కోడెల శివప్రసాద్ కన్నుమూత

September 16, 2019 | News Of 9

ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల హైదరాబాదులోని తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఆయన గుండెపోటు కారణంగా హైదరాబాదులోని బసవతారకం ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటు కారణంగా మరణించారా అన్నది తేలాల్సి ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోడెలతో పాటు ఆయన కుటుంబసభ్యులపైనా వరుస కేసులు నమోదయ్యాయి. ఆయన కుమార్తె, కుమారుడిపై కూడా కేసులు నమోదయ్యాయి.

ఇటీవల ఏపీ ప్రభుత్వ ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించుకోవడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిరోజులకే ఆయన హఠాత్తుగా కన్నుమూయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు వరుస కేసులు చుట్టుముట్టడం మరోవైపు టీడీపీ అధినాయకత్వం సైతం ఈ విషయాలను అంతగా పట్టించుకోకపోవడం కూడా కోడెల మనస్థాపానికి కారణం కావచ్చని కూడా ప్రచారం సాగుతోంది.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *