నన్ను అంతం చేయడానికే కుట్ర జరుగుతోంది: రేవంత్

November 30, 2018 | News Of 9

Killer teams engaged to eliminate me: Revanth Reddy Newsof9

వికారాబాద్ జిల్లా: ‘‘సీఎం కేసీఆర్  అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తున్న తనను అడ్డు తోలిగించుకుంటానని అసెంబ్లీలో నే చెప్పారు. ప్రస్తుత పరిస్ధితులను చూస్తే దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కోడంగల్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం కేసీఆర్… డీజీపీ మహేందర్ రెడ్డి లపై రేవంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. మహేందర్ రెడ్డి డీజీపీగా అయిన తర్వాత తనపైనా, కార్యకర్తల పైనా దాడులు పెరిగాయనీ, తన హోదా పెరిగినా… భద్రతను మాత్రం తగ్గించారని ఆయన దుయ్యబట్టారు. ‘‘నా భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికీ ఫీర్యాదు చేశా. దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర  ఇంటలిజెన్స్ చెప్పినా పట్టించుకోలేదు. కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదు’’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో 4+4 తో భద్రత కల్పించాలని రాష్ట్ర  హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

‘‘మహాకూటమితో పాటు. . నా పర్యటన వల్ల కేసీఆర్ అధికారం కొల్పోతున్నాడని స్పష్టం మైన సర్వేలు ఉన్నాయి. నా ఫై 39 కేసులు పెట్టించారు… నా పై కేసుల వివరాలను అడిగితే డీజీపీ కూడా ఇవ్వలేదు’’ అని అన్నారు. తన నామినేషన్ ను తిరష్కరించాలనే కేసుల వివరాలు ఇవ్వలేదనీ, కోర్టు తలుపుతడితే అప్పుడు కోర్టుకు తెలియ జేశారని అన్నారు.

తనను అంతం చేయడానికి నక్సల్స్ ఎరివేతలో ఉన్న కొందరు సుక్షితులైన అధికారులను రంగంలోకి దింపారని రేవంత్ ఆరోపించారు. అందులో భాగంగానే బౌతిక దాడులకు పాల్పాడాలని చూస్తున్నారు. ‘‘మీపై దాడి చేసి అడ్డు తొలగించుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు పోలీస్ శాఖలోని కొందరు చెప్పారు. నాపై దాడిచేసి నక్సల్స్ పైన తోసే ప్రయత్నాలు జరుతున్నాయన్న సమాచారం ఉంది’’ అని రేవంత్ వెల్లడించారు. కోర్టు అదేశాలు అమలు చేసి తక్షణమే రక్షణ కల్పించాలి’’ అని కోరారు. దాడులు జరుగుతాయన్న స్పష్టం మైన సమాచారం ఉండడంతో తన మూడు రోజుల పర్యటనను వాయిదా వేసుకున్నాను’’ అని తెలిపారు.  

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *