జయ ఆస్పత్రి బిల్లు రూ.6.85 కోట్లు!

December 19, 2018 | News Of 9

Jayalalitha’s hospital bill Rs.6.85 Cr | News of 9

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి బిల్లు ఎంత అయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా రూ.6.85 కోట్లట. అదీ 75 రోజులకు అపోలో ఆస్పత్రిలో అయిన బిల్లు. విషయం విన్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ బిల్లులో ఇంకా రూ.44.56 లక్షలు బాకీ ఉంది. 2016 అక్టోబరు 13న 41.13 లక్షలు చెల్లించినట్లు రికార్డుల్లో ఉందికానీ ఎవరు చెల్లించారన్నది లేదని సమాచారం. మొత్తం ఖర్చుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి వర్గాలు మొన్న నవంబరులో జయలలిత మరణంపై నియమించిన విచారణ కమిషన్ కు వివరాలను అందించాయి. బిల్లు వివరాలు 200 పేజీల్లో ఉంది. జయలలితను పరామర్శించడానికి వచ్చిన వారైతేనేమీ ఇతరత్రా ఆహార ఖర్చుల కింద రూ.1.17 కోట్లను చూపించారు. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు రూ.71 లక్షలుగా ఉంది. బ్రిటన్ వైద్యుడు రిచర్డ్ బాలే కి రూ.92 లక్షలు చెల్లించారు. సింగపూర్ ఆస్పత్రికి రూ.1.29 కోట్లు చెల్లించారు. అపోలో ఆస్పత్రిలో గదుల అద్దెగా రూ.1.24 కోట్లు చూపించారు. జయలలిత డిసెంబరు 5, 2016వ తేదీన చనిపోయారు. సెప్టెంబరు 22, 2016 నుంచి 75 రోజులపాటు ఆమెకు చికిత్సను అందించారు. జయలలితను ఆస్పత్రిలో చేర్చడానికి దారితీసిన పరిస్థితులపై తమిళనాడు ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *