జనసేన మేనిఫోస్టో పూర్తి పాఠం

March 14, 2019 | News Of 9

pawan kalyan election manifesto | telugu.newsof9.com

AGRICULTURE

 1. రైతు రక్షణ భరోసా: 60 సం. వయస్సు పైబడిన సన్నకారు, చిన్నకారు మరియు కౌలుదారులకు నెలకు రూ. 5000 పెన్షను.
 2. రైతే రాజు: రైతులను సంపన్నులను చేయుటకు ప్రభుత్వ సహాయంతో opportunity zones ఏర్పాటు చేసి వాటిలో రైతులను భాగస్వాములను చేయడం.
 3. ఉభయ గోదావరి జిల్లాలలో రూ. 5000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి, ఆహార ధాన్యాల మరియు పండ్ల, వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రతి మండలం లోను గిడ్డంగులు, శీతలీకరణ నిల్వ యూనిట్లు, వ్యవసాయ ఆహార తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబడును.
 4. రైతులకు ఉచిత solar motors.
 5. Prakasam జిల్లా నీటిపారుదల మరియు త్రాగునీటి సదుపాయం కొరకు వెలుగొండ PROJECT నిర్మించబడును. రాయలసీమను సౌభాగ్యవంతం చేయుటకు అధునాతన వ్యవసాయక పద్ధతులను ప్రవేశపెట్టుట. మరియు ఉత్తరాంధ్రను సుభిక్షంగా తయారు చేయుటకు నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లు నిర్మించుట.

EDUCATION

 1. ఒకటవ తరగతి నుండి పీజీ కోర్సు వరకు ఉచిత విద్య, ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించబడును మరియు ప్రభుత్వ కళాశాలలలొ విద్యార్థులకు ఉచిత క్యాంటిన్లు ఏర్పాటు చేయబడును మరియు జూనియర్ కళాశాల స్థాయి నుండీ విద్యార్థులకు ఉచిత laptop.
 2. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ,  Agricultural కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయబడును.
 3. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫీజు వసూలు మరియు అన్ని సామాజిక వర్గాల విద్యార్థినీ, విద్యార్థులకు సర్వ సమత్వ వసతి గృహాలు ఏర్పాటు చేయబడును.
 4. అన్ని వృత్తి పర కళాశాలల్లో Innovation  Hubs and Incubation Centres ఏర్పాటు.

HEALTH

 1. బడ్జెట్ పెంపు మరియు రూ. 10,00,000 వరకు అందరికి ఉచిత ఆరోగ్య భీమా కల్పించబడును. దశల వారీగా Primary health centres ౩౦ పడకల hospitals గా  మార్చబడును. ప్రతి మండలానికి mobile diagnostic clinics ఏర్పాటు చేయబడును.

EMPLOYMENT

 1. APPSC calendar అమలు చేయబడును, ఖాళీగా ఉన్న BACKLOG మరియు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన ఆరునెలల్లో భర్తీ చేయబడును.
 2. రూ. 10000 కోట్ల రూపాయల నిధితో నూతన పారిశ్రామిక వేత్తలకు సహాయం కొరకు వెంచర్ కాపిటల్ ఫండ్.  ప్రతి సంవత్సరం యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించబడును.
 3. చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ఆర్ధిక సదుపాయం చేయబడును. విదేశీ పెట్టుబడులతో ప్రతి పరిశ్రమకు తగిన స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయబడును.

WOMEN

 1. మహిళలకు రాష్ట్ర అసెంబ్లీలో ౩౩% రిజర్వేషన్ కల్పించబడును. మరియు పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లో స్వయం ఉపాధి సంఘాల మహిళలకు  కల్పించబడును.
 2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలండర్, ప్రతి సంక్రాంతికి ఆడపడుచులకు చీరల పంపిణి మరియు రేషన్ కి బదులుగా మహిళల ఖాతాల్లో రూ. 2500 నుండి 3500 వరకు నగదు జమ.
 3. ప్రతి జిల్లాలో ఒక మహిళా బ్యాంకు స్థాపన మరియు ప్రతి జిల్లాకి మహిళా ఆరోగ్య స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం.
 4. ప్రతి మండలానికి ఒక కల్యాణ మండపం నిర్మాణం. మహిళా ఉద్యోగినుల సౌకర్యార్ధం CRECHE ల ఏర్పాటు, చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ ఏర్పాటు చేయబడును.

DEVELOPMENT

 1. అవకాశాన్ని బట్టి బీసీ లకు 5% రిజర్వేషన్లు  మరియు రాజకీయ రిజర్వేషన్లు కల్పించబడును.
 2. కాపులకు 9 వ షెడ్యూలు ద్వారా రిజర్వేషన్లు కల్పించబడును.
 3. SC వర్గీకరణకు సామరస్య పరిష్కారం.
 4. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ సిఫారసులను  అమలు చేయబడును.

OLD AGE

 1. ప్రభుత్వ ఉద్యోగులకు CPS విధానం రద్దు.
 2. వృద్ధులను ఆదుకొనుటకు ప్రభుత్వ వృద్ధాశ్రమములను ప్రతి మండలంలోనూ నడుపబడును.

WELFARE

 1. ప్రభుత్వ సంస్థలలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయబడును.
 2. అర్ధరూపాయి వడ్డీతో బంగారు నగల తాకట్టు రుణాలు మంజూరు చేయబడును, ఆ రుణాన్ని ఒక సంవత్సరం లోపు అసలు + వడ్డీతో కలిపి చెల్లించే వారికి వడ్డీని పావలా వడ్డీగా తగ్గించబడును.
 3. చిరు వ్యాపారులకు ఏవిధమయిన పూచి లేకుండా రూ. 5000 వరకు పావలా వడ్డీ రుణ సదుపాయం చేయబడును.
 4. బహుళ అంతస్థుల అపార్టుమెంటులను నిర్మించి ప్రతి కుటుంబానికి గృహాన్ని ఉచితంగా ఇవ్వబడును.

FISHERIES

 1. Ministry of Fisheries And Fisheries Development Bank స్థాపన, పశు  సంవర్ధన, పాడి పరిశ్రమాభివుద్ది, మత్స్య పరిశ్రమలకు అధిక importance ఇవ్వబడును. మత్స్యకారుల సంక్షేమం మరియు మత్స్య పరిశ్రమాభివృద్ధి తోడ్పాటు కల్పించబడును.
 2. ౩౦౦ రోజుల ఉపాధి కల్పన, break period మరియు తుఫానుల హెచ్చరిక సమయంలో చేపల వేటకు వెళ్లలేని సమయంలో రోజుకు రూ. 500 ఆర్ధిక సదుపాయం కల్పించబడును. అన్ని మత్స్యకారుల గ్రామాలకు రెండు సం. లోపు సురక్షిత మంచి నీటి సరఫరా చేయబడును. Fishing Jetties – Harbours ను నిర్మించి పర్యాటక ప్రోత్సాహం ద్వారా వేల సంఖ్య లో ఉద్యోగావకాశాలు కల్పించుట.

FOR RELLIS

 1. రెల్లి యువత స్వయం ఉపాధి కొరకు రూ. 50000  వేల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించబడును.
 2. రెల్లి కార్మికులకు ఆటో రిక్షా కొనుగోలు కొరకు 50% సబ్సిడీ పే రుణ సదుపాయం. మరియు ప్రైవేటు సంస్థలలో పని చేయుచున్న రెల్లి వనితలకు ఉచిత స్కూటరు. ఉచిత గృహ సదుపాయం.

LOCAL GOVERNMENTS

 1. గ్రామీణాభివృద్ధికి డా అబ్దుల్ కలం ఆశయమైన పుర స్కీమ్స్ అమలు చేయబడును. గ్రామాలూ అన్నింటిలో నగర వసతులు కల్పించబడును. ప్రతి 5 సం. కు స్థానిక సంస్థ లకు ఎన్నికలు మరియు 73 , 74 రాజ్యాంగ సవరణల అమలు.

 

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *