హైదరాబాద్‌ నం.1 విజ‌య్ దేవ‌ర‌కొండ‌

March 14, 2019 | News Of 9
Vijay devarakonda
టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ స్టార్ రేంజ్ మ‌రింతా పెరుగుతోంది. తాజాగా 2018 హైదరాబాద్‌ మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌ లిస్ట్‌లో విజయ్ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. హైదరాబాద్‌ టైమ్స్ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ టాప్‌ హీరోలు ప్రభాస్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి విజయ్‌ మొదటి స్థానం దక్కించుకున్నాడు.
గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన విజయ్‌ దేవరకొండ, ఈ ఏడాది తొలి స్థానంలో నిలిచి సత్తా చాటాడు. గత ఏడాది తొలి స్థానం సాధించిన మోడల్ బసీర్‌ అలీ ఈ ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లోనూ నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు.
 వ‌రుస సినిమాల‌తోనే కాదు క్రేజ్‌ పరంగానూ విజయ్‌ ఇమేజ్ టాప్ ప్లేస్‌కు చేరింది. పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలు విజయ్‌ ఇమేజ్‌ను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లాయి. మోస్ట్ వాంటెడ్ యూత్ హీరోల లిస్ట్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంటున్న‌ విజయ్ దేవరకొండ కథలు ప్రాజెక్ట్స్ విషయంలో ఎక్కడా ఆలస్యం జరగకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు వచ్చేలా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *