ఎల్లో టీంలో కౌషల్ ఆర్మీ..?

March 9, 2019 | News Of 9

Koushal Army in Yello Team | telugu.newsof9.com

నిన్నటి దాకా ఫౌండేషన్ నిధులు కాజేశాడని ఆరోపించిన కౌషల్ ఫ్యాన్స్ ఇప్పుడు అతని అసలు రంగు చూడమంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కౌషల్ దిగిన ఫొటోను షేర్ చేస్తూ మరో కొత్త ఆరోపణకు తెరలేపారు. ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమనీ, ఆయన కోసం ప్రాణమిచ్చేస్తాననీ చెప్పుకుని పవన్ ఫ్యాన్స్ ను సైతం ఏమార్చాడంటున్నారు. ఇప్పటికైనా కౌషల్ నిజస్వరూపాన్ని అందరూ తెలుసుకోవాలంటున్నారు. పవన్ అంటే ప్రాణం అంటూనే తెలుగు దేశం పార్టీకి ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాడని జనసైనికులు తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ను విమర్శించే వారందరిదీ ఒకే స్ట్రేటజీ.. మొదట పొగడడం.. నెమ్మదిగా అసలు బుద్ది చూపించడం ఆనక పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారంటూ మీడియాకెక్కడం. అప్పట్లో సినీ నటుడు శివాజీ, ఆ తర్వాత కత్తి మహేష్, శ్రీరెడ్డి అందరూ ఒకే టెక్నిక్ అప్లై చేశారు. ఇప్పుడు కౌషల్ కూడా ఆ లిస్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.. అయితే పవన్ ఫ్యాన్స్ కూడా ట్రెండ్ మార్చారు. ఎవరినీ ప్రత్యేకంగా ట్రోల్ చేసి ప్రచారానికి అవకాశం ఇవ్వడం లేదు. తమ నాయకుడు సూచించినట్లుగానే ఎన్నికల ప్రచారం మీదే దృష్టి పెట్టి ఇలాంటి వాటికి ప్రచుర్యం ఇవ్వడం మానేశారు.

దాంతో ప్రత్యర్థి పార్టీలు నియమించిన పెయిడ్ ఆర్టిస్టులే ప్రస్తుతం ఈ పాత్ర పోషిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ముసుగులో ట్రోల్స్ చెయ్యడం.. ఇతర హీరోల ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బయటి నుంచి దుష్ప్రచారాలు చేసేవారి కంటే ఇలాంటి ముసుగు ఫ్యాన్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది అని కొందరు పరిశీలకులు అంటున్నారు. జనసైనికులు మాత్రం ఇలాంటి వాళ్లెవరు వచ్చినా నష్టం లేదనీ, ఇదంతా పని చేసేవాళ్లని తప్పుదోవ పట్టించేదుకు చేసే ప్రయత్నాలే తప్ప మరేం కాదని కొట్టి పారేస్తున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *