మీ బిడ్డల భవిష్యత్తు కోసమే జనసేన: పవన్

December 5, 2018 | News Of 9
 Janasena working for your children’s future: Pawan | Newsof9
  •  ఏపీలో ‘‘జనసేన తరంగం’’ ప్రారంభం
  •  కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షుడు
హైదరాబాదు: హఠాత్తుగా పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వచ్చేసినా రావచ్చు. మార్తాడు గ్రామంలోని ఒక వ్యవసాయ కూలీ ఇంటికి వెళ్లిపోయారు. అతని పేరు జీలకర్ర ముత్యాలప్ప. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలప్ప కుటుంబ సభ్యులు పవన్ చూడగానే ఆశ్చర్యపోయారు. జనసేన కొత్తగా తెస్తున్న ‘జనసేన తరంగం’ అనే కార్యక్రమ ప్రారంభ సూచకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సింగనమల నియోజిక వర్గంలోని మార్తాడు గ్రామానికి వెళ్లారు. ఓట్లు అడగడానికి మీ దగ్గరకు రాలేదని, కేవలం మీ బిడ్డల భవిష్యత్తు కోసమే ఇక్కడకు వచ్చామని పవన్ వివరించారు. ఇంట్లోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ను కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. పవన్ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు అర్థ రూపాయి ఇచ్చే రోజుల నుంచీ తాను వ్యవసాయ కూలీగా పని చేస్తున్నానని ముత్యాలప్ప చెప్పారు. అప్పటి నుంచీ తమ బతుకుల్లో ఎలాంటి మార్పులూ లేవని చెప్పారు. తనకు 62 సంవత్సరాలు వచ్చినా, ఇంకా పింఛను రావడంలేదని అన్నారు. ఇంత వయసు వచ్చినా ఇంకా ఎంత కాలం కష్టపడాలి… వ్యవస్థ మారాలి అని పవన్ అన్నారు. జనసేన ప్రజలకు ఏమేం చేయబోతున్నదీ ముత్యాలప్ప కుటుంబ సభ్యులకు వివరించారు. పార్టీ సిద్ధాంతాలు వారికి నచ్చడంతో వారి నుంచి మిస్డ్ కాల్ చేయించారు. జనసేన కార్యకర్తలందరూ ఇదే విధంగా చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు కూడా లైవ్ లో సందేశం పంపారు. ఇదంతా ఫేస్ బుక్ లో లైవ్ లో చూపించారు.
అనంతరం దీవె కృష్ణమూర్తి ఇంటికి కూడా వెళ్లి తరంగం కార్యక్రమాన్ని పూర్తి చేశారు.  అనంతరం సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె పొలాల్లో పని చేస్తున్న రైతులను పవన్ పలకరించారు. రైతులకు ఎలాంటి సమస్యలూ లేకుండా జనసేన ప్రభుత్వం అన్ని సౌకర్యాలనూ కల్పిస్తుందని చెప్పారు. ఏపీ మొత్తంలో 5 రోజులపాటు ఈ జనసేన తరంగం కొనసాగుతుంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *