కవచం మూవీ రివ్యూ

December 7, 2018 | News Of 9
Kavacham movie review

చిత్రం: కవచం

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ – మెహ్రీన్ కౌర్ – నీల్ నితిన్ ముకేశ్ – హర్షవర్ధన్ రాణె – ముకేష్ రుషి – పోసాని కృష్ణమురళి – సత్యం రాజేష్ జబర్దస్త్ వేణు తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు

మాటలు: అబ్బూరి రవి

రచనా సహకారం: కేశవ్

నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ల

రేటింగ్: 2.25/5

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. మొన్న తీసిన సాక్ష్యం బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడినప్పట్టికి రెట్టించిన ఉత్సాహంతో మరో చిత్రం తో మన ముందుకి వచ్చాడు. కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ల రూపొందించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం!

కథ:

వైజాగ్ లో విజయ్ త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో. అనుకోని పరిణామాల మధ్య ప్రమాదం లో ఉన్న సంయుక్త అనే అమ్మాయిని కాపాడతాడు. తర్వాత ఒక ఆక్సిడెంట్ లో విజయ్ అమ్మకి సంయుక్త సాయం చేస్తుంది. సంయుక్తకి సాయం చేసిన తరువాత విజయ్ అనూహ్యంగా చిక్కుల్లో పడతాడు. కిడ్నప్ కేసుల్లో ఇరుక్కుంటాడు. ఈ ప్రోబ్లేమ్స్ అన్నింటిని విజయ్ ఎలా చేధించాడు…సంయుక్త కథేంటి అనేదే ఈ చిత్రం.

కథనం – విశ్లేషణ:

థ్రిల్లర్ కథలు అంటే ప్రేక్షకుడు ప్రతి సన్నివేశానికి ఏదొక అనుభూతి చూడాల్సి ఉంటుంది. నిన్న కాక మొన్న తమిళంలో వచ్చిన “రట్ససన్” అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమాని ఒక ఇమేజ్ ఉన్న హీరో కాకుండా మాములు కథానాయకుడు చేసాడు. ఆ కథలో హీరోని ఎలివేట్ చేసే అంశాలు ఉండవు. ఫైట్లు ఉంటాయి కానీ కథలో ఇమిడి ఉంటాయి.

కవచం అనే థ్రిల్లర్ సినిమాలో ఇదే మిస్ అయ్యింది. స్టోరీని పక్కన పడేసి హీరోకి అనవసరపు ఎలివేషన్లు ఎక్కువ అయ్యాయి.పంచ్ డైలాగ్స్ వాడి ఉన్న స్టోరీ ని ఇంకా పాడు చేసారేమో అనిపిస్తుంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ థ్రిల్లర్ కథను హీరో ఎలివేషన్లతో కమర్షియల్ స్టయిల్లో చెప్పబోయి దీన్ని ఎటూ కాకుండా తయారు చేశాడు. కథేంటో చెప్పమంటే వివరించడానికి కొంచెం కష్టపడే స్థాయిలో కొన్ని మలుపులతో స్టోరీ వరకు బాగానే రాసుకున్నాడు శ్రీనివాస్ మామిళ్ల. కానీ ఈ మలుపుల్ని ఆసక్తికర రీతిలో తెరమీద ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకం. కానీ ‘కవచం’ ఆ ఆసక్తిని రేకెత్తించడంలోనే విఫలమైంది. దీనికి ప్రధాన కారణం దర్శకుడి ఔట్ డేటెడ్ నరేషనే. థ్రిల్లర్ సినిమాల్లో నేరుగా తొలి సన్నివేశంతోనే కథను మొదలుపెట్టడం.. ప్రతి సన్నివేశాన్ని కథతోనే లింక్ చేస్తూ ఆసక్తికర స్క్రీన్ ప్లేతో నడిపించడం అవసరం. కానీ మొదలు మొదలే హీరో ఎలివేషన్.. ఇంట్రడక్షన్ సాంగ్ తో ఒక సగటు సినిమాను తలపిస్తుంది ‘కవచం’. ‘‘నేను బిల్డప్ ఇవ్వను బ్రో’’ అంటూ హీరో మీద ఇంట్రో సాంగ్ తీశారు కానీ.. సినిమా మొత్తం ఆ బిల్డప్పులకే సరిపోయింది. హీరోకు ఎలివేషన్ ఇవ్వడానికి అవసరం లేని ఫైట్లు.. పాటకు టైం అయిందన్నట్లుగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వచ్చే పాటలు.. కాసేపటికే సినిమాను పక్కదారి పట్టించేస్తాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్టుతో కానీ ప్రేక్షకుడు సినిమాలో లీనం కాని పరిస్థితి.

అస్సలు హీరో గారు ఎం చెయ్యాలో అర్ధం కాని టైం లో విలన్ ఫోన్ చేస్తాడు. పోలీసోడితో పెట్టుకుంటున్నావ్ అంటూ సవాలు విసిరినప్పుడు ప్రేక్షకుడికి ఎం చెయ్యాలో అర్దం కాదు.

హీరో కోసం సిటీ అంత గాలిస్తుంటే హీరో మాత్రం చక్కగా సిటీ లో తిరుగుతూ అతని సమస్యల్ని చెమటపట్టకుండా సాల్వ్ చేసుకుంటూ పోతాడు.

సెకండ్ హాఫ్ కొంచెం మెరుగు. ట్విస్ట్ లు ఉన్నాయి. నెక్స్ట్ ఏమవుద్దీ అని కొంచెం సస్పెన్స్ ఉంటుంది. అది ఒక్కటే సినిమా మొత్తనికి ప్లస్ పాయింట్. కానీ ఇక్కడ కూడా ఏదో ఈ టైం కి సాంగ్ పడకపోతే ప్రేక్షకుడు కొడతాడు అన్నట్టు సాంగ్స్ ఫైట్స్ పెట్టి దాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయి.

నటీనటులు:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అతని పాత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం మెచ్యూర్ గా నటించాడు.. పోలీస్ పాత్రకు తగ్గ ఫిజిక్ తో లుక్ పరంగా ఓకే అనిపించాడు. ఎప్పట్లాగే వాయిస్ విషయంలో శ్రీనివాస్ కు మైనస్ మార్కులే పడతాయి. హీరోయిన్లిద్దరూ అందంగా కనిపించారు. గ్లామర్ షో చేశారు. ఇద్దరివీ కథలో కీలక పాత్రలే కానీ.. నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. విలన్ నీల్ నితిన్ ముకేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హర్షవర్ధన్ రాణె ఓకే. మిగతవారు వారి వారి పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతికవర్గం:

థమన్ మ్యూజిక్ ఎప్పటిలానే ఉంది. చెప్పుకోవడానికి ఎం లేదు. చోట కె నాయుడు ఛాయాగ్రహణం చాలా బాగుంది. ప్రతి ఫ్రేములోను రిచ్ నెస్ కనబడుతుంది. శ్రీనివాస్ మామిళ్ళ ఏదో చూపిస్తాడు అనుకున్నవాళ్లకు నిరాశే మిగిల్చాడు.. అతడి నరేషన్ ఈ ట్రెండుకు తగ్గట్లు లేదు. కథ విషయంలో కసరత్తు చేసిన విషయం కనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా రాసుకోలేదు. సినిమాకు అదే ప్రధాన లోపం. దర్శకుడిగా శ్రీనివాస్ ఒక ముద్రంటూ వేయలేకపోయాడు.

చివరగా: కవచం.. చిరిగింది

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *