వైసీపీ నాయకులకు మొహం వాచేలా పడ్డాయి..

November 3, 2019 | News Of 9

విజయవంతంగా లాంగ్ మార్చ్
ప్రభుత్వానికి రెండు వారాల గడువు

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి నష్టపరిహారం ప్రకటించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి రెండు వారాలు గడువిచ్చారు.

తాను చెప్పిన షరతులను అమలు చేయని పక్షంలో అమరావతి వీధుల్లో నడిచి నిరసన తెలుపుతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈరోజు విశాఖపట్నంలో జరిపిన లాంగ్ మార్చ్ లో పాల్గొని ఆయన ప్రసంగించారు. పందొమ్మిది లక్షల మంది రిజిస్టర్ కార్మికులే కాక ఎన్నో లక్షల మంది ఉపాధి లేకుండా పోయారని గుర్తుచేశారు. ఇంతమందిని ఇబ్బంది పెడుతూ ఇన్నిరోజులుగా ఇసుక విధానాన్ని ప్రకటించకుండా ఎలా ఉంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇన్ని నెలలు పని లేకుండా చేసినందుకు ప్రతి కార్మికుడికీ 50 వేల రూపాయల నష్టపరిహరాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఇసుక సమస్య వల్ల ఇప్పటి వరకు చనిపోయిన 35 మంది కార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించాలన్నారు. తమ నిరసనకు మద్దతు ప్రకటించిన బీజేపీ, సీపీఐ, సీపీఎం, లోక్సత్తా, బీఎస్పీ, తెలుగుదేశం పార్టీలకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.

తాను సమస్యలపై మాట్లాడుతుంటే తనపై పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారని వైసీపీ నాయకులను విమర్శించారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డిని, అంబటి రాంబాబును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే విజయసాయిరెడ్డి కూడా నన్ను విమర్శిస్తున్నాడని అన్నారు. ఎందరో మహామహులు కూర్చున్న రాజ్యసభలో విజయసాయి లాంటి సూట్ కేసు కంపెనీలు పెట్టి. ఆర్థిక నేరాలు చేసిన ఆరోపణలతో కోర్టు చుట్టూ తిరుగుతున్న అతనికి తనను విమర్శించే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. తన డిఎన్ఏ గురించి మాట్లాడిన అంబటి రాంబాబు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తన డిఎన్ఏ గురించి విమర్శించే రాంబాబు తన ఇంటి పెళ్లికి ఎందుకు పిలిచాడని అడిగారు. అప్పటికి భయంతో పిలిచారనీ, ఇప్పుడు151 సీట్లు వచ్చాయని కళ్ళు నెత్తికెక్కాయా అని సూటిగా ప్రశ్నించారు. నిజంగా మీకు ప్రజలు అన్ని సీట్లు ఇస్తే జాగ్రత్తగా పాలన చేసి ఉపయోగపడాలని సూచించారు. అలా కాని పక్షంలో ఆ ప్రజలే గద్దె దించి చూపిస్తారన్నారు. ఈ సభ జరుగుతున్న సమయంలో విద్యుత్ ప్రమాదం పాల్పడ్డ 16 యేళ్ళ యువకుడి గురించి ఆయన తన విచారాన్ని వ్యక్తం చేశారు.

Other Articles

2,564 Comments

  1. The sharing forum I have read, the content is very practical, it gives me a lot of useful information, I like the content of your article very well. I hope you will have many new posts to share with readers.

  2. Somebody essentially assist to make severely articles I might state.
    That is the first time I frequented your web page and up to now?

    I amazed with the research you made to create this actual publish amazing.
    Magnificent job!