లగడపాటీ…సర్వేలు ముందే చెప్పడానికి కారణం అదేగా?

December 5, 2018 | News Of 9

Lagadapati election surveys for Kondapalli power plant? | Newsof9

అమరావతి: మాజీ ఎంపీ, వ్యాపారవేత్త అయిన లగడపాటి రాజగోపాల్ ను ‘‘ఆంధ్రా ఆక్టోపస్’’ అని పిలుస్తారు. ఎలక్షన్ సర్వేల విషయంలో ఈ సారి ఆయన తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు సమాచారం. విజయవాడ నుంచి ఒక సీనియర్ జర్నలిస్టు అందించిన వివరాల ప్రకారం… కాంగ్రెసు నుంచి లగడపాటి రాజగోపాల్ పై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నది. 7వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాతనే సర్వే ఫలితాలను చెబుతానని ఆయన ముందు అన్నారు. కానీ ప్రచారం ముగుస్తున్న ఒక రోజు ముందే ఎందుకు చెప్పారంటే… ఆయన సర్వే ఫలితాలను గురించి చెప్పాల్సిందిగా ఒత్తిడి వచ్చింది. ముందే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్న ప్రశ్నకు లగడపాటి సమాధానం ఇవ్వలేకపోయారు.

రెండో కారణం ఏమంటే… కాంగ్రెసు నేతృత్వంలోని ప్రజా కూటమి గురించి ఆయన చెప్పిన అంచనా సరిగా లేదు. గత మూడు వారాలుగా చూస్తే కాంగ్రెసు పరిస్థితి కొద్దిగా మెరుగైన మాట వాస్తవమే. మరీ ముఖ్యంగా సోనియా గాంధీ తెలంగాణకు వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగైంది. అసెంబ్లీని రద్దు చేసే సమయానికి కాంగ్రెసు 20 సీట్లు గెలుచుకునే పరిస్థితి మాత్రమే ఉంది. తర్వాత తెదేపాతో జతకూడిన తర్వాత కాంగ్రెసు పరిస్థితి 10 సీట్లకు పడిపోయింది. తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చిందీ సోనియానే అంటూ కాంగ్రెసు చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది.

ఈ సమయంలో తెరాసకు కొన్ని సీట్లు తగ్గే పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ రద్దయ్యే సమయానికి తెరాస కనీసం 90 సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉండింది.

అయితే లగడపాటి చెబుతున్నట్లు… తెరాస అధికారాన్ని కోల్పోయే పరిస్థితి అయితే పూర్తిగా లేదు. లగడపాటి రాజగోపాల్ పూర్తిగా కాంగ్రెసు- తెలుగుదేశం ఒత్తిడికి తలవంచారని తెలిసిపోతున్నది. ఆయనకు ఉన్న ఇబ్బంది ఏమిటంటే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి ఆయన ఖమ్మం లోక్ సభ సీటును ఆశిస్తున్నారు. ఈ కారణంగానే లగడపాటి ఇవిగో ఫలితాలు అంటూ 5వ తేదీ కంటే ముందు చెప్పాల్సి వచ్చింది.

మరో ముఖ్య విషయం ఏమంటే… లగడపాటి గారికి కొండపల్లిలో ఒక పవర్ ప్లాంటు ఉన్నది. ఇదిప్పుడు మూతపడింది. దీనిని తెరిపించుకునేందుకు చంద్రబాబుగారితో లాలూచీ పడుతున్నారు. లగడపాటి పూర్తిగా చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన పరిస్థితి ఉంది. చంద్రబాబు అమరావతిలో ఉన్న ప్రతిసారీ ఆయన ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. సొంత పనులు చేసిపెట్టాల్సిందిగా ప్రాదేయపడుతున్నారు.

దీంతో… సర్వే ఫలితాలను కాంగ్రెసు కూటమికి అనుకూలంగా లగడపాటి ప్రకటించాల్సి వచ్చి ఉంటుంది. ఎన్నికల ముందే ఓటర్లను ప్రభావితం చేసి, చంద్రబాబు మెప్పు పొందడం కోసమే ఆయన ఇలా చేశారు. అధికారంలోకి రావడానికి… ప్రజలతో సంబంధంలేకుండా చంద్రబాబు కుయుక్తులు చేస్తారని, డబ్బులు వెదజల్లుతారని, అదే ఆయన చాణక్యమని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ చెబుతూనే ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంతా సజావుగా ఉన్నట్లు చూపిస్తారు. ‘‘తెలుగుదేశం ప్రైవేటు లిమిటెడ్’’ ఎలాంటిదో తెలుసుకోవడానికి తెలుగులో ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వడానికి సాహసం చేయని వ్యాసాలను ‘‘డీకోడింగ్ టీడీపీ’’ పేరుతో వరుసగా ‘‘న్యూస్ ఆఫ్ 9’’ అందిస్తోంది. కుయుక్తులతో ఎన్నికలను గెలుచుకునే రాజకీయాలు పోవాలి. ప్రజల ఆదరాభిమానాలతోనే ఎన్నికలను గెలుచుకునే పరిస్థితులు రావాలి. ప్రజల్ని మోసం చేసి గట్టెక్కుదామనుకుంటున్న వారికి ప్రజలు ఇంటిదారి చూపిస్తారు.

స్వప్రయోజనాల కోసం చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్ చేసే కుయుక్తులతో తెలంగాణలో కాంగ్రెసు కూటమి అధికారంలోకి వచ్చేస్తుందా? వేచి చూద్దాం!!

అష్టకష్టాలూ పడుతున్న రాజగోపాల్

తెలంగాణకు తాను వ్యతిరేకమైనందునే… ఫలితాలను తారుమారు చేశారంటూ వస్తున్న విమర్శలు సరికాదని, తాను స్వచ్ఛమైన హృదయంతోనే ఫలితాలను చెప్పానంటూ లగడపాటి చెబుతున్నారు. ఆయన బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకోసం ఆయన నానా తంటాలు పడుతున్నారు. ఆయన కష్టాలు చూస్తుంటే ఎవరికైనా నవ్వు రాక మానదు. విలేకరుల సమావేశంలో రాజగోపాల్ ఏం చెబుతున్నారంటే… తెలంగాణ ప్రజలు రాజగోపాల్ ను తెలంగాణకు వచ్చి పోటీ చేయమని కోరుతున్నారట.. ఏం మేనేజ్ చేస్తున్నారు లగడపాటి గారూ..? అంటే ఖమ్మం నుంచి పోటీ చేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారా…? ఒక ఫీలర్ అయితే వదిలేశారు. ప్రజల్ని నమ్మించడానికి ఒక గంట సమయం సరిపోతుందని కూడా ఆయన చెబుతున్నారు. ఆహా… ఎన్ని తెలివితేటలు? తెలంగాణ జర్నలిస్టులు మాత్రం ఆయన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నించడం విశేషం. మరో ముఖ్య విషయం ఏమంటే… చంద్రబాబును వదులుకోవద్దని ఆయన కేటీఆర్ కు చెప్పారంట.. అంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోమని ఆయనకు సలహా ఇవ్వడం. ప్రజల్ని పిచ్చివాళ్లను చేయడం కాదూ? అందుకే ఇలాంటి దగుల్భాజీ రాజకీయాలు మారాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరుతున్నది. పర్సంటేజీలు లెక్కలేసుకుని ప్రజల అభీష్ఠానికి వ్యతిరేకంగా అందలాలు ఎక్కడానికేగా ఈ చచ్చు లెక్కలన్నీ? లగడపాటి సామాజిక వర్గం వారికి రాజకీయాలతో సహా అన్నీ వ్యాపారమే. అన్నీ లెక్కలే. ఒంటరిగా పోటీ చేసి తెరాస మంచిపనే చేసింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *