుగుతుందా?

జరిగితే దాని ప్రభావం ఎంత వరకూ ఉంటుంది?

ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి?

అగ్రకులాలు ఎవరికి ఓట్లు వేస్తారు?

రాసిలో ఎక్కువగా ఉన్న కాపుల ఓట్లు ఎటు?

బడుగు వర్గాలు ఎటువైపు ఉన్నాయి?

ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి?

ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు?

ఇంకా చలిపోలేదు. అంటే వేసవి రాలేదు. ఎన్నికల వాతావరణం కూడా ఈ సంధ్య వాతావరణాన్ని దాటే దశలోనే ఉంది. బహుశా ఈ నెలఖరు నుంచి ఎన్నికల వేడి బయటా… అటు మీడియాలోనూ పెరగవచ్చు. అప్పటి వరకూ సెఫాలజిస్టులు చేసే సర్వేలు చూసుకుని.. ఇష్టమైన పార్టీ గెలుస్తుంది అంటే మురిసిపోవడం, లేదంటే నీరసించిపోవడం. మరి 2019 ఎన్నికలు ఎలా ఉండబోతాయి అన్న దానిపై మొన్న జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో జనసేన పార్టీ ప్రస్తావన కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మనం ఇంత వరకూ జాంగ్రీ అనే స్వీటు తినలేదు.. మనం దానిని చూడనూ లేదు. మరి ఎవరైనా జాంగ్రీ తింటావా అని ఎవరైనా అడిగితే మనకు నోటిలో లాలాజలం ఊరదు. కారణం మన మెదడుకు జాంగ్రీకి సంబంధించిన పూర్వానుభవాలు లేకపోవడమే. తమ తమ పూర్వానుభవాల భూమికగానే మనుషులు ఒక అభిప్రాయానికీ, లేదా అంచనాలకూ వస్తారు. అంకగణితం కంటే.. రాజకీయ పరిమాణాల అంచనాకు ముందు కావాల్సిన ప‌రిజ్ఞానం- పొలిటికల్ సైకాలజీ. జనసేన 2014లో పోటీ చెయ్యలేదు, అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల ఓట్ల శాతంలో తేడా పెద్దగా లేదు. తెలుగుదేశం 32.5 శాతం, వైఎస్సార్సీపీ 32.01 శాతంగా ఉన్నాయి. అనూహ్య రాజకీయ వాతావరణం అప్పటికి నెలకున్ని ఉంది. జగన్మోహన రెడ్డిపై కేసులు ఉన్నందున, అదీ రాష్ట్రం కష్ట కాలంలో ఉన్నందున తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే బెటర్, అనుభవం ఉన్న నేత అని జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచింది. టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య ఉన్న ఆ స్వల్ప తేడా అర శాతం. అంటే ఈ అరశాతం పవన్ చెబితే ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయని ఆయన ఎన్నికల్లో గెలవడానికి పవన్ మద్దతు కారణమైందని అందరూ తొలుత భావించారు. తర్వాతర్వాత నమ్మారు. 2014లో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఓటర్లు ఏదో ఒకవైపున నిలబడ్డారు. అందుకే ఇద్దరికీ అటు ఇటుగా సమానంగానే ఓట్ల శాతం వచ్చింది. ఈ సారి ఆ పరిస్థితి లేదు. టీడీపీ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. వైఎస్సార్సీపీదీ అదే పరిస్థితి. కేవలం ఓట్లను చీల్చడం కాకుండా.. అవినీతికి ఆస్కారం లేని పార్టీ వస్తే.. రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అయితే… జనసేన అని ఎవరూ బహిరంగంగా చెప్పడం లేదు. ఎందుకంటే, అధికార పార్టీ వేధింపులు ఎక్కువ అయ్యాయి. అందుకే ఓటర్లు గుంభనంగా ఉన్నారు. సైలెంట్ వేవ్! ఈ సునామీ బయటకు కనిపించేది కాదు. సెఫాలజిస్టులు గుర్తించేదీ కాదు. ఇదో ప్రత్యేక పరిస్థితి. 

2019 ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటూ జనసేన ఎన్నికల బరిలో నిలిచింది. మరి జనసేనను అంచనా వేయడం ఎలాగ? అంచనా వేసే… సెఫాలజిస్టులకుగానీ, సెఫాలజిస్టులు సంప్రదించే ప్రజలకుగానీ జనసేనకు సంబంధించిన పూర్వానుభవం లేదు. జనసేన శక్తిని అంచనా వేయడానికి సెఫాలజిస్టులకుగానీ, రాజకీయ నాయకులకుగానీ అందుబాటులో ఉన్న ఏకైక తూకం రాళ్లు (పూర్వానుభవం) 2014 నాటి అర శాతం ఒకటి. ఇది కాకుండా అందరూ ముక్తకంఠంతో పరిగణలోని తీసుకునే అంశం- ప్రజారాజ్యం పార్టీ ఓటమి. ప్రజా రాజ్యం ఓడిపోయింది కాబట్టి… చిరంజీవికిగానీ, ఆయన స్థాపించిన పార్టీకిగానీ ప్రజల్లో నిజమైన అభిమానం లేదనీ, అందుకే అవి ఓట్లుగా మారలేదని సభ్య సమాజాన్ని పత్రికలూ, టీవీలూ నమ్మించాయి. దళిత, బహుజన ఆకాంక్షలు అంబరాన్ని తాకిన మహోజ్వల ఘట్టం- ప్రజారాజ్యం. కానీ కుట్ర చేసి వెన్నుపోట్లు పొడిచి… ఆ పార్టీనీ, ఆ పార్టీతో అల్లుకున్న బహుజన ఆకాంక్షల్ని కమ్మ సామాజిక వర్గం కర్కశంగా చిదిమేసింది.

ఇంత జరిగిన తర్వాత ఎవరైనా కుళ్లి కుశించిపోతారు. పవన్ కళ్యాణ్ అలా కాలేదు. రెట్టించిన బెబ్బులిలా.. తిరిగి వచ్చేశాడు. పోయిన చోటే వెతుక్కోవాలని సామెత. ఈ గడ్డపైనే మళ్లీ విజయ దుందుభి మోగించాలి. అందుకే కదన కాహళితో పవన్ రగులుతున్నాడు. అర్థమైన వారికి అర్థమైంది. ఏ కుల రక్కసి దెబ్బకు ప్రజారాజ్యం అనే శాంతి కపోతం నేలకొరిగిందో.. ఆ కులాన్నే త్యజించాడు. రెల్లి కులం తీసుకున్నాడు. కులాల్ని కలిపేస్తానన్నాడు. కుల వివక్ష కత్తిపోటు తిన్నవాడికి తెలుస్తుంది బాధ. ఈ బాధ ఎవరికీ వద్దనుకున్నాడు. ఇంత కసితో… యువ హృదయాల్లోకి దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్. 

జనసేన ప్రభంజనమై… పెట్టుబడిదారీ పార్టీలను ముంచేస్తుందన్న విషయం తెలుగుదేశం పెద్దలకు అర్థంకాకపోలేదు. అందుకే మళ్లీ కుట్రలకు తెరతీశారు. తెలుగుదేశంతో కలుస్తున్నాడంటూ సిగ్గులేని కూతలన్నీ కూశారు. 2019కి లేదు… 2024లోనే పవన్ పోటీ చేస్తాడు అంటూ మరో ప్రచారానికి తెరతీశారు తెలుగుదేశం వారు. ఇలాంటి ప్రచారాలను నమ్మే…కుహనా మేథావులు చెబుతున్న మాట ఏమిటంటే ‘ప్రజారాజ్యం ఏం సాధించింది కనుక.. జనసేన సాధిస్తుంది?’’ అన్న విమర్శ చేస్తారు. అగ్రకుల అహంకారానికి ప్రజారాజ్యం బలి అయిపోయిందని ఎవరూ చెప్పలేదు కనుక… కుహనా మీడియా కథనాలనే జనం నమ్మారు. బహుజనుల పురోగమనంలో… రాజ్యాధికారాన్ని అందుకునే ప్రయాణంలో ముళ్లు ఉంటాయి. రాళ్లు ఉంటాయి. ఈ ఎత్తుపల్లాల్లో ప్రజారాజ్యం చేసింది అనితరమైన త్యాగం. ఎదుటి వారిని పల్లెత్తు మాట అనడానికి కూడా ఆలోచించే.. మెగాస్టార్ చిరంజీవి..నేడు మౌనం. ఎడతెగని ఆ పెద్దాయన మౌనం.. ఆనాటి కుట్రలను నేటికీ దళిత, బహుజనుల గుండెల్లో రగిలిస్తూనే ఉంది. ఈ మంటల సెగలను సెఫాలజిస్టులుగానీ, రాజకీయ విశ్లేషకులుగానీ అంచనా వేయలేరు. ఈ గుండె మంటలు రేపు రాబోయే ఎన్నికల్లో ఓట్ల రూపంలో పెల్లుబుకుతాయి.  

వీడీపీ అస్సోసియేట్స్ ఒక సెపాలజిస్టు కంపెనీ. వారేం చెబుతారంటే- కాపుల ఓట్లు టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య విడిపోతాయని అంచనా వేశారు. వాళ్ల అతి తెలివి ఏమంటే… టీడీపీలో చాలా మంది కాపు మంత్రులు ఉన్నారు కాబట్టీ,  కాపు కార్పొరేషన్ పెట్టింది కాబట్టీ.. కొన్ని కాపు ఓట్లు టీడీపీకి అని అంచనా వేశారు. అలాగే భాజపా అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు కాబట్టి… కొన్న ఓట్లు భాజపాకి వెళ్లిపోయినట్లు అంచనా వేశారు. ఇది ఒక దుర్మార్గం. కన్నా లక్ష్మీనారాయణ కాపు కుల ప్రతినిధిగా ఎప్పుడూ లేరన్నది వాస్తవం. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్న కారణంగా.. తెలుగువారంతా భాజపాపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ఈ నేపథ్యంలో భాజపాకు కాపులు ఓట్లు వేసే పరిస్థితి లేనే లేదు. టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కేవలం ఓట్ల కోసం ధ‌నయ‌జ్ఞం చేస్తున్న టీడీపీకి కాపులే కాదు.. ఏ సామాజిక వర్గం వారూ ఓట్లు వేసే పరిస్థితి లేదు.

తండ్రి తెలుగుదేశంలో ఉన్నా… కూతుర్లు జనసేనకు ఓటేస్తామని అంటున్నారు. ఇలా చెప్పడాన్ని బట్టి చూస్తే యువత మార్పును బలంగా కోరుకుంటున్నారనేది వాస్తవం. పవన్ కళ్యాణ్.. మార్పు కోసం ఉదయిస్తున్న సూరీడు. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలంటున్న యువతకు దారి చూపిస్తున్న దీప స్తంభం – జనసేన.

దళిత, నిమ్న వర్గాలన్నీ కూడా జనసేనతో కలిసి కవాతు చేస్తున్నాయి. ప్రజారాజ్యం నాటి కుట్రపై కక్ష తీర్చుకోవాలని చూస్తున్నాయి. 70 ఏళ్లుగా రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న రెండు కులాలపై వారంతా ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి కాపుల ఓట్లుగానీ, బలహీన వర్గాల ఓట్లుగానీ చీలిపోయే అవకాశం లేదు. అవి జనసేనకే వస్తాయన్నది నిస్సందేహం. పసుపు-కుంకుమ రూపంలోగానీ, పించను రూపంలోగానీ డబ్బులు ఇస్తున్నది ఓట్ల కోసమే తప్ప.. ప్రజలపై తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక అభిమానం ఏమీ లేదని వారంతా విశ్వసిస్తున్నారు. బ్రాహ్మణులు కూడా ఒకప్పుడున్నట్లు ఆధిపత్య కులంగా లేరు. వారూ చితికిపోయారు. గుళ్లో దీపం లేకపోతే ఇంట్లో పొయ్యి వెలిగే పరిస్థితిలేదన్నట్లుగా తయారైంది. వారు కూడా మార్పును కోరుకుంటున్నారు. ఎంతకాలం డబ్బున్న వర్గాల దగ్గర ఆశ్రిత కులంగా కాలం వెళ్లదీస్తామన్న ఆలోచన వారు చేస్తున్నారు. క్షత్రియుల ఓట్లు కూడా జనసేన వైపే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలితరం పారిశ్రామికవేత్తలు రాజులే. వ్యాపారంలోగానీ, వ్యక్తిగత జీవితంలోగానీ నిబద్ధతకు వారు ప్రతిరూపాలు. హత్యలూ, అబద్ధాలతో పనిలేకుండా వారు జీవిస్తూ… మరో పది మందికి జీవికను అందించగల విశాల హృదయం వారిది. ఇప్పుడున్న రెండు ఆధిపత్య కులాలపై రాజుల్లో కూడా ద్వేషం ఉన్నది. అందువల్ల కూడా వారు జనసేనను ఆదరిస్తున్నారు. నిన్ననే ప్రముఖ బీవీరాజు ఫౌండేషన్ ఛైర్మన్ జనసేనలో బాధ్యతలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఇది పెను సంచలనానికి దారితీసింది.

జనసేన గేట్లు తీస్తే… ఇతర పార్టీల నుంచి గుంపులుగా వచ్చి చేరితే చూడటానికి బాగుంటుంది. పది మందికీ చెప్పడానికి బాగుంటుంది. కానీ దాని వల్ల అన్యాయం జరిగేది ప్రజలకే. అందుకే జనసేనాని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫలానా నాయకుడు మావైపు వద్దులే అని చెప్పగల ధీరోదాత్తుడు పవన్. ఏ వెధవ వచ్చినా కండువా కప్పడానికి సిద్ధంగా ఉన్న పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ. జనసేన వేరు. దాని ఊపిరి వేరు. అది జనఘోష. ఈ ఘోషను రికార్డు చేసే యంత్రాలు సెఫాలజిస్టుల దగ్గర లేవు.

లోక్ సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి.. క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్నది మరో వాదన. జాతీయ స్థాయిలో యూపీఏ, ఎన్డీఏ మధ్యనే పోటీ. ఈ రెండింటిలో ఎవరికి ఓటు వేయాలన్నది ప్రజలు ఎంచుకోవాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో మోడీని కోరుకున్న వారు… రాష్ట్రంలో జనసేనకే ఓటు వేస్తారు. తెలుగుదేశం వద్దు అనుకున్న వారంతా కూడా మోడీకే వేస్తారుగానీ… తెలుగుదేశంతో ఉన్న కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏకి వేసే అవకాశం లేదు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకపోవడంగానీ, నిధులు రాకపోవడంగానీ వీటికి కారణం.. చంద్రబాబు అన్నది క్రమేపీ తెలుగు ప్రజలకు అర్థమైంది. ఈయన పదే పదే యూటర్న్ లు తీసుకోవడం వల్లనే మోడీ నిధులు విదల్చలేదన్నది అర్థమైంది. దేశభక్తిగానీ, సచ్ఛీలత విషయాల్లో జనసేనకు కేంద్ర స్థాయి పార్టీల్లో ఒక నమ్మకం ఉంది. ఈ విషయంలో మోడీకి కూడా పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉంది. పవన్ వస్తే… స్పెషల్ స్టేటస్ ఇవ్వవచ్చునేమో. అత్యధికంగా నిధులు కూడా ఇవ్వవచ్చునేమో. కేంద్రంలో కాంగ్రెసు వచ్చే పరిస్థితి ఇప్పటి వరకూ అయితే కనిపించడం లేదు. కేంద్ర స్థాయిలో కొన్ని లోపాలు ఉన్నా… క్షేత్రస్థాయిలో ప్రాంతీయ పార్టీలు చేస్తున్న అవినీతి, అల్లరి అన్నింటినీ ప్రజలు సరిగానే బేరీజు వేసుకుంటున్నారు.

జనసేనలోకి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు రానందువల్ల వచ్చే నష్టం లేదు. అంతా కొత్తగా ఉండాలని భావిస్తున్నపుడు పాత చీర ముక్కలు తెచ్చి అతుకు పెట్టడంలో అర్థం లేదు. యువకులకు పెద్దపీట వేస్తారు. ఇది యువ భారతం. పాత చింతకాయ పచ్చడి లేనందువల్ల యువతకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అందువల్ల ప్రజా ప్రతినిధులు ఎవరు అన్న ప్రాతిపదిక ఈ ఎన్నికల్లో ఉండదు. బరిలో ఉన్నది ముగ్గురు… పవన్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఎవరు సీఎంగా చక్కటి అభివృద్ధిని ఇవ్వగలరు అన్నదే ప్రజలు చూడబోతున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా… ప్రజల మొహాన చిల్లర కొట్టి… కోట్లు జేబుల్లో కుక్కుకోవాలన్న కుహనా పార్టీలను ప్రజలు ఈ సారి అధికారానికి దూరంగా ఉంచుతారనడంలో సందేహం లేదు.

 మొన్న తెలంగాణ ఎన్నికల్లో అదే జరిగింది. కేసీఆర్ ను దమ్ముంటే చూసుకుందాం రా అంటూ సవాలు చేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఎక్కడ నిలిచారు? ఇది ఎవరూ ఊహించనిది కదా. సెఫాలజిస్టులుగానీ, రాజకీయ పార్టీలుగానీ, జర్నలిస్టులు గానీ ఊహించనిది. ఆఖరికి రేవంత్ కూడా. ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోకుండా… తెలుగుదేశానికి ఓటు బ్యాంకు ఉంది… 2 వేల రూపాయల పించను ఇస్తున్నాడు… 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అన్న గిమ్మిక్కులు పని చేయవన్నది అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఇవన్నీ పని చేశాయి. ఇప్పుడు కాదు. కాలం మారింది మైనరో.. అన్న పాత పాట గుర్తుకురావడం లేదా మీకింకా?

సరే, ఇవ్వాళ కాదు కానీ, రేపు మాత్రం ఇది సెఫాలజిస్టులకూ, అలాగే పాత తరం వృద్ధ రాజకీయ నాయకులకూ అనుభవంలోకి వస్తుంది. అప్పటి వరకూ జనసేన 0.5 శాతం ఓట్లతోనే ఉందని రాసుకోండి. చెప్పుకోండి… సర్వేలు నిర్వహించుకోండి. 175 సీట్లూ మీ లెక్కలోనే వేసుకోండి. మ్యాన్ డేట్ ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ తరం యువత నిర్ణయిస్తుంది.

ఈ తరం ప్రజల్ని, ముఖ్యంగా యువతను ఏమార్చడం పాత పద్ధతులకు వేలాడుతూ డబ్బులు వెదజల్లుతూ మనదే అధికారం అనుకుంటే రేపు లెక్క తప్పడం… లెంపలేసుకోవడం ఖాయం!!

Other Articles

4 Comments

  1. Sir, small suggestion please limit your articles little smaller which will make readers to get content very quickly as reading in mobile is little painfull

  2. Hey, you used to write magnificent, but the last several posts have been kinda boring… I miss your super writings. Past several posts are just a little bit out of track! come on!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *