లక్నోలో పొద్దు పొడిచిన జనసేన-బీఎస్పీ పొత్తు

March 15, 2019 | News Of 9

 

JanSena- BSP forms Alliance for 2019 elections

లక్నోలో పొద్దు పొడిచిన జనసేన-బీఎస్పీ పొత్తు

  • మాయాను పీఎంగా చూడాలనుకుంటున్నాం: పవన్
  • ఏపీ సీఎంగా పవన్ ను చూద్దామన్న మాయవతి
  • గాజువాక నుంచే పవన్ కళ్యాణ్ పోటీ

(న్యూస్ ఆప్ 9)

‘‘బీఎస్సీ అధినేత మాయవతిని ప్రధానిగా చూడాలని మేం బలంగా కోరుకుంటున్నాం’’ –  పవన్ కళ్యాణ్

‘‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం’’- మాయావతి

2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు పెనువేగంతో మారిపోతున్నాయి. జనసేన-బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కలిసి పని చేస్తున్నట్లు బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి ప్రకటించారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘సోదరి మాయవతిని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నాం. ఇది మా బలమైన కోరిక’’ అని అన్నారు. తమ శక్తి మేరకు బీఎస్సీకి మద్దతునీ, తోడ్పాటునీ అందిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఆకాంక్షిస్తున్నదని మాయావతి స్పందించారు. శుక్రవారం నాడే… రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. అంతకు ముందు రోజే నలుగురు లోక్ సభ అభ్యర్ధుల్నీ, 32 మంది అసెంబ్లీ అభ్యర్ధుల్నీ జనసేన పార్టీ ప్రకటించింది.

పవన్ కళ్యాణ్… విశాఖపట్నంలోని గాజువాక నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ముందు అనుకున్నట్లుగా అనంతపురం నుంచి ఆయన పోటీ చేయడంలేదు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *