తట్టండి తలుపు.. కొత్త రాజకీయాలకు మలుపు

December 4, 2018 | News Of 9

Knock the doors... it opens new politics | Newsof9

  •  అవినీతిమయమైన ఈ రాజకీయాలు ఎందుకు మారాలో చెప్పండి
  •  రేపు ఉదయం 11 గంటలకి ‘జనసేన తరంగం’ కార్యక్రమానికి శ్రీకారం
  •  ఫేస్ బుక్ లైవ్ ద్వారా ‘జనసేన తరంగం’ గురించి వెల్లడించిన జనసేన అధ్యక్షుడు పవన్         కల్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ మేనిఫెస్టో అంశాలు, సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు తెలియచెప్పేందుకు ‘జనసేన తరంగం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి ఇంటి తలుపు తట్టి మేనిఫెస్టోలోని ఆలోచన విధానాలు,  ఏడు సిద్ధాంతాలను వివరించాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు ‘జనసేన తరంగం’ మొదలవుతుందని తెలిపారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో మొదలయ్యే ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటునట్లు చెప్పారు. మంగళవారం ఉదయం అనంతపురం నుంచి ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను జన సైనికులతో పంచుకున్నారు.
పవన్ కల్యాణ్  మాట్లాడుతూ “5వ తేదీ నుంచి అయిదు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియచెప్పే ఉద్దేశంతో జనసేన తరంగం కార్యక్రమం చేపట్టాం. ఇందులో ప్రతి యువకుడు, యువతి, పెద్దలు పాల్గొని- కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా రేప‌టి త‌రం కోసం జనసేన చేస్తున్న నవతరం రాజకీయాలను తెలియచెప్పాలి. ఇన్నాళ్ళు కుల, మత, ప్రాంతాల ముసుగులో యువతను అభివృద్ధికి దూరం చేసేశారు. ఎందుకు రాజ‌కీయాలు మారాలో చెబుతూ మన పార్టీ ప్రజలకు ఎలా అండగా నిలుస్తుందో వెల్లడించండి. 25 కేజీల బియ్యం కాదు…25 సంవత్సరాల భ‌విష్య‌త్ ఇచ్చేందుకు జనసేన ఉంది. రాష్ట్రాన్ని బంగారు ఆంధ్ర‌ప్ర‌దేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్,ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేసేందుకు ముందుకు వెళ్తున్నాం. జన సైనికులు వెళ్లదలచుకున్న ఇంటి తలుపు తట్టి పార్టీ గురించి వివరిస్తూ ఫేస్ బుక్ లైవ్ పెట్టండి. నేను కూడా ఈ క్రమంలో లైవ్ ద్వారా కొందరితో మాట్లాడతాను. వచ్చే అయిదు రోజులూ ఉధృతంగా జనసేన తరంగం కార్యక్రమం చేద్దాం. అవినీతిమయంతో నిండిపోయి అభివృద్ధికి దూరం ప్రజలను దూరం చేసేశారో వివరిద్దాం. ప్రజలను భాగస్వామ్యం చేసి అభివృద్ధిలో మమేకం చేద్దాం. ప్రతి ఒక్కరికీ జనసేన ఆశయాలను తెలియచేద్దాం” అన్నారు.
జనసేన తరంగం కార్యక్రమం వివరాలు
జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో అంశాలు, నవతరం రాజకీయాలతో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఏమి చేయబోతున్నదీ ప్రజానీకానికి వివరించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం ‘జనసేన తరంగం’. జన సైనికులు తమ గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్ళి ఆ ఇంట్లోనివారికి జనసేన సిద్ధాంతాలను, మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లో పొందుపరచిన అంశాలను వివరించి కరపత్రాన్ని అందజేస్తారు. ఆ ఇంటికి వెళ్ళిన జన సైనికులలో ఒకరు కార్యక్రమం కోసం నియమించిన హ్యాష్ టాగ్ తో ఫేస్ బుక్ లైవ్ తీసుకుంటారు. సిద్ధాంతాలను, మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ అంశాలను తెలిపిన అనంతరం ప్రజల అనుమతితో వారి ఫోన్ నెంబర్ నుంచి 9010101170 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పిస్తారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు జనసేన తరంగం మొదలవుతుంది. 9వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Other Articles

2 Comments

  1. Its like you read my mind! You appear to know so much about this, like you wrote
    the book in it or something. I think that you can do with some pics to drive the
    message home a little bit, but other than that, this is magnificent blog.
    A fantastic read. I will definitely be back.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *