కవచంను విడుదల చేస్తున్న రెడ్ హార్ట్ మూవీస్..

December 1, 2018 | News Of 9

ఓవర్సీస్ లో బెల్లంకొొండ శ్రీనివాస్ కవచంను విడుదల చేస్తున్న రెడ్ హార్ట్ మూవీస్..

Kavacham Movie

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. క‌వ‌చం యుఎస్ డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల‌ను రెడ్ హార్ట్ మూవీస్ తీసుకున్నారు. డిసెంబ‌ర్ 6నే భారీగా ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీజ‌ర్ కు 10 మిలియ‌న్ వ్యూస్ దాటి అద్భుత‌మైన స్పంద‌న తెచ్చుకుంది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను తెర‌కెక్కించాడు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్ర‌స్తుతం వేగంగా జ‌రుగుతున్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 2న ఆడియో లాంఛ్ కార్య‌క్రమం భీమ‌వ‌రంలో భారీగా జ‌ర‌గ‌నుంది. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో న‌వీన్ సొంటినేని(నాని) క‌వ‌చం సినిమాను నిర్మిస్తున్నారు.
న‌టీన‌టులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌..
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ మామిళ్ళ‌
నిర్మాత‌: న‌వీన్ చౌద‌రి సొంటినేని (నాని)
నిర్మాణ సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్
స‌హ నిర్మాత‌: చాగంటి సంత‌య్య
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్
సినిమాటోగ్ర‌ఫర్: ఛోటా కే నాయుడు
ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్
ఆర్ట్ డైరెక్ట‌ర్: చిన్నా
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *