తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన – బీఎస్పీ క‌లిసి పోటీ

March 15, 2019 | News Of 9

  • ఎప్రిల్ 3, 4 తేదీల్లో సంయుక్తంగా ఎన్నికల ప్రచారం
  • కలిసే పోటీ చేస్తామన్న మాయావతి
  • చర్చలు సఫలం అన్న ఇద్దరు నేతలు

తెలుగు రాష్ట్రాల్లో క‌లిసి పోటీ చేయాల‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ , బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్య‌క్షురాలు మాయ‌వ‌తి నిర్ణ‌యించారు. ల‌క్నోలో శుక్ర‌వారం ఉద‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాయ‌వ‌తి గారిని క‌లిసి సుదీర్ఘంగా చ‌ర్చించారు. రెండున్న‌ర గంట‌లపాటు సాగిన ఈ చ‌ర్చ‌ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కావాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని మాయ‌వ‌తి ఆశాభావం వ్య‌క్తం చేశారు. ”ఆంధప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొత్తవారు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం” అని మాయావతి చెప్పారు. పూర్తి స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణంలో ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి. బీఎస్పీ ఏయే స్థానాల నుంచి పోటీ చేసేది రెండు, మూడు రోజుల్లో వెల్ల‌డిస్తారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో మాయ‌వ‌తి , ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీలు సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల స‌భ‌ల్లో పాల్గొంటారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ మాయ‌వ‌తి క‌ష్టించి పైకొచ్చిన నేత అన్నారు. ఆమెకు ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు తెలుసు అన్నారు. సోద‌రి స‌మానురాలైన మాయ‌వ‌తిని మ‌న దేశానికి ప్ర‌ధానమంత్రిగా చూడాల‌ని నా దృఢ‌మైన కోరిక అన్నారు. ఆమె తప్పక ప్ర‌ధాన‌మంత్రి అవుతారని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆకాంక్షించారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *