ఈ సారి బయట నుంచే ‘కట్టప్ప’?
November 27, 2018 | News Of 9
ప్రజారాజ్యం తరహా కుట్ర
ఈ సారి బయట నుంచే ‘కట్టప్ప’?
డియర్ రీడర్స్…
కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
2019 ఎన్నికలు…
సురాసుర సమరానికి సమయం ఆసన్నమైంది
ఊపిరి బిగబట్టి మరీ ఈ స్టోరీ చదవండి.
అమరావతి ఇక యుద్ధ భూమి
రెండే రెండు పక్షాలు
ఒక వైపు ప్రజాధనాన్ని దోచుకుంటున్న పెట్టుబడిదారులు
మరో వైపు దోపిడీకి గురైన కార్మిక కర్షక అభాగ్యులు.
ఒకవైపు రాక్షసులు.. మరో వైపు దేవతలు
ఒకవైపు కౌరవులు.. మరోవైపు పాండవులు
పోలిక ఎలాగ చెప్పినా…
బెజవాడ కనక దుర్గమ్మ సాక్షిగా..
ధర్మానికీ, అధర్మానికీ మధ్య పోరాటం.
(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేక కథనం)
అమరావతి అంటే అమరులు అంటే దేవతలు ఉండే ప్రాంతం అని అర్థం. కానీ ఇపుడు అక్కడ దేవతలు లేరు. రాక్షసులు ఉన్నారు. అమరావతిని అబలను చేసి దుర్గమ్మ సాక్షిగా చెర పట్టారు. ఇసుక దగ్గర నుంచి ప్రకృతి వనరులన్నింటినీ దోచుకుంటున్నారు. కొండల్ని సైతం మింగేసి డబ్బులుగా మార్చేసుకుంటున్నారు. అడ్డం వచ్చిన వారిని తన్నుతున్నారు. అదేమని అడిగిన వారిని తోలు వలిచి బెంజి సర్కిల్లో వదిలేస్తున్నారు. తీసుకున్న అప్పులు కట్టేసినా ఆడవాళ్లను చీరలు లాగేయబోతున్నారు. నగరం నడిబొడ్డున అబలల్ని రోడ్ల మీదకు లాగినా రక్షక భటులు రక్షణ కల్పించలేని నిస్సహాయులుగా ఠాణాలు వదిలి బయటకు రావడం మానుకున్నారు. భూముల్ని సైతం బలవంతంగా రాయించుకుంటున్నారు. భూములు… ప్రభుత్వానివైతే ఏమిటి, ప్రైవేటు వైతే ఏమిటి అంటూ అడ్డం వచ్చినట్లు లాగేసుకుంటున్నారు. కృష్ణానది పాయల్లో ఉన్న భూముల్నీ మింగేశారు. హైదరాబాద్ లో అవకాశంలేని పెట్టుబడిదారులంతా అమరావతిలో కాలుపెట్టారు. బిదాబిక్కీ జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. వీరి ధాటికి చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లుగా పారిపోయారు. బాధితుల తరఫున మాట్లాడేవారు లేరు. పోలీసులూ వాళ్లే… దొంగలూ వాళ్లే…. వాళ్లు చెప్పిందే తీర్పు. వాళ్లు రాసిందే వార్త. వాళ్లు మాటే శాసనం. బెజవాడ కనకదుర్గమ్మ కూడా భయంతో వణికిపోతూ కృష్ణమ్మవైపు జాలిగా చూస్తోంది. వారు వచ్చిన తర్వాత కృష్ణవేణీ తల్లి సైతం లొంగిపోయి వారికి సలాము చేసింది.
సరిగ్గా.. అదే సమయంలో ఒంటరిగా ఓ వీరుడు వచ్చాడు. జనసేన అంటూ పార్టీ పెట్టాడు. ప్రజల్ని చెరబట్టిన కీచకుల తాట తీస్తానంటూ వచ్చాడు. బడుగు బలహీన వర్గాలు అతనివైపు నిలిచాయి. మేమున్నామంటూ అతని వెనక పరుగులు తీస్తున్నారు యువకులు. అతని పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు జన సేనాని. జనమే అతని సైన్యం అయ్యారు. జన సైనికులుగా మారారు. విప్లవ శంఖం పూరించాడు. అవినీతి పరులను సవాలు చేస్తున్నాడు. దీవార్ సినిమా గుర్తుకు ఉందా? ‘మా దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి. ప్రాపర్టీలు ఉన్నాయి. కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. వాహనాలున్నాయి. నీ దగ్గర ఏముంది?’ అని తన తమ్ముడైన పోలీస్ ఆఫీసర్ శశికపూర్‌ను అమితాబ్ ప్రశ్నిస్తాడు. శశికపూర్ చాలా కూల్‌గా…అంతే గంభీరంగా… ‘మేరీ పాస్ మా హై‘ (నా దగ్గర అమ్మ ఉంది) అంటాడు. పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు. ‘‘అమ్మ ఆశీర్వదించి పంపింది. నాలుగు లక్షల డబ్బులు కూడా ఇచ్చింది’’ అని చెప్పాడు. అవినీతిపరుల పేర్లు చెప్పి మరీ తోలు తీస్తానంటున్నాడు. ఆకలితో, సగం జీవితం అర్థాకలితో ఇన్నాళ్లూ కన్నీళ్లతోనే కడుపు నింపుకున్న బడుగు దళిత వర్గాలన్నీ ఒక వైపునకు చేరుతున్నాయి. ఇపుడు జనసేనాని మాట వారికి వేదవాక్కు. జన సైనికులు కదన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతానంటే.. 70 ఏళ్లుగా అధికారం రుచి మరిగిన వారు ఊరుకుంటారా? పోనీలే ప్రజలు ఓట్లు వేస్తానంటున్నారు మనం ఏం చేస్తాం అని సర్దిపెపెట్టుకుంటారా? తొక్కి నార తీస్తారు. చీకటి ఒప్పందాలకు తెర తీస్తారు. ఇప్పుడే సరిగ్గా ఇదే జరుగుతోందనడానికి అనేక మార్పులు మనకు కనిపిస్తున్నాయి.
కౌరవ శిబిరంలో ఏం జరుగుతోంది?
పెట్టుబడిదారులు భయంతో వణుకుతున్నారు. ఇప్పటి వరకూ యథేచ్చగా దోచుకున్నామనీ, ఇక ఈ క్రతువు సాగదేమోనని వారు భయపడుతున్నారు. పవన్ తనకు ఎదరులేదన్నట్లుగా ఒంటరిగా దూసుకుపోతున్నాడు. చంద్రబాబు వృద్ధాప్యం వల్లగానీ, సొంత సామాజిక వర్గం అవినీతి, అక్రమాల వల్లగానీ తెలుగుదేశం పార్టీ జనం దృష్టిలో పలచన అయింది. లోకేష్ కూడా ఆధారపడదగిన వ్యక్తిగా ఆ సామాజిక వర్గం పెద్దలకు కనిపించడం లేదు. పవన్ ను అంతే ధీటుగా.. అడ్డుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని పెద్దలు వెదుకుతున్నారు. ప్రజారాజ్యం లాగానే.. వాళ్ల కన్ను వాళ్లతోనే పొడిచెయ్యాలి. అందుకు అవకాశం ఎక్కడ అని ఎదురుచూస్తున్నారు.
జనసేనకు వ్యతిరేకంగా రకకరాల ప్రయత్నాలు ఇప్పటికే జరిగాయి. వారి కంటికి మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఇపుడు కనిపించారు. వెదకబోయిన తీగ కాలికి తగినట్లు అయింది. పావులు కదిపారు. జేడీ లక్ష్మీనారాయణకు మంచి అధికారిగా పేరుంది. ఆయనను అడ్డం పెట్టుకుని ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టవచ్చని తలపోశారు. ఒకటి ప్రతిపక్ష నేత జగన్ ను జైల్లో పెట్టిన ఘనత ఈ అధికారికి ఉండటం వల్ల ఈయన భుజాల పైన తుపాకీ పెట్టి జగన్ ను తేలికగానే కాల్చవచ్చు. రెడ్డిగారిని తేలికగానే జీరో చేయవచ్చు… లక్ష్మీనారాయణ… పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి కాబట్టి… మరో వైపు కాపు ఓట్లను దిగ్విజయంగా చీల్చేయవచ్చు. జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరితే… లేనిపోని విమర్శలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే చక్కటి ప్రణాళిక తయారు చేశారు. మన వేలితోనే మన కన్ను పొడుచుకునేట్లు చేయడం అన్నమాట. లక్ష్మీనారాయణను వారి వైపుగా తిప్పుకున్నారు. ఇటు జగన్, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరి పీడా విరగడైపోతే వృద్ధ సింహం చంద్రబాబుకి ప్రాణతర్పణ చేయవచ్చు. తెలుగదేశం మళ్లీ గెలిచేందుకు మార్గాన్ని సుగమం చేయవచ్చు. మరి రేపటి నుంచీ ‘‘ఈనాడు’’ పేజీల నిండా లక్ష్మీనారాయణను పరిచేస్తారు. ఈటీవీలో ఊదర గొట్టేస్తారు. లక్ష్మీనారాయణ బెటరా? లేక పవన్ కళ్యాణ్ బెటరా అన్న చర్చలు పెద్ద ఎత్తున యల్లో మీడియా చేపడుతుంది. టీవీల్లో, పత్రికల్లో వచ్చే వాటిపైనే ప్రజలు చర్చించుకునేలా చేస్తారు. తెలియకుండానే ప్రజలు ఆ ఉచ్చులో పడిపోవడం ఖాయం. ప్రజలు ఏం ఆలోచించాలో కూడా యల్లో మీడియా నిర్ణయిస్తుంది. మీడియా పవర్ అది!పవన్ కళ్యాణ్ కంటే మంచి ఆప్షన్ గా లక్ష్మీనారాయణను చూపిస్తారు. (ఆవేశం కంటే… ఆలోచన మంచిదని చెబుతారు. ప్రియదర్శినీ హాల్లో జరిగిన సమావేశంలో సూచన ప్రాయంగా లక్ష్మీనారాయణ ఆ మాట అనేశారు). సినిమా వాళ్ల కంటే ఇలాంటి నీతిగల అధికారులు ఉండటం మంచిదని చెబుతారు. యల్లో మీడియా దీనినే నినాదంగా చేసుకుంటుంది. కాపు ఓట్లు చీలిపోయి తెలుగుదేశానికి లాభం చేకూతుంది. ప్రజలు వద్దనుకున్నా… చంద్రబాబును గద్దెపైనే ఉంచే ప్రయత్నం. ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్టుపై సంతకం చేసే వ్యక్తి.. కమ్మ సామాజిక వర్గమే అయి ఉండాలి. మిగిలిన 90 శాతం మందికి వాళ్లు బిచ్చం పడేయాలి. టార్గెట్ 2 లక్షల కోట్లు!
తెర వెనుక ఏం జరుగుతున్నది?
నాలుగు రోజుల కిందటే… లక్ష్మీనారాయణ ఈనాడు అధిపతి రామోజీరావును కలిశారు. ఆ గదిలో ఏం చర్చించారో మూడో కంటికి తెలియదు. ఆదివారం జయ ప్రకాష్ నారాయణతో భేటీ అయ్యి లక్ష్మీనారాయణ సుదీర్ఘంగానే చర్చించారు. అతికొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. లోక్ సత్తా అధినేత నాగభైరవ జయప్రకాష్ నారాయణను రంగంలోకి దింపారు. 26వ తేదీన లక్ష్మీనారాయణ పబ్లిక్ గార్డెన్స్ లో అభిమానులతో సమావేశం పెట్టారు. అంతే అప్పటికప్పుడు జరుగుతున్నట్లు.. తెరపై నటకాన్ని రక్తి కట్టించారు. అందులో భాగంగా జయప్రకాష్ నారాయణ.. లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి అభినందిస్తారు. అలాగే ఆయన ఫోన్ చేసి.. లక్ష్మీనారాయణను అభినందించారు. మధ్యాహ్నానికి జయప్రకాష్ నారాయణ వచ్చారు. అప్పటికే హాలు లోక్ సత్తా అభిమానులతో నిండిపోయింది. లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావడంపై ఆయన బోలెడంత ఆశ్చర్యపోయారు. ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. అంతా స్క్రిప్టు ప్రకారమే జరుగుతోంది. మిగిలిన వారికి ఇదంతా అప్పటికప్పుడు జరుగుతున్నట్లు కనిపిస్తుంది.
లక్ష్మీనారాయణను పావుగా వాడుతున్నారా?
జయప్రకాష్ నారాయణ, లక్ష్మీనారాయణ కలిసి ఫోటోలు దిగారు. ప్రేక్షకులు కూడా నిండు మనసుతో ఆశీర్వదించారు. సంతోషంతో ఉప్పొంగిపోయారు. దీని వెనుక తెలుగుదేశం రాజ గురువు రచించిన ‘‘గ్రాండ్ డిజైన్’’ ఉందన్నది ఎవరికీ తెలియదు. ఇవన్నీ… లక్ష్మీనారాయణకు తెలిసే జరుగుతున్నాయని అనుకోలేం. కుట్రలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. ఒక సినిమాల్లో… ఒక పిల్లవాడిని ఒక రౌడీ చేరదీస్తాడు. అన్నం పెడతాడు. పిల్లవాడికి ఏమీ తెలియదు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత… విషయం అర్థం అవుతుంది. పెద్దయిన తర్వాత వాడిని రౌడీ చేయడానికే ఇపుడు అన్నం పెడుతున్నాడని పిల్లవాడికి ఎలా తెలుస్తుంది? కానీ ఇలాంటి ఉచ్చులో పడితే.. బయటకు రాలేం. లక్ష్మీనారాయణ లోక్ సత్తాకు అధినేత కావడం, ఆయనకు జయ ప్రకాష్ నారాయణ సలహాలిచ్చే పాత్రలో ఉండటం… ఇవన్నీ కూడా ‘‘గ్రాండ్ డిజైన్’’ ప్రకారమే సాగుతున్నాయని తెలుస్తున్నది.
లోక్ సత్తా పార్టీలో లక్ష్మీనారాయణ చేరాలని, పార్టీ పగ్గాలు చేపట్టాలని జయప్రకాష్ నారాయణ కోరారు. అందుకు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. దీని గురించి ఆలోచిస్తానన్నారు. లక్ష్మీనారాయణ ఆలోచిస్తానని చెప్పినా, ఈనాడు మాత్రం లోక్ సత్తా అధినేతగా లక్ష్మీనారాయణ అని శీర్షిక పెట్టి వార్త రాసేసింది.
ప్రజల స్పందన ఏమిటో చూసి.. త్వరలో.. లక్ష్మీనారాయణ నిర్ణయం తీసుకుంటారాన్నమాట. నాగభైరవ జయ ప్రకాష్ నారాయణ పార్టీకి పెద్ద దిక్కు. ఈ విషయాన్ని ‘‘ఈనాడు’’ తన వార్తలో ముందే చెప్పేసింది. లక్ష్మీనారాయణకు చెందిన వార్తలన్నీ కూడా ‘ఈనాడు’లో మాత్రమే ప్రముఖంగా ప్రచురణ కావడం కూడా గమనార్హమైన విషయం. తెర వెనుక ప్లానింగ్ జరిగినట్లు బయటకు పొక్కనివ్వరు. ప్రజలు మూర్ఖులనీ, వారికి తెలియకుండా, వారికి ఏమీ చెప్పకుండా… తెర వెనుక ఒప్పందాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టవచ్చని తెలుగుదేశం అధినాయకత్వం ఎప్పుడూ భావిస్తుంది. ఉన్నతస్థాయిలో కమ్మక్కైపోతారు. మీడియాకి అంతా సహజమైన మార్పులుగానే చూపిస్తారు. జనం మోసపోయేది ఇక్కడే. మీడియా, పాలకవర్గాలు కలిసిపోతే జరిగే నష్టమిదే. ప్రజలకు నిజాలు తెలియకుండా పోతాయి.
కాపులు అధికారంలోకి రాకూడదన్నదే యల్లో మీడియా లక్ష్యం!
కాపుల విషయంలో యల్లో మీడియా ఏం చేస్తున్నదనేది అనేక అనుభవాల్లో తేలిపోయింది. చిరంజీవి వంటి వారిని ముందు ఆకాశానికి ఎత్తారు. తర్వాత చెత్త బుట్టలో పడేశారు. చిరంజీవి బాహుబలి అనుకుంటే.. పక్కనున్న కట్టప్పలతో వెన్నుపోటు పొడిపించి… చిరంజీవిలాంటి మంచి వ్యక్తిని చరిత్రలో కలిపేశారు. కాకాపోతే.. ఇపుడు కూడా కట్టప్పనే ప్రయోగిస్తున్నారు. కాకపోతే ఈ సారి బయట నుంచి ప్రయోగిస్తున్నారు. జనసేన లోపలి వారిని కట్టప్పగా తయారు చేయడం ప్రస్తుతానికి సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే పవన్ ప్రజారాజ్యంలో జరిగిన అనుభవం దృష్ట్యా జాగ్రత్తగా ఉంటున్నారు. అరేబియా సముద్రం నుంచి ముంబయికి వచ్చి తాజ్ హోటల్ ను పేల్చేయడం ఒకసారే సాధ్యం. మళ్లీ అదే రూటులో సాధ్యం కాదు. ఈ సారి రూటు మార్చుతారు. అందుకే ప్రజారాజ్యం-2 ప్రణాళికను తెరపైకి తెస్తున్నారు.
జేపీ కూడా ఆ తానులో ముక్కే!
లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ ఎంత నిరంకుశడన్నది ఆయనతో పని చేసిన ఒక ఉద్యోగి యూట్యుబులో ఒక వీడియో పెట్టారు.
నిజానికి జయ ప్రకాష్ నారాయణ రాజకీయాల్లోకి రాక పూర్వం ఈనాడులో అనేక కథనాలు రాశారు. ఈటీవీలో చర్చా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈనాడు అధినేత రామోజీరావు చేసిన ఒక ప్రయోగం- జయ ప్రకాష్ నారాయణ అన్నది అందరికీ తెలిసిందే. జయప్రకాష్ నారాయణకు నిధులు అందిస్తున్న పెద్దలు అనేక మంది ఆయన సొంత కమ్మ సామాజిక వర్గమే. మేధావి అన్న ముద్ర ఉన్న కమ్మ సామాజిక వర్గం ప్రముఖులతో పెద్దలు ఆడుతున్న నాటకాలే ఇవన్నీ కూడా. ఇద్దరి నారాయణలనూ కలిపి.. మరో కొత్త ప్రయోగానికి తెలుగుదేశం పెద్దలు చేస్తున్న కొత్త పన్నాగం తప్ప ఇది మరొకటి కాదు.
ఓయీ… పవన్ కళ్యాణ్… ఓయీ యోధుడా! ఒంటరిగా పోరాడుతున్నావు!! 2 లక్షల కోట్ల బడ్జెట్టుపై నీకు పట్టింపు లేదు. కానీ కొంతమందికి అదే కావాలి. ప్రజలకు మేలు చేయాలన్న తపన నీది. ప్రజల సొమ్ము మింగేదామన్న ఆత్రం అవతలివారిది. తినాలనుకున్న శవాలు తమకు దక్కుతాయో లేదోనని రాబందులు ముక్కులో నుంచి కారుతున్న రక్తాన్ని చప్పరిస్తూ అల్లంత దూరంలో కొండపైన ఉన్నాయి. యోధుడా.. అమ్మ ఆశీర్వచనమే నీకు శ్రీ రామ రక్ష అవుగాక. ధర్మో రక్షితి రక్షిత: అన్న నీ మాటలే మంత్రాక్షరాలై నీకు అండగా ఉంటాయి. ప్రజలే సైనికులుగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నీ ఆవేశంలో నిజం ఉంది. నీ ఆవేశంలో బాధ ఉంది. నీ ఆవేశంలో అవినీతిపరుల కుత్తుకలను ఒక్క ఉదుటున ఉత్తరించాలన్నవీర శివాజీ ఉగ్రత ఉంది.
వృద్ధ మంత్రగత్తె తెలుగుదేశానికి పునర్ యవ్వనాన్ని ఇవ్వాలన్న కుయుక్తులు సాగవు… సాగవు… సాగవు… ముమ్మాటికీ సాగవు!! ఏమంటారు?
Yes it true
Yes it’s true.. thanks
Vrudda simham word baga popular cheyyandi frnds
Saamanya Prajalaku avineeti palakula kutralanu teliyacheyavalasina baadyata prati okka jana sanikuni meeda vunnadi.
Yellow media yevaritarupuna pracharamu chesinaa daanini adhikara party yettugadagaa gurtinchevidhamuga janasainikulu prajalanu apramattamu cheyaali.
Vrudha simham kadu sodara.. musali nakka ithe baaga set avutadi
Well said,same going to happen but janasiniks will counter all dramas from tdp and make people aware of truth.Good job NewsOf9 👏👏.
Yes it’s true
Entha chakkati puulihora 🙂
Yes True JD should think for people’s shake and support to pawan
Useful information thank you
Avunu sir vallu mararu