70 ఏళ్ల ఆధిపత్యంపై గొడ్డలి దెబ్బ- జనసేన!!

January 25, 2019 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

  • ఆ వెలుగులో ‘చీడ’ పోతుంది… చీకటీ పోతుంది!!

చంద్రబాబు, జగన్మోహన రెడ్డి, పవన్ కళ్యాణ్… ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అని ఆలోచన చేసే ముందు ఆలోచించుకోవాల్సిన పాయింటు ఒకటి తెలుగు రాష్ట్రాల్లో కేవలం పుకార్లను వార్తలుగా వడ్డిస్తున్న పేర‘సైట్లు’ (పరాన్నజీవులుగా కుళ్లిన కళేబరాలపై బతికే వెబ్ సైట్లు) మరిచిపోయాయి. గత 70 సంవత్సరాలుగా కేవలం పెట్టుబడిదారీ వర్గాలే రాజకీయ పీఠాన్ని పట్టుకుని బంక పేనులా వదలడం లేదు. జనాభాలో తక్కువ శాతంగా ఉన్నా.. డబ్బులు ఎక్కువై కొట్టుకుంటున్న ఆధిపత్య, పెట్టుబడిదారీ వర్గాలు స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా రాజకీయ అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. పించన్లనీ, మరొకటి అనీ… బహుజనులకు బిస్కెట్లు వేస్తూ… వారు మాత్రం భూములనూ, గనులనూ, ప్రజాధనాన్నీ మింగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవునో కాదో? గత 70 ఏళ్లుగా బహుజనుల్లో, దళిత నిమ్నవర్గాల్లో అణగారిన రాజకీయ ఆకాంక్షలకు పవన్ కళ్యాణ్ ఒక ప్రతీక. జనసేన వారి ఆశల జండా.

‘‘ఇప్పుడు జనసేన విషయానికొస్తే, ప్రజారాజ్యం పార్టీ స్థాయిలో కాకపోయినా, కాస్తో కూస్తో ఓటు బ్యాంకు అయితే సొంతం చేసుకునే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించారు కదా…మే నెల వరకూ ఆగండి.. బడుగు బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది ఈ రాజకీయ అధికారాన్ని అందుకుంటారో లేక… ఇంకా 10 శాతంగా ఉన్న పెట్టుబడిదారీ శక్తులే అధికార పీఠాన్ని దక్కించుకుంటాయో తెలుస్తుంది. సోషల్ మీడియాలో చూడండి. బయటకు వెళ్లి చూడండి. సీ ఓటరు గుర్తిస్తే ఎంత? గుర్తించకపోతే ఎంత? సీఎం కుర్చీ కోసం 70 ఏళ్ల చరిత్రకు ప్రతినిధులుగా ఇద్దరే ఇద్దరు గోముఖ వ్యాఘ్రాలుగా గోదాలో దిగి కొట్టుకుంటున్నారు. ప్రజలు ఇవ్వాళ కాకపోతే రేపైనా కళ్లు తెరుస్తారు. ప్రజా సంకల్ప ఫలాన్ని 2019 ఎన్నికలు – దోపిడీదారుల పరం చేస్తాయో.. లేక 90 శాతంగా ఉన్న బహుజనులకు ఇస్తాయో వేచి చూద్దాం.

ఒకనాడు యల్లో మీడియా తప్ప దిక్కు లేదు. ఇపుడు సోషల్ మీడియా ఒక సునామీ. ఎన్నికల పుణ్యమా అని అది తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తోంది. నిజాలు ఇపుడు ఈనాటి యువతకు చక్కగా తెలుసు. ఇక వారెంత మాత్రం మోసపోయే అవకాశం లేదు. పెట్టుబడిదారీ సామాజిక వర్గాల దాష్టీకం ఇలాగే కొనసాగితే.. బహుజనుల్లో విప్లవం రావడం తథ్యం. పించన్లు ఇస్తాం… అవి ఇస్తాం… ఇవి ఇస్తాం అన్న రాజకీయ నాయకులను ప్రజలు వెంటపడి మరీ కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు. మీరు ఫ్యాను కింద కూర్చుని మాంసం తింటూ… తినేసిన ఎముకల్ని ప్రజలకు ఎంతకాలం పారేస్తారో మీరే ఆలోచించుకోవాలి. విప్లవం కంటికి కనిపించదు. మనసుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఓకేసారి కంటికి కనిపించదు.

తిండిలేక, ఉద్యోగాలు లేక, పిల్లల్ని చదివించుకునే దారిలేక 90 శాతం సామాజిక వర్గాలు పేదరికంలో పడి కొట్టుమిట్టాడుతున్నాయి. పేదల ఆక్రోశం, పేదల ఆగ్రహం ఊరికోపోదు. ఒక రోజు అది అక్రమ సంపాదనతో కట్టుకున్న భవంతుల్ని దహిస్తుంది. అందరినీ తొక్కేయాలన్న మీ ధోరణిని ప్రజాగ్రహం దహిస్తుంది. వారి ఆగ్రహానికీ, వారి ఆక్రోశానికీ, వారి కన్నీళ్లకు ప్రతీక పవన్ కళ్యాణ్.

అడ్డంగా దోచుకుంటున్న పందికొక్కుల పాలిట పేలుతున్న తూటా.. పవన్ కళ్యాణ్.

పాదయాత్రలు చేస్తే… తలకు 300 రూపాయలు ఇచ్చే స్తోమత బలహీన వర్గాలకు లేదు. మీరు ఇస్తారు. వాహనాలను పెట్టి జనాలను తరలిస్తారు. మీ దృష్టిలో మనుషులంటే బానిసలు. మీ దృష్టిలో బడుగు వర్గాలు మీకు ఓట్లు వేసే యంత్రాలు.

ప్రజలు కారం మెతుకులు తింటుంటే… మీరు బెంజికార్లలో తిరగండి.

ఉల్లిగడ్డ, మిరపకాయ నంచుకుని గంజి మెతుకులు తినేవారి కష్టాలు… అద్దాల మేడల్లో ఉండేవారికి ఎన్నటికి అర్థంకావాలి? మీకు పత్రికలు ఉంటాయి… టీవీలు ఉంటాయి… మీ గురించి మీరే రాసుకోండి. మీ గురించి మీరే ప్రభలు కట్టించుకుని ఊరేగండి. జేజేలు కొట్టించుకోండి. ‘‘పేద వాడి జీవితంలో కూడా ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ‘‘మోజెస్’’ లా ఒకడు వస్తాడు. బానిస సంకెళ్లు తెంచుతాడు. రెండో స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంది’’ అని పేద వర్గాలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఇన్నాళ్లూ ఎదురు చూశారు. ఆ రోజు వచ్చింది. ఆ కల నెరవేరుతుంది. కొన్ని వేల మంది కోరుకుంటే పైన తథాస్తు దేవతలు ఉంటారు.

జనసేనను రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించారు. అయినా మీరు చెప్పింది నిజమే. జనసేనను సర్వేలు రాజకీయ పార్టీగా గుర్తించలేదన్నమాట వాస్తవమే. జనసేన రాజకీయ పార్టీ కంటే మించింది. ఉద్యమ పార్టీ. ఫక్తు రాజకీయ పార్టీగా జనసేన నడిచేట్లే అయితే… డబ్బు ఎక్కువై కొట్టుకుంటున్న ఖద్దర్లు ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరే వారే కదా. గేట్లు తెరిస్తే వచ్చేందుకు జనసేన గేటు దగ్గర ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే.. ఎవుడు వచ్చినా కండవాలు అక్కడ కప్పడానికి సిద్ధంగా లేరని మీరు నేతల్ని అడిగితే తెలుస్తుంది. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన రాధాని అడగండి. వాస్తవం తెలుస్తుంది. 70 ఏళ్ల అణచివేతపై పడుతున్న తొలి గొడ్డలి దెబ్బ- జనసేన. ఈ గొడ్డలి దెబ్బలో… సర్వేలు ఉండవు. పత్రికలు ఉండవు. పార‘సైట్లు’ అంతకంటే ఉండవు. ప్రాణ భయంతో పరుగులు తీసే వాడి కళ్లకు సునామీ ఏం కనిపిస్తుంది?

చంద్రబాబులా… మీరు కూడా కలలు కనండి. జనసేన పెను తుపాను. కుళ్లిపోయిన రాజకీయాలే ఇన్నాళ్లూ మీరు చూశారు. ఇక సరికొత్త రాజకీయాన్ని మీరు చూడబోతున్నారు. మార్పు సునామీగా వచ్చినపుడు… అక్కడ ఎవడూ కనిపించడు. టీడీపీ ఉండదు. వైసీపీ ఉండదు. ఓటు బ్యాంకు ఉందని ఎవరు ఊహించగలరు? క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకుని పాస్టర్లు ఓట్లు తెస్తారని అనుకోవడం ఓటు బ్యాంకు. జనసేనకు ఓటు బ్యాంకులు లేవు. బ్యాంకుల్లో మీకున్నట్లు కొట్టుకొచ్చిన కోట్లు లేవు. ప్రజల గుండెల్లో జనసేన ఉంటుంది.

ఆకలితో మాడుతున్న పేదల ఆగ్రహావేశాలే జనసేన. జనసేన సోదిలో లేకుండా పోతుందో… లేక మీరు సోది చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందో మే నెలలో చూద్దాం.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *