కూటమికి 75 నుంచి 80 వస్తాయంటున్న ఉత్తమ్

December 8, 2018 | News Of 9

Kutami will get 75 to 80 seats: Uttam | Newsof9

హైదరాబాద్: తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని, 75 నుంచి 80 సీట్ల వరకూ వస్తాయని టీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. గోల్కొండ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ లో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.
ఎన్నికలను సరిగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని, ఈసీ సీఈవో క్షమాపణ కోరారని అన్నారు. ఓటరు స్లిప్పులో తప్పులు దొర్లాయని అన్నారు. ఈవీఎంల విషయంలో ట్యాంపరింగ్ ఉండొచ్చని, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈవీఎంలను భద్రతలేని ప్రాంతాల్లో ఉంచడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూము నుంచి కౌంటింగ్ వద్దకు వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మొన్నటి వరకూ 100 సీట్లు వస్తాయన్న కేటీఆర్ ఇపుడు 80 అంటున్నారు. రేపు 11వ తేదీ వచ్చే సరికి 30 సీట్లకు వస్తారని అన్నారు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ గురించి రాజ్ దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ…వాటిని నమ్మవద్దని కోరారని చెప్పారు.
ఎన్నికల కమిషన్ విఫలమయిందని, లక్షలాది ఓట్లు విఫలమయ్యాయని ఉత్తమ్ తెలిపారు. ప్రజలు ప్రజా కూటమివైపే ఉన్నారని, కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహం ఉందని అన్నారు. కూటమిగా వెళ్లడమే కలిసి వచ్చిందని అన్నారు.
కూటమి గా ముందుకు వెళ్లడం కలిసి వచ్చింది. ఎన్నికల్లో వందల కోట్లు వెదజల్లారని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, మంద కృష్ణ మాదిగ కూడా మాట్లాడారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *