5వ తేదీ నుంచి జనసేన తరంగం!

December 4, 2018 | News Of 9

హైదరాబాద్: జనసేన పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడానికి వీలుగా పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం పేరు జనసేన తరంగం. దేశాభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో యువతను భాగం చేయడమే జనసేన తరంగం ముఖ్యోద్దేశమని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమంలో ఈ రోజు తెలిపారు. యువత, పార్టీ కార్యకర్తలూ పార్టీ మేనిఫెస్టో తీసుకుని ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం తమ తమ ప్రాంతాల్లో పని చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన వారిని గుర్తిస్తున్నారు. వీరంతా పార్టీ ఆఫీసుతో సమన్వయం చేసుకుంటూ… పార్టీ ప్రచారం చేస్తారు. జనసేన తరంగంలో పని చేసే వారితో ఫోన్ చేసి పవన్ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *